కారు నడుపుతూ "పేస్ బుక్ " గురించి ఆలోచించినందుకు "పేస్ "అంతా పచ్చడి అయిoదట !

                                                                         
           
              

                         "పిచ్చి ,పిచ్చి, పిచ్చి రక రకాల పిచ్చి ! ఏ పిచ్చి లేదనుకుంటే అది అసలైన పిచ్చి !" . ఇది ఏ సినిమాలో పాటో గుర్తు లేదు కాని , పాడింది మాత్రం భానుమతి గారు అని మాత్రం గుర్తు!. ఇది అసలు సిసలైన జీవన సత్యమ్. ఒకరి కి ఉన్న పిచ్చి గురించి మరొకరికి సదభిప్రాయం ఉండదు కాని , ప్రతి వారిలోనూ ఏదో రకం పిచ్చి ఉండే ఉంటుంది . ఇందులో సదరు పిచ్చి వలన వ్యక్తికీ గాని , కుటుంబానికి గాని , సమాజానికి కాని లాభం ఉంటె అది ఒక గొప్ప ప్రవర్తన గా గుర్తించబడుతుంది . లేకుంటే అది పిచ్చిగానే మిగిలి పోతుంది . ఉదాహరణకు డబ్బు సంపాదన పిచ్చి వలన లాభం ఉంటుంది కాబట్టి , అవినీతితో డబ్బు సంపాదించినా అది గ్రేటే .  సమాజానికి మేలు చేసే రచనలు , కవితలు రాసే వారు ఎంత గొప్పగా ఆలోచనలు కలిగి ఉన్నా , వారి రచనలుకు పైసా ఆదాయం రానప్పుడు వారివి పిచ్చి రాతలే అవుతాయి . సో ఇందులో ఆర్దిక ఉపయోగిత వాదం ఇమిడి ఉంది .
         
                                 సరే  ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే , ఈ  మద్య సంప్రాదాయక పిచ్చి లకు బిన్నంగా మరొక కొత్త పిచ్చి అలవాటు అయింది . అదే "పేస్ బుక్ " పిచ్చి . "ఆడవాళ్ళ నోటిలో నువ్వు గింజ కూడా నానదు " అని సగటు భారతీయ స్త్రీల మిద ఒక అభిప్రాయం ఉంది .తమ  ఇంట్లోకాని, పక్క ఇంట్లో కాని ఎ చిన్న సంఘటన జరిగినా అది వెంటనే పక్కింటి పిన్ని గారికో , ఎదురింటి వదిన గారికో చేరవేయకపోతే కడుపు ఉబ్బరం ఆగి చావదు . ఇది కేవలం  మన తెలుగింటి అడపచుల పేటెంట్ రైట్ అనుకుంటే పొరపాటే . ప్రపంచ వ్యాప్తంగా ఈ  పిచ్చితో బాద పడే వారు తక్కువేమీ కాదు . అలాగే ఇది కేవలం స్త్రీల సొత్తే కాదు , పురుషులకు ఈ  జాడ్యం ఉంటుంది . అదిగో అలా ఎప్పటి కప్పుడు కడుపుబ్బరం ఖాళి చేసుకునే అలవాటు ఉన్నవారికి  ఇతోదికంగా సహాయ పడుతుంది  "పేస్ బుక్" . తాము బజార్లో చూసిన కన్నె పిల్ల వాలుజడ నుంచి ఇంట్లో పాదుకు కాసిన కాకర కాయ వరకు ఏది స్పెషల్ గా అనిపించినా వెంటనే సెల్ తో క్లిక్ కొట్టి టైం లైన్ లో పోస్ట్ చేసే దాక "కడుపు ఉబ్బరం " ఆగదు . ఎక్కడైనా పర్వాలేదు కాని , కనీసం వాహనాలు నడిపెటప్పుడు ఈ కడుపు ఉబ్బరాన్ని కంట్రోల్ చేసుకోక పొతే యమ డేంజర్ అని అమెరికాలో జరిగిన క్రింది ఉదంతం తెలియ చేస్తుంది .

           అమెరికా లోని నార్త్ కరోలినాకు చెందిన 32 యేండ్ల సాన్పోర్డ్ అనే ఆవిడ మొన్న గురువారం  ఒక  హై వే మిద తన కారులో యమ స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ ఒక పాటని పెట్టిందట . ఆ పాట ఆమెకు ఏంతో సంతోషాన్ని కలిగిస్తుందట . అంతే ! వెంటనే ఆమె తనలోని సంతోష బావాన్ని తన పెస్బుక్ మిత్రులతో పంచుకోవాలని అనిపించి "ది హ్యాపి సాంగ్ మేక్స్ మీ  సో హ్యాపి " (ఈ  ఆనందకరమైన పాట నన్నెంతో ఆనంద పరవశురాలిని చేస్తుంది ) అని  ఆమె గారి టైం  లైన్ లో పోస్ట్ చేసిందట . అప్పుడు సమయం సరిగా ఉదయం 8-33 నిమిషాలు . సరిగా 8-34 నిమిషాలకు ఆమె డ్రైవ్ చేస్తున్న కారు ఎదురుగా వస్తున్న ట్రక్ ను గుద్దుకుని ప్రమాదానికి గురి అయిందని అక్కడికి దగ్గరలోని పోలిస్ స్టేషన్ కి కబురు వచ్చింది . పోలీసులు వచ్చి చూసే సరికి కారు నుజ్జు అయి ,అందులో  సాన్సపోర్డ్  తల పచ్చడి అయి చని పోయి ఉందట . బాడీని పోస్ట్ మారటం కి పంపితే ఆమె డ్రింక్ కాని , డ్రగ్ కాని తీసుకోలేదని , ఆరోగ్యంగానే ఉన్న స్తితిలో కారు డ్రైవ్ చేసిందని తేలింది . కేవలం పేస్ బుక్ పోస్టింగ్ మిద దృష్టి మరల్చటం వలననే , ఆమె   ఎదురుగా వస్తున్న ట్రక్ ని గమనించక దానికి గుద్దుకుని ప్రమాదాన్ని కొని తెచ్చుకుందని పోలిస్ వారు తెలిపారు . కాబట్టి పేస్ బుక్ పిచ్చి అల్కాహళ్ , డ్రగ్స్ అలవాటు కంటే ప్రమాద కరమైనది అని పై ఉదంతం తెలియ చేస్తుంది . పేస్ బుక్ కి అడ్డిక్ట్ అయిన వారు కనీసం వాహనాలు నడిపే అప్పుడు అయినా పేస్ బుక్ పిచ్చిని పక్కన బెడతారని ఆశిద్దాం .
                                           (29/4/2014 Post Republished)
   

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!