కోడి గుడ్ల కోసం కోరి గర్భం తెచ్చుకున్నామన్న "దేవుని బిడ్డలు"!!!
ఇక ఆ దేవుడి వరం తో ఉబ్బి తబ్బిబ్బయిన ఆ దేవుని బిడ్డలు , ఆశా వర్కర్స్ దగ్గరకు వెళ్లి తాము దేవుడి దయతో గర్భం దాల్చామని , తమకు కూడా గుడ్లు , పౌష్టిక ఆహారం ఇవ్వాల్సిందే అనే సరికి , డాక్టర్ సర్టిఫికెట్ లేనిదే అలా ఇవ్వడం కుదరదు అన్నారట, ఆశా వర్కర్ లు . దానితో వారు గొడవ చేసే సరికి వారి ఇండ్లకే వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తే , వారికి గర్భం లేదని తేలిపోయిందట . అయినప్పటికీ ఆ దేవుని బిడ్డలు తమ పట్టు విడువక పోయే సరికి , పెద్దాసు పత్రికి వస్తే అక్కడ సంపూర్ణ పరీక్షలు జరుపుతామని చెపితే , పైన తెల్పిన ఇద్దరు మహిళలు మాత్రమే వచ్చారట . " మీలో ఒకరికి గర్భ సంచి లేదు, మరొకరికి ఉన్నా గభం వచ్చే అవకాశం లేదు కదా" అంటె , " పదిహేను రోజుల్లో పిల్లల్ని కనక పోతే మేము దేవుని బడ్డలమే కాదు " అని వారు విచిత్రంగా మాట్లాడి వెళ్ళారట !
పై నుంచి వీరిని గమనిస్తున్న వారి దేవుడా "ఓరి భగవంతుడా " అని తల పట్టుకు కూర్చుండి పోయాడట!ఆయా అదీ కదా !ఇన్నాళ్ళు కళ్ళు లేని వారికి కళ్ళు , కాళ్ళు లేని వారికి కాళ్ళు మాత్రమే ఇచ్చే దేవుడు ఇప్పుడు కడుపులు కూడా ప్రసాదిస్తున్నాడు అని ప్రచారం చేస్తున్న వీరి గురించి విజ్ఞాన బాబులు ఏమంటారు ?
Comments
Post a Comment