అత్తింటి ఆరళ్ళు పడలేక పుట్టింటికి చేరిన తమిళ నటి "కుష్బూ "
ఆమె గారు ఒక మహా నటి ! పెండ్లికి ముందు సెక్స్ తప్పుకాదన్న తెగువ ఆమె గారి సొంతం . అంతటి దీరవనిత నిన్ననే పార్టి మారింది. ఈ మద్య చాలా మంది ప్రతిపక్ష పార్తీల్లో పనిచేయాలంటే తెగ ఇబ్బంది పడిపోతున్నారు . 5 ఏండ్లు ఏ పదవీ లేకపోతే ప్రజలకు సేవచేసే దేలా ? అని యమ మదనపడి పోయి , నిద్ర పట్టక , చక్కగా నిద్ర పోతున్న తన అనుచర గణాన్ని, లేపి మరీ సమావేశాలు నిర్వహిస్తే , పాపం వారు ఏమి అంటారు!? తమ నాయకుడి అదికార కాంక్షకు జై అంటారు కదా! అదిగో అలా అనిపించుకుని "ప్రజల కోరిక మేరకు అధికార పక్షంలో చేరుతున్నానహో" అని డంకా బజాయించి మరీ అధికార పక్షంలో చేరి పోతున్నారు . మరి అటువంటి సమయంలో ఈ నటీమణి గారు కోరి కోరి ప్రతిపక్ష కాంగ్రెస్ లో చేరడం వింతే మరి ! దానికి కారణం ఏమిటమ్మా , అని విలేకరులు అడిగిన ప్రశ్నకు " కాంగ్రెస్ నాకు సొంత ఇల్లు లాంట...