4 లక్షలు తీసుకుని దూలపల్లి కుర్రాడి "పొడుగు దూల " తీర్చిన గ్లోబల్ డాక్టర్లు !!!

                                                                             


                       
                           అ అబ్బాయి పేరు నిఖిల్ రెడ్డి. వయస్సు 22 యేండ్లు. చదివింది B.tech .  ఉండేది  హైదరాబాద్ లోని పేట్ బషీర్ బాద్ పోలిస్ స్టేషన్ పరిదిలో గల దూలపల్లి  .ఈ  దూలపల్లి  అబ్బాయి కి  ఒక చిన్న దూల ఉంది అట. అదేమిటంటే తను ఇంకొంచం ఎత్తు కావాలని. ప్రస్తుతం అతని ఎత్తు 5. 7 అట. ఒక రకంగా అది మగాళ్ళకు ఏవరేజ్ ఎత్తు. మరి పొట్టిగా కాని , మరీ పొడుగుగా కాని అనిపించనంత సాదారణ ఎత్తు. అయినా సరే కుర్రాడికి తన ఎత్తు పట్ల సంతృప్తి కలుగలేదు అంటె దానికి వేరే కారణం ఏదైనా ఉందేమో! చదివిన  ఇంజనీరింగ్ కోర్స్ కూడా అతనికి మానసిక పరిపక్వతను ఇవ్వలేదనుకుంటా , మానసిక ఎదుగుదల లేక శారీరక ఎదుగుదల గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలు పెట్టాడు. అతనికి ఒక స్నేహితుడు ఎవరో హైదరాబాద్ లోని గ్లోబల్ హస్పిటల్ లో ఆపరేషన్ ద్వారా మనుషుల ఎత్తు పెంచుతారని తెలిసి , గ్లోబల్ హాస్పిటల్ కి వెళ్లి అక్కడి డాక్టర్ లను సంప్రదిస్తే వారు 4 లక్షలు ఇస్తే పని అయిపోతుంది అన్నారు అట.

  సాదారణంగా కొన్ని  ఏక్సిడెంట్ కేస్  లలో కాళ్ళు ఎముకలు  దెబ్బ తిన్నప్పుడు , దెబ్బ తిన్న కాలు పొట్టిగా అంటె ఒకటి రెండు  అంగుళాలు కురచ అయ్యే అవకాశం ఉంది. అటువంటి వారికి దెబ్బ తిన్న ఎముకకు ఆపరేషన్ చేసి ఇనుప రాడ్ లు బిగించి ఉంచటం వలన క్రమంగా అక్కడ ఎముక అభివృద్ధి చెందటం  వలన తిరిగి కాలు పూర్వపు స్తితిలో ఉంటుంది.  అలా కాకుండా ఆన్ని  సరిగా  ఉన్న వారికి   ఆపరేషన్ చేసి కాళ్ళు ఎముకలు మాత్రమే పెంచితే, ఆపరేషన్ చేయించుకున్న వారు  ఇదిగో ఈ క్రింది పొటొలో మాదిరి  ఉంటారు . ఈ వ్యక్తిని సరిగా చూడండి .  కాళ్ళు ఏమో "6. 4 " ఎత్తు ఉన్న వ్యక్తులకు ఉండాల్సినంత పొడుగు ఉన్నాయి . పై బాగమేమో "5. 10"  ఎత్తు  ఉన్నవ్యక్తులకు ఉండాల్సినంత  ఉంది కాబట్టి   ఈ వ్యక్తి ఆరడుగుల 1 అంగుళం పొడుగు ఉన్నా , పొడుగు కాళ్ళు, పొట్టి శరీరం వలన చూడటానికి రెండు పొడుగైన కాళ్ళను అతని శరీరానికి అతికించినట్లు ఉన్నాడు. . కాబట్టి కేవలం మనిషి  పొడుగు  కావడం కోసం పై ఆపరేశన్ లు చేయించుకోవడం మతి మాలిన పనే. దీనిలో ఏ మాత్రం తేడా వచ్చినా అసలు మనిషికే ప్రమాదం ఉంది అంటున్నారు అనుభవజ్ణులు అయిన డాక్టర్లు.
                                                                       


