కట్టుకున్నోడిని వదిలేసి వస్తే , ప్రేమ వివాహం చేసుకుంటాను అంటున్న "వీర ప్రేమికుడు"
ప్రేమించి పెండ్లి చేసుకోవడం మన సమాజంలో కొత్తా కాదు , తప్పు అంతకంటే కాదు . కాని పెండ్లి కాని వారిని మాత్రమె పరస్పర అంగీకారంతో ప్రేమించనూ వచ్చు , పెండ్లాడనూ వచ్చు . మరి ఒక వివాహితురాలిని పైగా ఒకప్పటి తన సహద్యాయినిని, ఇంకా ప్రేమిస్తున్నాను అని వెంటబడడమే కాక , చివరకు మీ ఆయన్ని వదిలేసి వస్తే , మరో పెండ్లి చేసుకుని ప్రేమ రుచి చూపిస్తాను అంటే ఆ ప్రేమికుడి ప్రవర్తన క్షమార్హం అవుతుందా ? ఖచ్చితంగా కాదు . అందుకే కటకటాల వెనక్కి వెళ్ళే పరిస్తితి అతనికి కలిగింది . వివరాలు లోకి వెళితే , అతని పేరు కలన్శికో అట . ఇదేదో రష్యన...