"అమ్మా బాబుల "అరేంజ్డ్ మారేజ్ " కాదన్నందుకు ," మై చాయిస్ " అని ప్రియుడితో లేచి పోయినందుకు , నా బ్రతుకు జైలు పాలే "అంటున్న "లేడి బంది పోటు " !!!

                                                                       
సందీప్ కౌర్ 

పై పొటో లో కనిపిస్తున్న ముద్దుగుమ్మ పేరు సందీప్ కౌర్ . వయస్సు 24 సంవత్సరాలు . మనిషి మంచిదేనట . గుణమే, ఆధునికత సావాసం చేసి చెడి పోయింది . నర్స్ గా తర్ఫీదు పొందిన  ఈ అమ్మాయి సాంప్రాదాయ కుటుంభం నకు  చెందినది . తల్లితండ్రులు ఒక మంచి సంబందం చూసి పెండ్లి చేసుకోమ్మా  అని అంటే , " ఠాట్  ! మీరు తెచ్చిన సంబందం చేసుకోవడానికి నేనేమైనా సాంప్రదాయక ఆడపిల్లనా , ఆధునికత తెలిసిన "మై చాయిస్ " పిల్లను అని తను ప్రేమించిన వాడితో ఒక ఫైన్ నైట్ ప్లైట్ ఎక్కి అమెరికాలో ని కాలిపోర్నియాకు జంప్ అయింది . ఆమె కోసం కొన్నాళ్ళు ఏడ్చి ,ఏడ్చి ఇక ఏడ్చే ఓపిక లేక మిన్నకుండి పోయారు ఆమె తల్లి తండ్రులు .

              ఇక కాలిపోర్నియా వెళ్ళిన కౌర్ ప్రేమికులు , అక్కడ అక్కడ తిరిగి చేతిలో ఉన్నది కాస్త ఖర్చు చేసుకున్నారు . ఇక అమ్మాయి దగ్గర ఏమి లేకపోయే సరికి , ప్రియుడికి ఆమె మీద మొహం మొత్తినట్ట్లుంది , ముఖం చాటేశాడు . ఇక, వారిని ఆశ్రయించి , విరిని ఆశ్రయించి  కౌర్ సకల వ్యసనాలకు బానిస అయిందట . చేతిలో చిల్లిగవ్వ లేక పోయే సరికి , చివరకు దొంగ తనాలకు తెగించింది . ఏకంగా బ్యాంక్ లలో జొరపడి , అక్కడున్న వారిని తానొక మానవ బాంబును అని బెదిరించి 4 బ్యాంకులను , 3 రాష్ట్రాలలో , గత సంవత్సరం దోపిడి చేసిందట . చివరకు పోలీసులకు చిక్కి కటకటాలు పాలు అయింది ! కోర్టు వారికి ఆమె తన దీన చరిత్రను చెప్పినా కనికరించ్ఝలేదు అట . బ్యాంక్ లనుండి దోపిడి చేసిన 40,000 డాలర్లు తిరిగి ఇప్పించడమే కాక ఆమెకు 66 నెలల జైలు శిక్ష తో పాటు " బాంబ్ షెల్ బాండిట్ " అనే బిరుదును కూడా ఇచ్చారు అట .
                      ఇప్పుడు ఆమె అమెరికా జైలులో "అమ్మా బాబుల "అరేంజ్డ్ మారేజ్ " కాదన్నందుకు ," మై చాయిస్ " అని ప్రియుడితో లేచి పోయినందుకు , నా బ్రతుకు ఇలా జైలు పాలు కావాల్సిందే " అని అనుకుంటుందట . అదీ సంగతి . పూర్తి సమాచరం కొరకు క్రింది లింక్ ను చూడండి .

http://www.hindustantimes.com/world-news/indian-origin-bombshell-bandit-nurse-jailed-for-bank-robberies-in-us/article1-1335253.aspx

                                                   (9/4/2015 Post Republished)

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.