పుట్టింట్లో ఉన్నా , అత్తింట్లో ఉన్నా , కూతురు కూతురేరా డొంగ్రే ! ---- ఛత్తీస్ గడ్ హైకోర్ట్
అదేదో సినిమాలోమహనటులు స్వర్గీయ శ్రీ S.V రంగారావు అన్న డైలాగ్ పేమస్ డైలాగ్ గా మారి ప్రేక్షకుల నోళ్ళల్లో నానుతూ ఉండేది . అదే "అడవిలో ఉన్నా , బోనులో ఉన్నా పులి పులేరా డొంగ్రే " అన్న డైలాగ్ . ఇందులో డొంగ్రే అన్నది ఉతపదం. అదిగో అలాంటి డైలాగ్ ను గుర్తుకు తెచ్చింది మొన్న ఛత్తీస్ గడ్ హైకోర్ట్ వారు ఒక కేసులో ఇచ్చిన తీర్పు. "శ్రీమతి సరోజినీ బాయి vs స్టేట్ అప్ ఛత్తీస్ గడ్ " అనే కేసులో హై కోర్టు వారు సంచలన తీర్పును చెపుతూ పుట్టింట్లో ఉన్నా ," అత్తింట్లో ఉన్నా , కూతురు కూతురే" అని నొక్కి చెపుతూ , చనిపోయిన తండ్రి ఉద్యోగ హక్కును పొందడానికి పెండ్లి అయిన కొడుక్కి ఎంత హక్కు ఉంటుందో , పెండ్లి అయిన కూతురికి అంతే హక్కు ఉంటుందని , దానిని కాదనడం పౌరుడికి రాజ్యాంగ ప్రసాదించిన ప్రాదమిక హక్కులను కాదనదమేని , ఇది ఖచ్చితంగా స్త్రీ పురుషుల మద్య వివక్షను చూపడమే కాబట్టి ఆర్టికిల్ 16 (2) కు ...