వివాహేతర సంబందాలు పిల్లల ను ఎలా బలి తీసుకుంటాయో తెలిపే "వెంకటమ్మ విజయ" గాద !
వివాహేతర సంబందాలులో వ్యామోహానికి ఉన్నవిలువ తతిమ్మావిషయాలకు ఉండదు.ముక్యంగా అందులో ఒకరికి అందులో అంతకు ముందే పెండ్లి అయి ఉండి ,వారితో కలిగిన సంతానం ఉండి ఉంటే మాత్రం ఆ పిల్లల పరిస్తితి మాత్రం నిజంగా దురద్రుష్టకరం. తల్లి తండ్రులు చేసే తప్పుడు వారిని సమాజంలో తల ఎత్తుకోలేకుండా చేయడమే కాక చివరకు తమ ప్రాణాలకు కూడా భద్రతా లేకుండా చేస్తుందని , ఖమ్మంలో ఇటివల జరిగిన ఒక చిన్నపిల్లవాడి పాశవిక దారుణ హత్యోదంతం తెలియ చేస్తుంది . పూర్తీ వివరాలకు పత్రికా కదనం చూడవచ్చు . పై ఉదంతంలో వెంకటమ్మ 9 ఏండ్ల క్రితం భర్త తో కష్టాలు పడలేక విడిపోయి0ది . కొడుకును తానే పెంచుకుంటుంది . అంటె ఆమెకు తన కొడుకు మీద ఎంత మమకారమో అర్దమవుతుంది . బ్భార్త పరిస్తితి బాగోలేక పోవడం కోడా కారణం కావచ్చు. అయితే 9 ఏండ్ల తర్వాత ఒక వేళ అవసరమనుకుంటే తిరిగి వివాహం చేసుకోవచ్చు. కాని పిల్లవాడి గురించ్ ఆలోచించి కాబోలు ఒక హోటల్లో పని చేసే వ్యక్తీ తో వివాహేతర సంబందం పెట్టుకుని తన వాళ్లకు దూరంగా వచ్చింది . అయినా ఆమె కష్టాలు తీరలేదు . ప్రియుడు కూడా ఆమెను రోజూ కొట్టడం మొదలు పెట్టాడు . కోరి వచ్చిన స్త్రీకి అలాంటి కష్టాలు తప్పవు మరి!