మాల్యా బాబా " బికినీ భామలు "మంత్రం తో బ్యాంక్ ల గేట్లు బార్లా తెరచుకున్నాయా !!?

'అరేబియన్ నైట్స్ ' కధల్లో ప్రఖ్యాత మైన 'ఆలీ బాబా నలబై దొంగలు ' గురించి పామరులు నుండి పండితులు వరకు అందరకు తెలిసినదే . ఆలీబాబా అనే కట్టెలు కొట్టుకునే వ్యక్తీ అడవిలో కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళడం, అక్కడ దొంగల గుహ లో దొంగలు "తెరచుకో సేసెం " అనే మంత్రం ద్వారా ఆ గుహ ద్వారాన్ని తెరచి , తాము దోచుకోచ్చిన సొత్తును అందులో ఉంచి , తిరిగి "మూసుకో సేసెం " అని అంటే గుహ ద్వారాలు మూసుకోవడం , వారు వెళ్లి పోయిన తర్వాత , ఆలీబాబా కుడా అదే మంత్రాన్ని పఠించి , గుహలోకి వెళ్లి కొంత సొత్తును తీసుకుని తన ఇంటికి వెళ్లి ,అక్కడ గొప్ప వంతుడిగా మారి పోవటం జరుగుతుంది. ...