"రూల్ అప్ లా " ఉన్నంతకాలం , "తీఫ్ ఫెస్టివల్ " అయినా "భీఫ్ పెస్టివల్ " అయినా 'నహీ చలేగా!నహీ చలేగా !'

                                                                   
                                                                               

                                          మన రాష్ట్రం పక్కనే ఉన్న ఒకానొక పొరుగు రాష్ట్రం లో "దొంగల పల్లె " ఉంది అట. ఈ  మద్య మన పోలిస్ వారు వారిని అరెస్ట్ చేయడానికి అని వెడితే ఊరు ఊరంతా కలసి పోలిస్ వారి మీద దండ యాత్ర చేస్తే ఆశ్చర్య పోవడం పోలిసుల వంతు అయింది అట. అసలు విషయం ఏమిటంటె , ఆ పల్లెలో ఉన్న వారిలో ఎక్కువ శాతం మంది కుల వ్రుత్తి ఏమిటంటే దొంగతనం చేయడం. తర తరాలుగా వారి తాత ముత్తాతల కాలం నుండి దొంగతనాలు చేస్తూ తద్వారా సంపాదించిన దానితో రాజ భోగాలు అనుభవిస్తున్నారు. అయితే వారి పల్లె ఉన్న ప్రాంతం లోని పోలీసులకు వారికి మద్య ఒక "పెద్దమనుషుల ఒప్పందం " లాంటిది ఉందట. దొంగతనాలు వారి రాష్ట్రం లో చేయడానికి వీలు లేదు. పక్కనే ఉన్న మన రాష్ట్రం లో చేసి సొమ్మును వారి రాష్ట్రానికి చేరిస్తే , మన రాష్ట్ర పోలిసులు అరెస్ట్ లు చేయడానికి వచ్చినా సహకరించకుండా ఉండటమో , లేక సమాచారం ముందుగా సంబందిత దొంగలకు చేర వేయడం ద్వారా వారు పట్టుబడకుండా , స్తానిక పోలిస్ వారికి సహకరించాలి అన్న మాట. ఇలా సహకరించినందుకు పోలిస్ వారి వాటా పోలీసులకు ఉంటుంది . తమ జూరిస్డిక్షన్ లో దొంగతనాలు జరుగవు పై అధికారుల ఒత్తిడి ఉండదు. ఈ విదంగా పొరుగు రాష్ట్రం సొమ్ముతో అటు దొంగలు , ఇటు పోలిసులు ఎంజాయి చేయవచ్చు అనేదే ఆ పెద్ద మనుషుల ఒప్పందం.

                                  ఇంకేమి మరి! స్తానిక పోలిసుల బరోసా తీసుకుని , పక్కనున్న మన రాష్ట్రం లో హైద్రాబాద్ కి వచ్చి "చైన్ స్నాచింగ్ " లు మొదలు పెట్టారు పొరుగు రాష్ట్ర దొంగలు . ఒంటరిగా వెళ్ళె మహిళల మెడలో గొలుసులు ను బైక్ మీద రయ్యిన వచ్చి తెంపడం , బాదితులు అలెర్ట్ అయ్యే లోపు పారి పోవడం. ఇలా ఒకటి కాదు , రెండు కాదు వరుస చైన్  స్నాచింగ్లు మొదలు అయ్యాయి. ఇక్కడ పోలిస్ వారు అలెర్ట్ అయి హడావుడి చేస్తే ,దొంగలు  తమ రాష్ట్రానికి వెళ్లి అక్కడ "తీఫ్ పెస్టివల్ " జరుపుకోవడమ్. ఇక్కడ సద్దు మనిగాక తిరిగి వచ్చి చైన్ స్నాచింగ్ లను కంటిన్యు చేయడమ్. చివరకు వీరి పద్దతిని గమనించిన మన పోలిసులు చట్ట పద్దతులను ఆచరించి వారిని ఎలాగో అరెస్ట్ చేసి మన రాష్ట్రం జైలులో పడెయ్యడం జరిగింది. 

