ఇటువంటి ఎగబడే స్త్రీలను చూసే "న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి " అన్నట్లుంది !!1
పబ్లిక్ లో అడ్డు అదుపు లేకుండా తెగబడి మాట్లాడే వారికి , ఎగబడి ఎదుటివారి మీద దౌర్జన్యం చేసే వారిని చూస్తే , "ఎందుకైనా మంచిది , ఇలాంటి వారితో పెట్టుకుంటే మన పరువే పోతుంది" అనుకుని సర్దుకుని పోయే వారే ఎక్కువుగా ఉంటారు మన సమాజం లో . అలా తెగబడే వారు పురుషులైతే ఒక మాట ఎదురు అనటమో , అవసరమైతే ఒక దెబ్బ కొట్టడమో చేస్తుంటారు బాదితులు కొందరు. కాని స్త్రీల విషయం వరకు వచ్చే సరికి ఎదురు తిరిగి పబ్లిక్ లో దెబ్బ కొట్టడానికి జంకు గానే ఉంటుంది. కారణం మన సమాజం లో స్త్రీలకు ఇచ్చే గౌరవం కావచ్చు, వారి పట్ల ఉండె సాను భూతి కావాచ్చు. అప్కోర్స్ ఈ సూత్రం నాలుగు గోడల మద్య పని చేయదు అనుకోండి. నేను చెప్పేది పబ్లిక్ ప్లేస్ లలో గురించి కాబట్టి అంతవరకే ఈ విషయం పరిమితం. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల బలం బలం తెలిసిన ఆదునిక మహిళలు కొందరు పబ్లిక్ గా అసహ్యకర రీతిలో ప్రవర్తిస్తూ అది తమ స్వేచ్చ అనుకుంటున్నారు. ఎవరైనా వారి ప్