                             మరి అలాంటి  ఆపరేషన్ ను అన్నీ చక్కగా ఉన్ననిఖిల్ లాంటి  కుర్రాడికి, అతని దూల కోరికను తీర్చడం కోసం,అతగాడి ఇచ్చే పీజులకు  ఆశపడి , కనీసం అతడి తల్లి తండ్రులకు కూడా చెప్పకుండా "కాళ్ళు కోసే ఆపరేషన్" కు రెడీ అయ్యారు గ్లోబల్ డాక్టర్లు . ఇంట్లో  తల్లి తంద్రులకు చెపితే "నీకిదేమి పోయేకాలం రా " అని అనడమే కాక తన  పైత్యపు పనికి ఎలాగూ ఒప్పుకోరు అని తెలిసీ, నిఖ్హిల్ ఒక ఫైన్ మార్నింగ్ ఇంట్లోనుంచి నాలుగు లక్షల రూపాయల డబ్బు దొంగిలించి తీసుకు వెల్లి గ్లోబల్ డాక్టర్ ల చేతిలో పోసాడు. దానితో డాక్టర్ లు ఎంతో అనందంగా అతని రెండు కాళ్ళు కోసి ఇనుపరాడ్లు బిగించి బెడ్ మీద పడుకోబెట్టి "కొన్ని నెలల బాటు కదలకుందా జాగర్తగా ఉండాలి, లేకుంటె ఇన్ఫెక్షన్ వచ్చి అసలు మనిషికే ప్రమాదం అని చెపితే కిక్క్రుమనకుందా పడి ఉన్నాడు, పాపం నిఖిల్ రెడ్డి.


        ఇక ఇక్కడ ఇంత్లో కొడుకుతో పాటు , బీరువాలో ఉందాల్సిన నాలుగు లఖ్శలు కాన రాక అక్కడ అక్కడ వెతికి , చివరకు పోలిస్ కంప్లైంట్ ఇస్తే, వారు నిఖిల్ సెల్ ఆదారంగా గ్లోబల్ ఃఅస్పిటల్లో ఉన్నట్లు కనిపెట్టి , తల్లి తంద్రులను తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళి చూస్తే, కాళ్ళు కోయించుకుని  అచేతనంగా బెడ్ మీద పడి ఉన్న కొడుకును చూసి ఆ తల్లి తండ్రుల గుండెలు అవిసిపోయాయి అట. ఆ తర్వాత విషయం అంతా తెలుసుకుని , కనీసం తమకు సమాచారం ఇవ్వకుందా తమ కొడుక్కి ఆపరేశన్ చేయ్యడం మోసపూరిత చర్య అని గ్లోబల్ డాక్టర్లు , యాజమాన్యం మీద కేసు పెట్టారు వారు. కేసు విచారణ లో ఉంది. నిఖిల్ తన తల్లితంద్రులు అమెరికా లో ఉన్నారని చెప్పబట్టి, వారికి సమాచారం ఇవ్వడం కుదర లేదని డాక్టర్ లు  చెప్పినా అది కల్లబొల్లి కహాని అవుతుంది తప్పా వాస్తవం  కాదు. కేవలం తమ హాస్పిటల్ పేరు కోసం , కాసుల కక్కుర్తి కోసం, అన్నీ చక్కగా ఉన్న కుర్రాడికి  ఇలంటి ఆపరేశన్ చేయడమ్ దారుణం. అంగ సౌష్టవం అంటె  అన్నీ ఉండాల్సిన కొలతల స్తాయిలోఉండాలి కాని, కేవలం కాళ్ళు పొడుగు అయినంత మాత్రానా , అన్ని అంగాలు పొడుగు అవుతాయా? కాళ్ళు పొడుగు శరీరం పొట్టి ఉన్న వారిని "గడ కాళ్ళోడు", ఎత్తు కాళ్ళొడు అని వంకలు పెట్టి పిలుస్తారు వరుస అయిన వారు. పాపమ్ అలా పిలిపించుకోవడానికే , నాలుగు లక్షలు ఇచ్చి కాళ్ళు  కోయించుకున్నట్లు ఉంది నిఖిల్ రెడ్డి పరిస్తితి. !

         మొత్తానికి దీని వలన మనకు అర్దం అయ్యేది ఏమిటంటె  4 లక్షలు తీసుకుని దూలపల్లి కుర్రాడి "పొడుగు దూల " తీర్చారు  గ్లోబల్ డాక్టర్లు !!! అని .ఒకవేళ ఇది సక్సెస్ అయి పొడుగు కాళ్ళ తో నిఖిల్ రెడ్డి బయట తిరుగుతుంటే , ఆ కుర్రాడి లాంటి మరి కొంత మంది తమ హాస్పిటల్ కు వచ్చేందుకు అవకాశం ఉందనే ఉద్దేస్యం తోనె ఇలాంటి పని చేసారు. తల్లి తండ్రులకు చెప్పకుండా , పిల్లలని ప్రేరేపించి , వారిని ఇంట్లో దొంగతనం చేసేలా కూడా చేసి , తమకున్న వైద్య పరిజ్ఞాన్నాని అతని మీద ప్రయోగించి, వైద్యాన్ని ఒక వ్యాపారంగా మార్చిన డాక్టర్లు  తీరు చూస్తుంటే  పూజ్య బాపూజీ అన్న ఒక మాట గుర్తుకు వస్తుంది

                                 "మానవత్వ హీనమైన శాస్త్ర విజ్ఞానం సప్త మహా పాపములో ఒకటి ".
                                              (7/4/2016 Post Republished).


Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం