పుట్టింట్లో ఉన్నా , అత్తింట్లో ఉన్నా , కూతురు కూతురేరా డొంగ్రే ! ---- ఛత్తీస్ గడ్ హైకోర్ట్

                 
     
             అదేదో   సినిమాలోమహనటులు స్వర్గీయ  శ్రీ S.V రంగారావు అన్న డైలాగ్ పేమస్ డైలాగ్ గా మారి ప్రేక్షకుల నోళ్ళల్లో నానుతూ ఉండేది . అదే "అడవిలో ఉన్నా , బోనులో ఉన్నా పులి పులేరా డొంగ్రే " అన్న డైలాగ్ . ఇందులో డొంగ్రే అన్నది ఉతపదం. అదిగో అలాంటి డైలాగ్ ను గుర్తుకు తెచ్చింది  మొన్న ఛత్తీస్ గడ్ హైకోర్ట్ వారు ఒక కేసులో  ఇచ్చిన తీర్పు. "శ్రీమతి సరోజినీ బాయి vs స్టేట్ అప్ ఛత్తీస్ గడ్ " అనే కేసులో హై  కోర్టు వారు  సంచలన తీర్పును చెపుతూ  పుట్టింట్లో ఉన్నా ," అత్తింట్లో ఉన్నా , కూతురు కూతురే" అని నొక్కి చెపుతూ , చనిపోయిన తండ్రి ఉద్యోగ హక్కును పొందడానికి పెండ్లి అయిన కొడుక్కి ఎంత హక్కు ఉంటుందో , పెండ్లి అయిన కూతురికి అంతే హక్కు ఉంటుందని , దానిని కాదనడం పౌరుడికి రాజ్యాంగ ప్రసాదించిన ప్రాదమిక హక్కులను కాదనదమేని , ఇది ఖచ్చితంగా స్త్రీ పురుషుల మద్య వివక్షను చూపడమే కాబట్టి  ఆర్టికిల్ 16 (2) కు వ్యతిరేకమని బల్ల గుద్ది మరీ చెప్పింది. కేసు వివరాలు లోకి వెలితే

                                   జల్దేవ్ ప్రదాన్ అనే వ్యక్తీ ఛత్తీస్ గడ్ లోని మహాసమండ్ లో జనవనరుల శాఖలో ఉద్యొగం చేస్తూ మరణించారు . ఆయనగారికి హెమకంటి అనే బార్య , సరోజినీ బాయి , సంయుక్త అనే వివాహిత కుమార్తెలు ఉన్నారు .ఛత్తీస్ గడ్ లో  అమలులో ఉన్న చట్టాల ప్రకారం మరణించిన తండ్రి  లేక తల్లి ఉద్యోగాన్ని కారుణ్య నియామకాల క్రింద పొందడానికి కొడుకులు తో పాటు మరియు పెండ్లి కాని కుమార్తెలు మాత్రమే అర్హులు. అందుకే ప్రభుత్వం సరోజిని బాయి పెట్టుకున్న ఉద్యోగ అప్లికేషన్ ను, ఆమెకు వివాహం అయిందన్న ఒకే ఒక కారణం చేత తిరస్కరించింది. అట్టి వివక్షాపూరితమైన నిబందనను సవాల్ చేస్తూ , సరోజిని బాయి ఛత్తీస్ గడ్ హై కోర్టులో రిట్ దాఖలు చేసింది. ఈ  కేసు విచారణ సందర్బంగా గవర్నమెంట్ ప్లిడర్ వారి వాదన ప్రకారం "వివాహం కాని కూతురు మాత్రమే పుట్టింటికి సంబందిచినది . ఒక్క సారి వివాహం అయ్యాక ఆమె అత్తవారింటిలో సభ్యురాలు అవుతుంది కాని పుట్టింటిలో కాదు" అని. దీనిని సరోజిని బాయి లాయర్ గారు ఖండిస్తూ తమ వాదన చెప్పారు. చివరకు హై కోర్టు వారు సరోజిని బాయి వాదనను సమర్దిస్తూ తీర్పు చెప్పారు .

