స్వామీ పరిపూర్ణానంద ప్రతిపాదిత "హిందూ ధార్మిక కౌన్సిల్ " కు కేవలం ప్రశ్నించే హక్కు ఇచ్చినంత మాత్రానా దేవాలయ వ్యవస్థ బాగుపడి పోతుందా ?
మన తెలుగు రాష్ట్రాల్లో హిందూ ధర్మం కి సంబంధించినంత వరకు పీఠాధిపతులకి , స్వామీజీలకు, బాబాలకు కొదువేమి లేదు . కానీ ఉమ్మడి రాష్ట్రాల్లోని దేవాలయాలు సుమారు 33,000 పై చిలుకు ఉన్నప్పటికీ అందులో 31,000 దేవాలయాలు లోని దేవుళ్ళు దూపదీప నైవేద్యాలు లేక అనాధలుగా మిగిలిపోతే ,దానికి తరుణోపాయం చెప్పే వారు లేరు. ఒక పక్క పాత దేవాలయాలలో దేవుళ్ళకే దిక్కులేకపోతే,మరొక పక్క లక్షలు, కోట్లు వెచ్చించి కొత్త దేవాలయాలను అదే ఊళ్లలో నిర్మిస్తుంటే ,ఇదెంతవరకు సమంజసం ?అని అడిగిన నాధుడు లేదు. హిందూ ధర్మం ప్రకారం "దేవాలయ నిర్మాణం " అనేది సప్త సంతానం లో ఒకటి. అంటే దేవాలయాలు నిర్మించే వారు వ్యక్తులు కానీ, గ్రామాలు కానీ ,ఆ దేవాలయ నిర్వహణకు అయ్యే ఖర్చు స్వయంగా దగ్గరుండి చూచుకోవడమో , లేక అందుకు అయ్య...