Posts

Showing posts with the label బోధనా రుసుములు

అటు ఆంద్రా ప్రభుత్వానికి గిట్టని ,ఇటు తెలంగాణా ప్రభుత్వానికి పట్టని ,తెలంగాణా విద్యార్దులు!

Image
                                                                                                                                                                          కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు .కాకపోతే ఈ తెలంగాణా  పిల్లలు ఏ 'కాకి' కి చెందిన వారో తెలియక ఏకాకులయ్యారు .ఇదీ ప్రస్తుతం ఆంద్ర ప్రదేశ్ లో ని విద్యాసంస్థల్లో చదువుతున్న తెలంగాణా విద్యార్దుల పరిస్తితి. పై చిత్రం లోని సమాచారం చూస్తే వారి పరిస్తితి కళ్ళకు కట్టినట్లు ఉంది .                 రాష్ట్ర విభజన జరిగి ,తెలంగాణా ప్రభుత్వం ఏర్పడినాక,ఆర్టికల్ 371 D ప్రకారం కాకుండా ,1956 కు ముందు తెలంగాణాలో నివసించిన కుటుంభాల వారి పిల్లలకు మాత్రమె బోధనా రుసుములు ,స్కాలర్ షిప్ లు ఇవ్వడం జరుగుతుందని K.C.R గారు చెప్పినప్పుడు , అది అన్యాయం ,తెలంగాణాలో చదివే వారందరికి బోధనా రుసుములు ఇవ్వవలసిందే అని , కొంత మంది ఆంద్రా రాజకీయ నాయకులు హై కోర్టులో పెటిషన్ లు వేశారు .ఆ సందర్భంగా హై కోర్టు వారు కోన్ని కీలక వ్యాఖ్యలు చేసారు . "మనది భారత దేశం, భారత దేశం లో నివసిస్తున్న మనం అందరం భారతీయ పౌరులం .ప్రతి భారతీయ పౌరుడికి తనకు