                              పెండ్లి అవకముందు పుట్టింటి సభ్యురాలుగా ఉన్న కూతురు ,పెండ్లి అయినంత మాత్రానా పుట్టింటి సబ్యాత్వాన్ని కోల్పోతుందని అనడం అర్దరహితం. పెండ్లి అయినా కాకపోయినా కుమారుడికి  పుట్టింట్లో ఉన్న హక్కులు , కూతురికి లేవనడం వివ్క్షపూరితం అవుతుంది. ఒక్కప్పుడు వృద్ద  తల్లి తండ్రుల   పోషణాబాద్యత కేవలం కుమారులికి మాత్రమే ఉండేది కాబట్టి అప్పుడు తయారు చేసుకున్న చట్టాలలోని నిబందనలు నేటి సమాజ పరిస్తుతులకు వర్తించవు. నేదు అమలు లో ఉన్న చట్టాల ప్రకారం తల్లి తండ్రుల  పోషణా బాధ్యతలకు కొడుకులు , కూతుర్లు ఇరువురూ సమాన బాద్యులే . మరి బాద్యతలు సమానంగా స్వికరించలి అన్నప్పుడు , మరణించిన తల్లి తండ్రుల ఉద్యోగం పొందడం లో ఆడపిల్లలను దూరం పెట్టడం అర్దరహితం. కారుణ్య నియామకాలు కుటుంబం లో అదారపడిన కుటుంబ సబ్యులు కు ఇవ్వాలి తప్పా, పెండ్లి అయిన వారు , కాని వారు అనే కారణం చేత కాదు. పెండ్లి అయినా కాకపోయినా కూతురు కూతురే తప్పా అన్యదా కాదు. ఈ  విషయం లో ఇంతకు ముందు సుప్రీం కోర్టు వారు వెలువరించిన అనేక తీర్పులను హై కోర్టు వారు ఉదహరించారు. పూర్తీ తీర్పు కోసం  క్రింది లింక్ ని క్లిక్ చేసి చూడవచ్చు.

            ఏది ఏమైనా పున్నామ నరకం నుంచి రక్షించు వాడు పుత్రుడు అనే సామ్ప్రాదాయబావాల నుండి హిందూ సమాజం బయట పడుతున తరుణమిది.దీనికి కారణం మారుతున్న కుటుంబ విలువలు. కూతురు ఇంట్లో ఉన్న సౌక్యం కొడుకు ఇంట్లో ఉండటం లేదని వాపోయే వృద్ద తల్లితండ్రులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నారు. ఈ  విషయం మీద ఇంతకు ముందు ప్రచురించిన టపా"కొడుకింట్లో ముందు గది,కూతురింట్లో వంట గది!" ను చూడండి  కూతురు అయినా అయినా కొడుకు అయినా కుటుంబంలో ఎప్పటికీ సబ్యులే . హిందూ వారసత్వ చట్టాలు మార్చుకుని, మారుతున్న పరిస్తితులకు అనుగుణంగా హిందువులు మార్పును ఆహ్వానిస్తారు, అనే బావన ఇతర సమాజాల వారికి చాటి చెప్పాం. స్త్రీలను పూజించడం,సమానంగా  గౌరవించడం మన సాంప్రదాయ బావనలో బాగమే అయినప్పటికి , స్త్రీలు అంటే హీనంగా చూసే కొన్ని శక్తుల దేశ దురాక్రమణ ల వలన , స్త్రీలను రక్షించుకునే ఉద్దేశ్యం తో వారి వ్యక్తిత్వ వికాసానికి బంగం కలిగించే కొన్ని నియమాలు ఏర్పరచుకున్నాం. అవే రాను రాను దురాచారాలుగా మారిపోయాయి. కాని ఇప్పుడు మారుతున్న పరిస్తితులకు అనుగుణంగా తిరిగి వారి హక్కులను గుర్తించడం జరుగుతుంది. అందులో బాగమే  చట్టసవరణలు  అందుకు అనుగుణంగా ఇస్తున్న కోర్టు తీర్పులు.కాబట్టి వాటిని స్వాగతించడం మనందరి కనీస బాధ్యత.ఈ  క్రమంలో ఛత్తీస్ గడ్ హై కోర్టు వారు ఇచ్చిన పై తీర్పు సర్వదా ఆమోదయోగ్యం అవుతుందని ఆశించవచ్చు. 

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )