స్వామీ పరిపూర్ణానంద ప్రతిపాదిత "హిందూ ధార్మిక కౌన్సిల్ " కు కేవలం ప్రశ్నించే హక్కు ఇచ్చినంత మాత్రానా దేవాలయ వ్యవస్థ బాగుపడి పోతుందా ?





                                 మన తెలుగు రాష్ట్రాల్లో హిందూ ధర్మం కి సంబంధించినంత వరకు పీఠాధిపతులకి , స్వామీజీలకు, బాబాలకు కొదువేమి లేదు . కానీ ఉమ్మడి రాష్ట్రాల్లోని దేవాలయాలు సుమారు 33,000 పై చిలుకు ఉన్నప్పటికీ అందులో 31,000 దేవాలయాలు లోని దేవుళ్ళు దూపదీప నైవేద్యాలు లేక అనాధలుగా మిగిలిపోతే ,దానికి తరుణోపాయం చెప్పే వారు లేరు. ఒక పక్క పాత దేవాలయాలలో దేవుళ్ళకే దిక్కులేకపోతే,మరొక పక్క లక్షలు, కోట్లు వెచ్చించి కొత్త దేవాలయాలను అదే ఊళ్లలో నిర్మిస్తుంటే ,ఇదెంతవరకు సమంజసం ?అని అడిగిన నాధుడు లేదు.
                         
                           హిందూ ధర్మం ప్రకారం "దేవాలయ నిర్మాణం " అనేది సప్త సంతానం లో ఒకటి. అంటే దేవాలయాలు నిర్మించే వారు వ్యక్తులు కానీ, గ్రామాలు కానీ ,ఆ దేవాలయ నిర్వహణకు అయ్యే ఖర్చు స్వయంగా దగ్గరుండి చూచుకోవడమో , లేక అందుకు అయ్యే వ్యయం భరించగలిగే విధంగా తగిన ఆస్తులు అవి సమకూర్చగలిగితేనే దేవాలయ నిర్మాణం చేపట్టాలి  . అలా కాకుండా ఊళ్ళో ఉన్న పాత దేవాలయాలు ఆలనా పాలనా పట్టించుకోకుండా , ఎవరో దాతలు డబ్బులు ఇచ్చారని ఊరంతా చందాలు వేసుకుని , పది రోజులు సంబురాలు చేసి కొత్త దేవాలయం కట్టి , అనేక దాని నిర్వహణకు కూడా రాజకీయ పైరవీలు చేసి " ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి "దూప దీప నైవేద్య " పధకం క్రింద డబ్బులు ఇమ్మని దేబిరిస్తే అంతకంటే పాపం మరొకటి ఉండదు. చిన్నబిడ్డల్ని నిర్లక్ష్యం చేసి వారిని హిసించే తల్లి తండ్రులకు ఎంత పాపం చుట్ట్టుకుంటుందో , అంతకంటే ఎక్కువ పాపం ఊళ్ళో దేవాలయాలను నిర్లక్ష్యం చేసి దూపదీప నైవేద్యాలకు దూరం చేసిన వ్యక్తులకు,  గ్రామాలకు అంతే పాపం అంటక తప్పదు.

        సరే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ,మెజార్టీ  హిందువుల లో దేవాలయాల నిర్మాణం అంటే హిందువులు చేయాలని , దాని నిర్వహణా బాధ్యతలు అన్ని సెక్యులర్ ప్రభుత్వాలు చూసుకుంటాయనే తప్పుడు అభిప్రాయం బాగా బలపడిపోతున్నందు వలన ,కోట్లాది హిందూ దేవాలయ  ఆస్తులు ప్రభుత్వ పెత్తనాలకు గురి అయి చివరకు అన్యాక్రాంతమయ్యాయి . స్వామీ పరిపూర్ణానంద వారు అన్నట్లు బ్రిటిష్ వారు ఈ  దేశాన్ని వదిలివెళ్లేటప్పుడు హిందూ దేవాలయాలకు ఉన్న ఆస్తులు ఎన్ని? ప్రస్తుతం ఉన్న అస్తులు ఎన్నో లెక్క తిస్తె , హిందువులు కానీ వారికి కూడా దిమ్మ తిరిగి పోవడం ఖాయం. ఒక మతానికి సంబందించిన ఆస్తులను , వేరే మతాల వారి ప్రయోజనాలకు ఉపయోగించడం అనేది ఏ ప్రజాస్వామ్య దేశం లోనో జరుగక పోవచ్చేమో కానీ ఘనత వహించిన మన సెక్యులర్ ప్రభుత్వాలు ఇన్నాళ్లు అదే పని చేసి చూపించాయి.

