మనో వికారాలను చట్టబద్దం చేసుకుంటూ పోతే , సేమ్ సెక్సూ తప్పు కాదు , ఏనిమల్ సెక్స్ ఏవగింపూ కాదు !!?
మొన్న ఒక బ్లాగర్ మిత్రుడు రాసిన ఒక ఆర్టికిల్ చదివాను. అందులో అయన గారు స్వలింగ సంపర్కాలు అసహజమైనవి కాదని, సహజ వాంచలు అని, వాటిని అర్దం చేసుకోలేని చాందసులే వాటిని వ్యతిరేకిస్తారని, అర్దం చేసుకున్న మోడరన్ వాదులు ఉన్న దేశాలు వాటిని స్వలింగ సంపర్కాలు ను చట్టబద్దం చేసే క్రమంలో , స్వలింగ సంపర్కుల మద్య వివాహాలు చట్టబద్దం చేసాయని , ఇంకా కొన్ని దేశాలు ఆ విషయం లో చట్టం చేయడానికి ఉవ్విలూరుతున్నాయని ప్రస్తావించారు. మన దేశం లో స్వలింగ సంపర్కంను నీచమైన నేరంగా పరిగణిస్తూ ఉండడం వలన , దానికి యావజ్జీవ లేక 10 ఏండ్లు గరిష్ట శిక్ష విదించే అవకాశం ఉండడం వలన , స్వలింగ సంపర్కులు , తమ లింగ బాధలను ఎవరికీ చెప్పుకోలేక పోతున్నారని , అదే చట్టబద్ద...