కట్టుకున్నోడిని వదిలేసి వస్తే , ప్రేమ వివాహం చేసుకుంటాను అంటున్న "వీర ప్రేమికుడు"

                                                                             


                                      ప్రేమించి పెండ్లి చేసుకోవడం మన సమాజంలో కొత్తా కాదు , తప్పు అంతకంటే కాదు . కాని పెండ్లి కాని వారిని మాత్రమె పరస్పర అంగీకారంతో ప్రేమించనూ వచ్చు , పెండ్లాడనూ వచ్చు . మరి ఒక వివాహితురాలిని పైగా ఒకప్పటి తన సహద్యాయినిని, ఇంకా  ప్రేమిస్తున్నాను అని వెంటబడడమే కాక , చివరకు మీ ఆయన్ని వదిలేసి వస్తే , మరో పెండ్లి చేసుకుని ప్రేమ రుచి చూపిస్తాను అంటే ఆ  ప్రేమికుడి ప్రవర్తన క్షమార్హం అవుతుందా ? ఖచ్చితంగా కాదు . అందుకే కటకటాల వెనక్కి వెళ్ళే పరిస్తితి అతనికి కలిగింది . వివరాలు లోకి వెళితే ,

                 అతని పేరు కలన్శికో అట . ఇదేదో రష్యన్ పెరులాగుంది అంటే అతడి కుటుంబం సామ్యవాద బావజాల ఆకర్షితమై ఉండాలి . సరే ! మన కలన్శికో గారిలో ఒక తీవ్ర వాదం ఉంది .కాకపొతే  అది నక్సలిజం లాంటిది కాదు , లవిజం కు సంబందించింది .  అతను తను ఇంజనీరింగ్ కాలేజిలో చదువుతున్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్ట్రాడట . కాకపొతే అది వన్ సైడ్  లవ్ కాబట్టి అ అమ్మాయి మాత్రం ఇంజనీరింగ్ పూర్తీ అయ్యాక , తను ఇంట్లో వారు చూసిన సంబందం చేసుకుని తన మానాన తానూ కాపురం చేసుకుంటుంది .
                           కాని ఈ  విర కలన్శికో కి అది ఎ మాత్రం రుచించలేదు . ఎన్నో ఏండ్లుగా ప్రేమిoచే వాడిని కాదని , ముక్కూ ముఖం తెలియని వాడిని సంప్రాదయం పేరుతొ పెండ్లి చేసుకోవడం "ట్రాష్ "  అనుకున్నాడు . వెంటనే తన వన్ సైడ్ లవర్ కి సెల్ పోన్ ద్వారా ప్రేమ సందేశాలతో పాటు మంచి అపర్ ఒకటి ఇచ్చాడట . ఆమె గనుక తన భర్తను వదిలేసి వస్తే , తానూ పెండ్లి చేసుకుని తన ప్రేమను రుజువు చేసుకుంటాను అని సెల్ సందేశం ఇచ్చాడట . దానితో బిత్తర పోయిన అ అమ్మాయి ఆ పైత్యం ముదీరిన ప్రేమికుడిని చికిత్స చేయడమే మేలని బావించి ఖమ్మం అర్బన్ పోలిస్ స్టేషన్ లో పోలిస్ కెసు పెట్టిందట !. దానితో పోలీసులు ఆ  వీర ప్రేమికుడి మిద కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు . త్వరలో అతడిని అరెస్ట్ చేసి అతడి పైత్యాన్ని వదిలించాలని అమ్మాయి తరపు వారు కోరుతున్నారు . చట్టం తన పని తానూ చేస్తుంది కాబట్టి అతడి కళ్ళకు కమ్మిన ప్రేమ పొరలు తొలగి ,  తగిన శిక్ష అనుభవించాకా . బుద్దిగా పెండ్లి చేసుకుని అ ప్రేమ ఏదో అ వచ్చె బార్య మిద కురిపిస్తే , అతడి సంసారం మూడు పువ్వులూ , ఆరు కాయలుగా వర్దిల్లుద్ది .
                                                     (14/4/2014 Post Republished)

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

"గోపాలకుడు " ను కాదని "గొర్రె పాలకుడు "బిరుదు ధరించిన "కంచ ఐలయ్య షెప్పర్డ్ " చెప్పే ఐడియాలజీ వలన ఎవరికీ లాభం ??

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

స్త్రీ ని నగ్నంగా చూపించటం అశ్లీలం కాదన్న సుప్రీం కోర్టు

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మనల్ని ఆపదల నుండి కాపాడే నరసింహ మంత్రం

15యేండ్ల అమ్మాయి పొందు కోసం , పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తాను అన్న "పాస్టర్ "!.