                                                                              

                             ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటె , దొంగలు తమ కుల వ్రుత్తి దొంగతనం అని, దాని ద్వారానే తమ బ్రతుకు ముడిపడి ఉందని, ఆ సంపాదనే తమకు రుచిగా ఉంటుందని  బావించి దొంగతనాలు చేస్తూ పోతే చట్టాలు చూస్తూ ఊరుకోవు.ఒక వేళ  స్తానిక రాజకీయ నాయకు;లు , పోలిసులు సహకరిస్తున్నారులే అని రెచ్చి పోయి పిచ్సిపనులు చేస్తే  ఇండియన్ లా అస్సలు ఊరుకోదు కాబట్టి ఊచలు లెక్కపెట్టాల్సిందే . ఇదే సూత్రం ఆని చట్ట వ్యతిరేకమైన పనులు చేసే వారికి వర్తిస్తుంది. 

                          తెలంగాణా లో  అమలులో ఉన్న చట్టాలు ప్రకారం గోవద చేయడం నేరం. గోవధ కాని గో మాంస భక్షణ కాని  హిందువుల మనోబావాలను గాయపరచే చర్య. అలాంటి చర్యలను బహిరంగంగా , రెచ్చ గొట్టె దోరణిలో , విపరీత ప్రచార దోరణితో "బీప్ పెస్టివల్" లేక పెద్దకూర పండుగ అనే పేరుతో విశ్వ విద్యాలయాలులో  నిర్వహించడం తప్పకుండా లా అండ్ ప్రాబ్లం అవడమే కాక ఇల్లీగల్ కార్యక్రమం అవుతుంది. విశ్వవిద్యాలయాలో ఇలాంటి రెచ్చగొట్టె పనులు చేయడం ఎంతవరకు సమంజసం? అమ్మను అయినా , అవును అయినా పూజించడం హిందువులకు తర తరాలుగా వస్తున్నా సాంప్రదాయం. కొంతమంది కి ఆ సాంప్రదాయం చాందసంగా అనిపించవచ్చు. ఎందుకంటె వారు అమ్మ లో ఆడతనాన్ని , ఆవులో గొడ్డు తన్నాన్ని మాత్రమే చూస్తారు కాబట్టి. కాని సెక్యులర్ వాదులం అని గప్పాలు కొట్టుకునే వారు, ఇక్కడి మెజార్తీ ప్రజల మనోబావాలను రెచ్చగొట్టే చర్యలను విశ్వవిద్యాలయాలులో నిర్వహిస్తాం అంటె అది ఎక్కడకు దారి తీస్తుందో ఆలోచించారా? లా అండ్ ప్రాబ్లం కలిగించే ఏ చర్యను అయినా నిలుపుదల చేసే అధికారం భారతీయ న్యాయస్తానాలకు చట్టపరంగా ఉంది కాబట్టే   .సివిల్ కోర్టు వారు ఉస్మానియ  విశ్వ విద్యాలయం లో రేపు 10 వ తారీకున జరుపబోతున్న బీప్ పెశ్తివల్ ను నిలుపుదల చేయమని ఉత్తర్వులు ఇచ్చారు. 

                        మొన్న ఒక సందర్బంగా బారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ థాకూర్ గారు స్పష్టం చేసినట్లు "ఇండియాలో రూల్ అప్ లా " అనేది ప్రజలకు ప్రాదమిక హక్కుల రూపంలో లభిస్తున్నంత కాలం , ఏ వర్గం ప్రజలు కూడా బయపడాల్సిన పని లేదు. భారతీయ చట్టలు పట్ల , న్యాయవ్యవ స్త  పట్ల విశ్వాసం మెజార్తీ  ప్రజలకు ఉండబట్టె సున్నిత సమస్యలు తల ఎత్తినపుడు కోర్టులను ఆశ్రయించి ఉపశమనం పొందుతున్నారు. భారతీయ చట్టాల మీద గౌరవం లేని వారే తరచూ వాటి ఉల్లంఘస్నలకు పాల్పడుతూ  అదే తమ ప్రాదమిక హక్కు అని బుకాయించ చూస్తున్నారు. "అసహనం " అయినా ఆవు మాంస బక్షణ అయినా ఆ కోవకు చెందినవే. 