      తెలంగాణా రాష్ట్రానికి సంబంధించినంత వరకు , తెరాస పార్టీ తన ఎన్నికల మానిపెస్టోలో ,తాము అధికారం లోకి రాగానే దేవాలయాల మీద ప్రభుత్వ జ్యోక్యం తగ్గించి ,వ్యవస్థాపకులకు లైన  భక్తులకు, హిందూ సంస్థలకు వాటి నిర్వహణా బాధ్యత అప్ప చెపుతాం అంది. ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర రావు గారు స్వయంగా వరంగల్ సభలో ఈ  విషయం ప్రకటిస్తే , హిందూ దేవాలయాలకు మంచి రోజులు వచ్చాయని అందరు సంతోషించారు. కానీ ప్రభుత్వం ఏర్పడి 3 యేండ్లు అయినా ఇంతవరకు అది అమలు కాలేదు సరి కదా , ఈ  మధ్యన రాష్ట్రం లోని దేవాలయాలకు వేస్తున్న పాలక మండళ్ల విధానం చుస్తే , రాజకీయ నాయకులు దేవాలయాల మీద తమ పెత్తనాన్ని వదులుకోవటానికి సుతారాము అంగీకరించే స్థితిలో లేరని, వారిని కాదని ముఖ్యమంత్రి గారు కూడా ఏమి చేయలేని నిస్సయాయ స్థితిలో ఉన్నారని అనుకోవలసి వస్తుంది.

    దేవాలయాల స్వాతంత్య్రం గురించి అంతో ఇంతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న  వారిలో   స్వామీ పరిపూర్ణానంద స్వామీ వారు ఒకరు . మొన్న తమ భారత్ TV లో ఒక ప్రకటన చేస్తూ  ,  తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేశారు . కానీ ఆయనను  ఇంటర్వ్యూ చేసినప్పుడు మాత్రం ప్రస్తుతం దేవాలయం ఉన్న రాజకీయా ధర్మకర్తల మండళ్ల నియామక  విధానం మరియు నిర్వాణాధికారుల పెత్తనం  విధానం అలాగే ఉంచవచ్చని , దానికి అదనంగా స్వయం ప్రతిపత్తి కలిగిన "ధార్మిక కౌన్సిల్ " ఉండాలని దానికి దేవాలయ అధికారుల తప్పులను ప్రశ్నించే అధికారం ఉండాలని చెప్పుకొచ్చారు. అయన 2 రోజుల్లోనే ఎందుకు అంత చల్లబడ్డారో తెలియదు కానీ, దేవాలయాల నిర్వహణా బాధ్యతను రాజకీయ ప్రేరేపిత అధికారుల చేతిలో ఉంచినంత కాలం , ప్రశ్నించే అధికారం ఎవరి చేతిలో ఉన్నా ఒరిగేది ఏముంటుంది. దేవాలయ నిర్వహణా అధికారం సెక్యులర్ ప్రభుత్వ నియామక అధికారుల చేతిలో  ఉండకూడదని  సాక్షాత్తు సుప్రీం కోర్టు వారే చెప్పినప్పటికీ , రాజ్యాంగ బద్దంగా నడుస్తున్న అని డంకా బజాయించుకుంటున్న పాలకులే పట్టించుకోనప్పుడు, స్వయం ప్రతిపత్తి కలిగిన వారి సూచనలు పట్టించుకుంటారా? మన బ్రమ కాకపొతే?

     కాబట్టి స్వామీ పరిపూర్ణానంద గారితో సహా హిందువులు అయిన విజ్ఞులు  అందరు ఈ విషయం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. హిందూ సంస్థల మీద పెత్తనాన్ని వదులుకుంటారా? లేక దేశాన్ని "హిందూ రాష్ట్ర " గా ప్రకటించడానికి సిద్దపడతారా ? అని పాలకులను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. అలా చేసే వారికే మా రాజకీయ ఓట్ల మద్దతు ఉంటుందని , అన్ని రాజకీయ పార్టీలకు హిందువులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా " మీరు పెత్తనం చేస్తూ ఉండండి ,మాకు ప్రశ్నించే హక్కు ఇస్తే  మేము ప్రశ్నిస్తూ ఉంటాం " అంటే  దానివలన హిందూ దేవాలయ వ్యవస్థ అభివృద్ధికి ఒరిగేదేమి లేదు అని నా నిశ్చితాభిప్రాయం .


                       జై హిందూ                                                          జై జై హిందూ
                       పరిపూర్ణానంద స్వామీ వారి ఇంటర్వూ విశేషాలు కోసం వీడియో క్లిక్ చేయండి .
                         

Comments

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!