మగవాడికి స్వేచ్ఛనిస్తే నలుగురిని ఉంచుకుంటాడు , ఆడదానికి స్వేచ్ఛ నిస్తే 4వ వాడిని ఉంచుకుంటుంది . అంతే తేడా!?
పౌరుల స్వేచ్ఛ సమాజ అభివృద్ధికి లోబడి ఉండాలి. ఆలుమగలు అయిన స్త్రీ పురుషుల స్వేచ్ఛ కుటుంబ సంక్షేమానికి లోబడి ఉండాలి . అలాంటప్పుడే సమాజం అయినా అందులోని భాగమైన కుటుంబాలు అయినా పది కాలాలు పాటు వర్ధిల్లుతాయి. కట్టుబాట్లు లేని స్వేచ్ఛ ఎప్పటికైనా ముప్పే. కోరికలకు లిమిట్ అనేది ఉండదు . అవి అనంతం. కాబట్టి వాటికి స్వీయ నియంత్రణ రూపంలోనో , సామాజిక నియంత్రణ రూపంలోనో కళ్లెం వేయకపోతే అది చివరకు మనిషిని సర్వ నాశనం చేస్తోంది. ఈ సూత్రం కుటుంబాలలోని ఆలుమగలు కు వర్తిస్తుంది . ఆలుమగల స్వేచ్ఛ కుటుంబ సంక్షేమానికి కట్టుబడి ఉండకపోతే యావత్ కుటుంబం విచ్చిన్నమయ్యే ప్రమాదం ఉంది. అలా కాకుండా ఉండాలనే కుటుంబ కట్టుబాట్లు ఏర్పరచా...