      ఇండియాలో  "రూల్ అప్ లా " అనేది ప్రాదమిక హక్కు గా ప్రజలకు  ఉన్నంతకాలం , "తీఫ్ ఫెస్టివల్ " అయినా "భీఫ్  పెస్టివల్ " అయినా 'నహీ చలేగా!నహీ చలేగా !' 

Comments

  1. హిందువుల్ని వెక్కిరించటానికి చట్టాలని కూడా ధిక్కరించతమే అసలైన సెక్యులరిజం!
    చట్టాలను వారు లెక్క చేయరు,తిండిహక్కు అనే మెలిక పెడతారు,తస్మాత్ జాగ్రత్త?

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పింది నిజమే హరిబాబు గారు! పడుకునే హక్కు ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా పడుకుంటాను అంటె సరిపోతుందా? దేనికైనా ఒక పద్దతి ఉంటుంది. సిగరెట్ త్రాగే హక్కు అందరికీ ఉన్న పబ్లిక్ ప్లేస్ లలో తాగకూడదు అని చట్టం ఉంది కాబట్టె దానిని పాటిస్తున్నారు. అలాగే ఇతర మత విస్వాసాలను కించపరచకూడదు అని చట్టాలు ఉన్నప్పుడు బహిరంగంగా పెద్దకూర పండుగలు చేసుకుంతామ్ అనటమ్ రెచ్చగొట్టె చర్యలు తప్పా మరేమి కావు. గోవు హిందువులకు తల్లి లాంటిది అని, ఈదేసం లో అత్యధికులు గో వధను గో మాంస బక్షణను నిరసిస్తారు అని తెలిసి తిండి హక్కు పేరుతో అందరూ చదువుకునే విద్యాలయాలో గో మాంస బక్షణ చేయడం కచ్చితంగా మత విస్వాసాలను గాయపరచే చర్యయే. అందుకే గోవద ను నిషేదించాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇతరమతస్తుల బావాలను గౌరవించి కొంత సర్దుబాటు దోరణి ప్రదర్శించలేని వారు సెక్యులర్ లు ఎలా అవుతారు? ముస్లిం స్నేహితులు కోసం హలాల్ తింటున్న హిందువులు సెక్యులర్ లు అవుతారు కాని హిందూ మిత్రులు కోసం గోవద ను ఆపంది అని కనీసమ్ చెప్పలేని వారు సెక్యులర్ లు ఎలా అవుతారు?

      విచిత్రమైన విషయం ఏమిటంటె , సాదారణంగా అన్ని దేశాలలో మెజార్తీ ప్రజల బావాలను మైనార్తీ ప్రజల మీద బలవంతంగా రుద్దాలని చూస్తే, మైనార్తీలు కోర్టులను ఆశ్రయించి తమ హక్కులు కాపాడుకుంతారు. కాని ఈ దేశం సీన్ రెవర్స్ గా ఉంది. మైనార్తీలు బహిరంగంగా మెజార్తీ ప్రజల ఆచారాలను వెక్కిరిస్తూ వారి మనో బావాలను దెబ్బ తీసే చేస్టలు చేస్తుంటె వాటిని నిలువరించడానికి మెజార్తీ ప్రజలు కోర్టు గుమ్మాలు ఎక్కాల్సి వస్తుంది. హిందువుల కున్న అత్యంత హీనమైన బలహీనత అన్నైక్యతే అని మన గత చరిత్రయే కాదు, వర్తమాన చరిత్ర కూడ తెలియచేస్తుంది.

