"రోడ్ సేఫ్టీ " కి , షాపింగ్ మాల్ లో వేసిన ఈ "లత్కోరి డాన్స్ " కి ఏమైనా సంబందం ఉందా!!?

                                                                           

యువత లో పబ్లిసిటీ మానియా బాగా పెరిగిపోతుంది .భారత దేశంలో సోషియాలజీ మేదావులు కలలు కన్న " సోషలిజం " రాలేదు కాని ,  టెక్  మేదావులు సృష్టించిన  "సోషల్ మీడియా" మాత్రం బాగా వ్యాప్తిలోకి వచ్చింది . దాని పుణ్యమాని , సెల్ చేతిలో ఉంటె చాలు దేనినైనా ఒక దానిని క్లిక్ మనిపించడమ్ , దానిని పేస్ బుక్  లో పెట్టి , లైక్ ల కోసం ఎదురు చూడడం ! దీని కోసం అపర దాన కర్ణులు గా, కరుణామయులుగా అవతారమెత్తి , సోషల్ మీడియాను రంజింప చేస్తున్నారు .

   ఇక చదువు " కొంటున్న " పిల్లలు  కొంతమందికి ఒక గొప్ప ఆలోచన వచ్చినట్లుంది . "విదేశి వీది నాట్యం" అయిన "ఫ్లాష్ మాబ్ " పద్దతిలో తమ లోని ప్రావీన్యతను బయటకు చాటాలి అనుకుంటున్నారు . ఇదివరకు ప్రజా కళలు పేరుతో "వీది ప్రదర్శనలు " ఇచ్చి ప్రజలను చైతన్యం చేసే వారు చదువుకునే పిల్లలు మరియు కళాకారులు  . అవి లో క్లాస్ ప్రదర్శనలు లాగా1 అనిపించాయేమో , ఈ పోష్ కల్చర్ పాపలు , బాబులు కలసి తమలోని పైత్యపు కళలను ప్రదర్శించడానికి విదేశి పద్దతిని ఎన్నుకుని దానిని ఆచరిస్తున్నారు. ఏదైతేనేం కుర్రకారుకి కావాల్సింది మాంచి కిక్ ఉన్న ఎంటెర్టెయిన్ మెంట్  కాబట్టి , వారి కళా ప్రదర్శనకు సోషల్ మీడియా లో మంచి ప్రచారం లబిస్తు ఉండటంతో , వారు ఆడింది ఆట , పాడింది పాట.

    వారు ఎన్ని డాన్స్ లు వేసుకున్నా ఎవరికీ అబ్యంతరం లేదు కాని , వారికున్న "సోషల్ మీడియా మానియా "
"సోషల్ కాన్సెప్ట్ " లను జత చేస్తేనే కొంచం ఆలోచించాల్సి వస్తుంది . డయాస్  మీద మొత్తం ఒడ్డూ , పొడుగులు  చూపించి , చివరకు పడి కట్టు పదాలతో తమలో లేని జాతీయ బావాల గురించి చెప్పి , " మిస్ ఇండియా " మిస్ వరల్డ్ " టైటిల్ లు సాదించేసి , ఆ పై కంపెనీల ప్రచారాలకు ఉపయోగపడే కొంతమంది సుందరీమణుల  టెక్నిక్ నే వీ రూ అనుసరిస్తున్నట్లుంది . తమ తైతక్క డాన్స్ లకి సామాజిక ఆశయం  ల పేర్లు పెట్టి దాని కోసం తాము ఏదో సామాజిక సేవ చేస్తున్న బావన ప్రజల్లో కలుగుతుందని చెప్పుకుంటున్న వీరి మోడ్రన్ డాన్సులు , యువతకు కిక్ ఇస్తాయేమో కాని వారు చెప్పే సోషల్ కాన్సెప్ట్ ఏమిటో జనాలకు అర్దం కాదు . అర్దం కావటం సంగతి అటుంచి అసలు వారు చెప్పిందాక వారి కాన్సెప్ట్ ఏమిటో తెలియదు.1 తిన్నది అరగక వేసే డాన్స్ లా అనిపిస్తుంది .
  ఉదాహరణకు క్రింది వీడియోలో డాన్స్ చూడండి . వారు "రోడ్ సేఫ్టీ " గురించి ప్రచారంలో బాగంగా దీనిని ప్రదర్శించారు అట . రోడ్ సేప్టి షాపింగ్ మాల్ లో తై తక్క లాడడమేమిటో మనకు అర్దం కాదు . అదేదో ఆ షాపింగ్ మాల్ ప్రచారానికి , ఆ పిల్లల లో ఉన్న మోడ్రన్ డాన్స్ ప్రావీణ్యతను తెలుసుకోవడానికి సదరు డాన్స్ లు పనికొస్తాయి తప్పా , అంతకు మించి ఏమి లేదు . వీరు ప్రదర్శించే ప్రక్రియను 1 పారెన్ లో "ఫ్లాష్ మాబ్ " అంటారేమో కాని , ఇక్కడైతే మాత్రం " లత్కోరి డాన్స్ " అంటారు .
  కాబట్టి వారు అంటున్న  "రోడ్ సేఫ్టీ " కి , మాల్ లో వేసిన ఈ "లత్కోరి డాన్స్ " కి ఏమైనా సంబందం ఉందా!!? అహ ! ఉందా అని? . కావాలంటే క్రింద వీడియో చూడండి


    
                   

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!