తాకట్టు పెట్టిన "తాడు" ను విడిపించి కాపురం కాపాడమంటే, బావను చంపి అక్క "తాడు"నే తెంచిన తమ్ముడు!
ఆడపిల్లలకు పెళ్లి కాక ముందు పుట్టింటి రక్షణ, పెండ్లి అయ్యాక మెట్టినింటి రక్షణ ఉండాలనృది సాంప్రదాయ బావన. కాకపోతే ప్రస్తుత పరిస్తితులు ప్రకారం పుట్టింటి వారి రక్షణ స్త్రీలకు, ఎల్ల కాలం ఉండాల్సిందే అనిపిస్తుంది. అయితే బార్యా భర్తల సంబందాలు సున్నితమైనవి కాబట్టి వారి మద్య ఏర్పడిన సమస్యలు పరిష్కరించే వారు కొంచం సహనవంతులై, ఇరువురికి తగిన విదంగా కౌన్సిలింగ్ చేస్తూ, వారి వారి తప్పులు తెలుసుకోవటమే కాక, సర్దుకు పోయే తత్వంలో కాపురం సరిదిద్దుకునేలా చేయ గలగాలి. దీనికి ఎంతో అనుభవమున్న పెద్ద మనుషులు కావాలి.అంతే కానీ తమ తోడపుట్టిన వారిని కట్టుకున్నోడు ఏదో రాచి రంపాన పెడుతున్నాడని , అంతులేని ఆవేశం లో "నేను లేస్తే మనిషినే కాను " అని ప్రవర్తించే దోరణిలో పుట్టింటి వారు ప్రవర్తిస్తే , మొన్న పండితా పురంలో బావను చంపిన బావమరిది కేసులో లాగే అవుతుంది.
ఖమ్మం జిల్లా లో కామే పల్లి మండలంలో ,పందితాపురానికి చెందిన అంబడిపూడి వెంకటేశ్వర్లు (43), ఉమ బార్యాభర్తలు. ఇద్దరూ మంచిగానే కాపురం చేసుకుంటున్నారు అట. అయితే ఉమకు ఏడాది క్రితం డెంగీ జ్వరం వస్తే ఆమె తల్లితండ్రులు వైద్యం చేయించారట. వారి దగ్గర వైద్యానికి డబ్బులు లేకపోవటం వలన ఉమా బంగారపు పుస్తెల తాడును తాకట్టు పెట్టి వైద్యం చేయించారట. ఆమెకు జబ్బు నయమై సంవత్సరమైనా ఆ తాడును ఆమె తల్లి తండ్రులు తిరిగి ఉమకు ఇవ్వలేదంటా. దానితో వెంకటేశ్వర్లు ఆ తాడును తెమ్మని బార్యను వేదించడం మొదలు పెట్టాడట. మొన్న గురువారం ఈ విషయం గురించే గొడవ జరిగితే , వెంటనే ఉమా తన తమ్ముడుకి మొబైల్ ద్వారా తెలిపిందట. అంతే ! దానితో శివాలెత్తిన వెంకటేశ్వర్లు బావమరిది బావకు బుద్ది చెప్పి అక్క బాధలను బాపుతానని వచ్చి , బావతో గొడవపడి రోకలి బండ , ఇనుపరాడుతో బావ తల పై మోదగా , పాపం వెంకటేశ్వర్లు అక్కడిక్కడే చనిపోవడం తో ఉమ తెల్ల బోయింది. తమ్ముడికి చెపితే , కనీసం గొలుసు విడిపించి తెచ్చి తన కాపురం నిలబెడతాడు అనుకుంటే , అ తాడు కట్టిన వాడినే చంపి తను ఇక జన్మలో పసుపు తాడు కట్టుకునే అవసరం లేకుండా చేసిన తమ్మున్ని చూసి ఏమనాలో అర్ధం కాక బోరుమందట! అదీ కద!
పై ఉదంతం లో వెంకటేశ్వర్లు ఆ తాడును తనే డబ్బు కట్టి విడిపించుకుని తెచ్చుకుని భర్త గా బార్య వైద్యం ఖర్చులు భరించాల్సిన తన బాద్యత నెరవేర్చుకుంటే ఎంతో హుందాగా ఉండెది. ఆ జ్ఞానం అతనికి లేక పోతే కనీసం ఆక్క కాపురం లో కలతలు రాకుండ ఉండెందుకు ఉమ తముడు ఆ డబ్బులు తనే ఇచ్చి అక్క తాడు విడిపించి ఇచ్చినా బాగుండేది. లేదు ఆ విషయం లో తన బావ చేస్తుంది దుర్మార్గం అనిపిస్తే , పెద్దమనుషులుకు చెప్పి అతనికి బుద్ది చెప్పించినా సమంజసం అనుకోవచ్చు. కానీ అక్క కాపురం నిలబడాలంటే బావను బాదటమే కరెక్ట్ అనుకునే ఆవేశ పూరిత దొరణీ వలన చివరకు జరిగింది ఏమిటి? భావను చంపి అక్క కాపురం కూల్చాడు. తను జెయిల్ పాలై తన కుటుంబాన్ని కడగండ్ల పాలు చేస్తాడు. మరి ఇలాంటి "వీర మల్లయ్య లు" వల్ల కుటుంభ సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత దుర్బరం గా మారతాయి అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ.
(Republished, O.P.D 11-9-2013)
Comments
Post a Comment