      Delete
  2. నరసింహారావు గారూ, తీఫ్ ఫెస్టివల్ అనే పదప్రయోగం బాగుంది కానీ దాని లోతుకు వెళ్ళడం కాస్త అవసరమేమో. దొంగతనం చేయడం సదరు (స్టూవర్టుపురం వగైరా) గ్రామస్తులకు తరతరాలుగా వచ్చింది కాదు. ఆంగ్లేయులు బలవంతంగా కొందరికి ఈ "కులవృత్తి" అంటగట్టారు (Criminal Tribes Act, 1871). స్వాతంత్ర్యం అనంతరం ఆ ముద్ర రద్దు చేసినా వారికి పునరావాసం ఇప్పించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందనే చెప్పాలి. ఈ విషయంపై ఒక చిరంజీవి సినిమా వచ్చిందనుకుంటా.

    ReplyDelete
    Replies
    1. నేను చెప్పింది స్టువర్ట్పురం దొంగలు గురించి కాదు గొట్టుముక్కల గారు. ఈ మద్య హైద్రాబాద్ నగరం లో చైన్ స్నాచింగ్ లకు పాల్పడిన మహారాష్ట్రకు చెందిన దొంగల గురించి. వారి పేర్లు క్రింద ఇచ్చాను. చూడబోతే వీరంతా ఒకే మతానికి చెందిన వారు. వీరి నాయకుడు ఔరంగా బాద్ నుంచి ఇక్కడి స్తానికులతో కలసి దొంగతనాలు చేసారు.

      Addressing a press conference, Hyderabad police commissioner M Mahendar Reddy announced that the Task Force police arrested six thieves for committing chain- snatching in the city.

      The arrested are Mohd Rasheed Khan (32) of Peerzadiguda in Uppal, Afroz Khan (24) of MS Maqtha near Ansar Masjid in Somajguda, Syed Ahmed Ali (24) of Mohammed Nagar at Edi Bazar in Amam Nagar B at Talabkatta, Mohd Sayeed Ali (34) and Shaik Arshad Ali (25) of Silk Mill Colony of Aurangabad in Maharashtra and Mir Ayan Ali (26) of Jalgav in Maharashtra. Another accused, Babloo of Bihar, is absconding.

      Delete
    2. చాలా థాంక్సండీ!

      Delete
  3. Vote bank can do anything India, until we unite and think before voting...nothing will change..

    ReplyDelete
    Replies
    1. Yes!you are correct. Thanks for your positive response veeresh garu!

      Delete
  4. >>>> భారతీయ చట్టాల మీద గౌరవం లేని వారే
    తరచూ వాటి ఉల్లంఘస్నలకు పాల్పడుతూ
    అదే తమ ప్రాదమిక హక్కు అని బుకాయించ చూస్తున్నారు.
    "అసహనం " అయినా ఆవు మాంస బక్షణ అయినా ఆ కోవకు చెందినవే. <<<<<

    నిజం . ముమ్మాటికీ ఇది నిజం
    చట్టాల మీద గౌరవం లేని వాళ్ళే ఉత్తరప్రేదేశ్ లో ఒక వ్యక్తి తన ఇంట్లో బీఫ్ దాచుకున్నాడని నిలువునా హత్య చేసారు.
    చట్టాల మీద గౌరవం లేని వాళ్ళే "నువ్వు బీఫ్ తింటే నీ తల నరుకుతాం" అని కత్తులు దూస్తున్నారు
    చట్టాల మీద గౌరవం లేని వాళ్ళే బీఫ్ అంటే ఆవు మాంసమే అని దుర్మార్గపు ప్రచారం చేస్తూ సమాజం లో శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నారు.
    పాలిచ్చే గోవులను వధించ కూడదన్న చట్టం వుంది కానీ ...
    ఎద్దులను, దున్నలను వధించకూడని నిషేధం ఏమీ లేదు. బీఫ్ ఫెస్టివల్ రోజు కూడా బీఫ్ అమ్మే దుకాణాలు తెరిచే వున్నాయి, అనేక హోటళ్ళలో బీఫ్ తో చేసే కల్యాణి బిర్యాని అమ్ముతూనే వున్నారు .
    అపోహలతో, అబద్దాలతో, శత్రు వైఖరితో మొత్తం సమాజాన్ని అల్లకల్లోలం చేసింది చేస్తున్నది చట్టాల మీద గౌరవం లేని వాళ్ళే !





    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం