"న అజ్ఞాని స్వాతంత్ర్య మర్హతి " అని చాటుతున్న నల్లగొండ అరుణ మరణ ఉదంతం. !

                                                                       


ఈ రోజు  రాష్ట్రంలో ఇద్దరు ఆడపిల్లలు ప్రేమ ఉన్మాదానికి బలి అయి పోయిన రోజు. ఒకరు  పిఠాపురంనకు చెందిన రేవతీ కాగా , మరొకరు నల్గొండ జిల్లా కు చెందిన అరుణ అనే ఇంజనీరింగ్ విద్యార్దిని . ఇరువురూ తమ ఉన్మాద ప్రియులు కిరోసిన్ పోసి నిప్పు అంటించిన తర్వాత ఎగిసిన ప్రేమ జ్వాలలకు తాళలేక మరణించిన వారే. ఇరువురూ హాస్పిటల్లో చేర్చినాకనాలుగైదు రోజులు నరక యాతన అనుభవించి చనిపోయిన వారే. పాపం ఆ ఆడపిల్లల మరణ యాతన చూస్తున్న వారికి ఎవరికైనా హ్రుదయం ద్రవించక మానదు. నల్గొండ అరుణ తండ్రి తన కూతురుని చంపిన వాడిని ఉరి తీసి చంపాలని చెపుతూ రోదిస్తున్న తీరు మనసున్న ఎవరినైనా కదలించి వేస్తుంది.

               నల్ల గొండ అరుణ కేసులో  ఆమె ప్రియుడు సైదులును నేరం జరిగిన 24 గంటలలో నే పోలిసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిస్తే కోర్టు అతన్ని రిమాండ్ కి పంపింది. ఒక వేళ పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపితే , ఆరునెలలోపే విచారణ పూర్తీ చేసి అతనికి గరిష్టంగా శిక్ష విదించవచ్చు.  రోజు నల్ల గొండలో రాజకీయ పార్టిలు, మహిళా సంఘాలు, విద్యార్ది సంఘాలు చేస్తున్న బంద్ వలన ఆ మాత్రం పలితం దక్కవచ్చు. కొంతమంది డిమాండ్ చేస్తున్నట్లు అరుణ కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం మీద ఆదారపడి ఉంటుంది. అంతకు మించి సమాజం  చేయగలిగింది ఏమి లేదా  అని ఆలోచిస్తే , ఏముంటుంది, మహా అయితే వచ్చే సంవత్సరం అరుణని  గుర్తుకు తెచ్చుకుని  కొన్ని కోవోత్తులు వెలిగించి , ఆమె కు నివాళులు అర్పించవచ్చు. అంతే కానీ సమాజం లో ఉన్న అరుణ లాంటి ఆడపిల్లలకు కానీ, సైదులు లాంటి ఉన్మాడులకు కానీ, ఇరువురు కు చెందిన కుటుంబాలు లోని పెద్దలు వంటి వారికీ కానీ, చెప్పేది ఏమి లేదా?

   అరుణ B.Tech పైనలియర్ విద్యర్దిని. అంతగా ఆర్దిక స్తోమత లేని కుటుంబంనకు చెందిన అమ్మాయి.ఆ అమయికి తన మండలం లోనే వేరే గ్రామం కు చెందిన మాజీ ఉప సర్పంచ్ అయిన సైదులు తో ఉన్న పరిచయం ప్రేమగా మారింది. సైడులుకు అప్పటికే అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట! ఈ  విషయం అరుణకు కూడా  తెలుసు అని అర్దమవుతుంది. మరి తెలిసీ ఒక వివాహితుడితో ప్రేమలో పడి , 2 యేండ్లుగా ప్రేమ వ్యవహారాలు నడపడం ఆమె లోని అజ్ఞానం కాదా? మరి రెండు సంవత్సరాలుగా తన కుమార్తె తన మండలం కు చేందిన పెండ్లిన వ్యక్తితో కలసి తిరుగుతుంటే , ఆమె తల్లి తండ్రులు గమనించలేక పోవటానికి గల కారణాలు ఏమిటి? అటు ప్రక్క చూస్తె ఒక ఊరికి ఉప సర్పంచ్ పదవి వెలగ పెట్టిన వాడు, పెండ్లి అయి ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన వాడు , అంత బుద్ది  లేకుండా పెండ్లి కాని అమాయితో ఏ ఉద్దేశ్యం తో తిరిగాడు? అలా 2 సంవత్సరాలుగా తిరుగుతుంటే వారి మద్య ఉన్న వ్యవహారాన్ని చుట్టూ ఉన్న సమాజం గమనించలేదా? గమనించినా మందలించే పెద్దమనిషి బాద్యతను ఎవరూ తీసుకోవడానికి ముందుకు రారు. ఎందుకంటే వారు చెప్పినా వినిపించుకునే స్తితిలో కళ్ళు మూసుకు పోయిన ప్రేమికులు ఉండరు కాబట్టి!. 18 సంవత్సరాలు దాటితే చాలు , ఎవరు ఏమి చేసుకున్నా చట్టానికి అనవసరం. అందుకే ఇలాంటి దుర్నడతలు సమాజంలో ప్రశ్నించ లేనివిగా ఉన్నాయి.

     కానీ ఆ దుర్నడతలు వలన జరుగ రాని  ఘోరాలు జరిగి పోయాక మాత్రం అన్నీ సంఘాలు గళమెత్తి, ఒక్క రోజు బంద్ చేయించి సమాజం లో ఉన్నందుకు తమ బాద్యత తీరిపోయినట్లు ఊపిరి పీల్చుకుంటాయి. అంటే మన నోళ్ళు కీడు జరిగితే అరవడానికి తప్పా , ముప్పు ను ముందే గమనించి మంచి చెప్పడానికి అదికారం లేనటువంటివి. పై ఉదంతంలో చివరకు ఎవరు బావుకున్నది ఏమీ లేదు. ఒక పక్క  కుటుంబం పాతికేళ్ళు పెంచిన అమ్మాయి ని పోగొట్టుకుని కుమిలి పోతుంటే , ఇంకొక పక్క మరో  కుటుంబం లోని బిడ్డలు తమ తండ్రి కి దూరంగా కనీసం 10 సంవత్సారాలు బ్రతుక వలసి ఉంటుంది. ఏది ఏమైనా ఈ కేసు కోర్టు పరిదిలోది కాబట్టి వివరంగా విశ్లేషించ లేనటువంటిది. కానీ ఒకటి  మాత్రం నిజం .సమాజంలో  పర్వ్యసానాలను  అంచనా వేయకుండా కళ్ళు మూసుకుని నడిచే ప్రతి ఒక్కరూ అజ్ణానులే. అటువంటి అజ్ణానులు  సంపూర్ణ వ్యక్తిగత స్వేచ్చకు అర్హులా ? అని ఆలోచిచవలసిన పరిస్తితులు , సమాజంలో నానాటికి ఎక్కువ అవుతున్న  పై కేసులు లాంటివి కలుగ చేస్తున్నాయి. ఇదే దోరణీలు సమాజంలో విపరీతమయితే ఆ అజ్ఞానుల రక్షణ కోసమైనా "న అజ్ఞాని స్వాతంత్ర్య మర్హతి " అని అనక తప్పదేమో!?.

                                                (Republished Post. First  published on 23/12/2013. )


Comments

  1. Kuwait Nri's, is a kuwait based multilingual web portal which emphasizes on covering news from kuwait, India, Middle East, USA and all over the world. The site also keeps in view of all types of reader groups with different mindsets, age groups and also gender tastes and keep needs in mind and covers.. PLEASE VISIT www.kuwaitnris.com

    ReplyDelete

Post a Comment

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )