ఇంట్లో పనిమనిషి సేవలు విలువ కంటె ఇంటి ఇల్లాలు చేసే సేవలు విలువ తక్కువంట !
ఈ రోజు టైమ్స్ అప్ ఇండియా వారు ఒక ఆర్టికిల్ ప్రచురించారు . అది తమిళ నాడులోని విరుదనగర్ జిల్లా ఏసిడెంట్ క్లైమ్స్ ట్రిబ్యునల్ వారు ఇచ్చిన తీర్పుకు సంబందించినది . దాని వివరాలు ఏమిటంటే , సెల్వి అనే ఒక మహిళ బట్టలు అమ్ముతూ నెలకు 5000/ రూపాయలు సంపాదిస్తూ ఉండేది . అయితే ఆమెగారు ఒక వాహన ప్రమాదం లోమ్రుతి చెందటం వలన ఆమె కుటుంబ సబ్యులు ట్రిబ్యునల్ లో నష్ట పరిహారం కోసం క్లైమ్ పెటిషన్ వేసారు . అయితే సెల్వి బట్టల వ్యాపారం చేస్తున్నట్లు డాక్యుమెంట్ ఆదారాలు ఏవి లేనందు వలన ఆవిడను సాదారణ గ్రుహిణిగా పరిగణించి ,ఆమె సంవత్సర ఆదాయం కేవలం 15,000 గాతిర్మాణించి ,తదనుగుణంగా 1,62,000 క్లైమ్ ను ఆమె కుటుంబ సబ్యులు పొంద వచ్చని తీర్పు చెప్పింది . ఈ రొజుల్లో ఇంట్లో పనిచేసే పని మనిషి రోజుకు కనీసం 100 రూపాయలు ఇవ్వనిదే పని చేయని పరిస్తితి . జాతీయ ఉపాది హమి పధకం క్రింద 4 గంటలు పని చేసే వారికి కూడా సుమారు 125 నుంచి 150 రూపాయలు దినసరి వేతనం చెల్లిస్తున్న ఈ రోజుల్లొ ఇంటి కోసం నిరంతరం అలుపు ఎరుగక పని చెసే ఇల్లాలికి కేవలం రోజుకు 42 రూపా