ఇంట్లో పనిమనిషి సేవలు విలువ కంటె ఇంటి ఇల్లాలు చేసే సేవలు విలువ తక్కువంట !

                                                                       


       ఈ రోజు టైమ్స్ అప్ ఇండియా వారు ఒక ఆర్టికిల్ ప్రచురించారు . అది తమిళ నాడులోని విరుదనగర్ జిల్లా ఏసిడెంట్ క్లైమ్స్ ట్రిబ్యునల్ వారు ఇచ్చిన తీర్పుకు సంబందించినది . దాని వివరాలు ఏమిటంటే ,

సెల్వి అనే ఒక మహిళ బట్టలు అమ్ముతూ నెలకు 5000/ రూపాయలు సంపాదిస్తూ ఉండేది . అయితే ఆమెగారు ఒక వాహన ప్రమాదం లోమ్రుతి చెందటం వలన ఆమె కుటుంబ సబ్యులు ట్రిబ్యునల్ లో నష్ట పరిహారం కోసం క్లైమ్ పెటిషన్ వేసారు . అయితే సెల్వి బట్టల వ్యాపారం చేస్తున్నట్లు డాక్యుమెంట్ ఆదారాలు ఏవి లేనందు వలన ఆవిడను సాదారణ గ్రుహిణిగా పరిగణించి ,ఆమె సంవత్సర ఆదాయం కేవలం 15,000 గాతిర్మాణించి ,తదనుగుణంగా 1,62,000 క్లైమ్ ను ఆమె కుటుంబ సబ్యులు పొంద వచ్చని తీర్పు చెప్పింది .

 ఈ  రొజుల్లో ఇంట్లో పనిచేసే పని మనిషి రోజుకు కనీసం 100 రూపాయలు ఇవ్వనిదే పని చేయని పరిస్తితి . జాతీయ ఉపాది హమి పధకం  క్రింద 4 గంటలు పని చేసే వారికి కూడా సుమారు 125 నుంచి 150 రూపాయలు దినసరి వేతనం చెల్లిస్తున్న ఈ రోజుల్లొ ఇంటి కోసం నిరంతరం అలుపు ఎరుగక పని చెసే ఇల్లాలికి కేవలం రోజుకు 42 రూపాయలు లెక్కగట్టి ఇవ్వడం అన్యాయంగా బావించిన ఆమె కుటుంబ సబ్యులు మద్రాస్ హై కోర్టులో అప్పీల్ చేయగా ,హై కోర్టు వారు ట్రిబ్యునల్ తీర్పుని తప్పు పడుతూ ,ఇంటి  ఇల్లాలి సేవలు గురించి క్రింది విదంగా అన్నారు .

 "The primary responsibility of the home-maker is to ensure that the family is happy, healthy and prosperous. To make the home as heart of the family giving total relaxation and complete freedom and joy to members of the family, is the critical role willingly undertaken and delightfully discharged. As it is voluntary, it is quite often neglected, forgotten and devalued."


   ' కుటుంబాన్నిఆరోగ్య కరంగా  సుఖ సంతోషాలతో ఉండేలా చూడటం ఇల్లాలి ప్రధాన బాద్యత ...ఇంటిని కుటుంబ  సభ్యులకు పూర్తీ స్వెచ్చ ,సంతోషం  ఇచ్చే కేంద్రంగా తీర్చి దిద్దడం లో ఆమె పాత్ర ఛాల సంక్లిష్టమైనప్పటికి ,దానిని స్వచ్చందంగా  స్వీకరించి ,ఆనందంగా తన బాద్యతను నెరవేరుస్తుంది . ఆమె సేవలు అమూల్యం . అటువంటి ఇల్ల్లాలి సేవలు తరచూ నిర్లక్ష్యానికి గురి అవుతూ ,తక్కువ చేసి చూపడం బాదాకరం".. కాబట్టి ఆమె యొక్క కుటుంబ సేవలుకు  విలువ కట్టె విదానం లోకాకుండా,సుప్రీం కోర్టు వారి గత తీర్పుల ఆదారంగా ఒక స్త్రీ యొక్క సంవత్సర నోషనల్ ఆదాయం 36,000 గా పరిగణించి , అమెకుటుంబ సబ్యులకు 6,76,000 ఇవ్వవలసినదిగా ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేసించింది  

ఈ తీర్పుతో ఇంటి ఇల్లాలు సేవలు అమూల్యమైనవి అని వాటికి విలువ కట్టడం ఎవరి వల్లా కాదని తేల్చి చెప్పినట్లు అయింది . జయహో ఇంటి ఇల్లాలు ! 
  
 మరింత సమాచారం కొరకు క్రింది  లింక్ ను చూడవచ్చు 

Annual salary of homemaker? Rs 15,000 per annum, says Tamil Nadu accident tribunal

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )