ఆంద్రా అసెంబ్లీ ని అల్లలాడిస్తున్న ఒక్క "ఆడ ధీర " !!

 
                                                                   


                                                ఆమె గారి పేరు రోజా ! పేరుకే రోజా యే కాని ,ముట్టుకోక ముందే కసక్కున దిగుతాయి ముళ్ళు లాంటి మాటలు. ఆమె గారు రాజకీయ రంగ ప్రవేశం చేయకముందు చలన చిత్ర రంగం లో తనదైన హావబావ శైలి తో రాటు దేలిన నటి మణి కాబట్టి, ఆ అనుభవం రాజకీయ రంగానికి పనికి వచ్చింది. ఆమె గారు అసెంబ్లీలో మాట్లాడే మాటలు లో మాటర్ ఉన్నా లేకపోయినా , హవాబావాలు తో అధికార పార్టి సబ్యులను కట్టడి చేస్తూ ప్రతి పక్షానికి ఆనందం చేకూర్చడం లో సపలిక్రుతురాలు అవుతుంది ఈ మాజీ నటీ మణి. ఆమె ను ఎదుర్కోవడానికి  మగ సభ్యులకు  మహా ఇబ్బంది అనుకుంటే   అధికార పార్టిలోని మహిళా సభ్యులకు కూడా ఆమె నోట్లో నోరు పెట్టే దమ్మున్న వారు లేకుండా పోయారు. చివరకు ఆమె గారి మాటల దాడి సాక్షాత్ ముక్యమంత్రి గారి మీదకే మల్లె సరికి , ఇక తట్టుకోలేక ఏడాది పాటు అసెంబ్లీ  నుండి సస్పెండ్ చేసి "హమ్మయ్య " అని ఊపిరి పీల్చుకున్నారు రాజ్యాంగ పరిరక్షకులు.

                        నోరు ఉంది కదా , లేడిస్ తెగించి మాట్లాడితే ఎంతటి వారైనా చేసే దేమిలేదు అని అనుకునే రోజా గారి లాంటి వారికి చెంప పెట్టు లాంటిది సస్పెన్షన్ ఆస్త్రం. బహుసా తెలుగు శాసన సభలలో ఇలా ఒక సంవత్సరం పాటు సస్పెండ్ కావడం , అదీ మహిళా సభ్యురాలు కావడం దురద్రుష్టకరం అయినప్పటికి అది సరి అయిన చర్యయే అని ఆమె నైజం తెలిసిన ప్రజలు అనుకుంటున్నారు. ఆమెకి సపోర్ట్ గా ఒక్క మహిళా సంఘం కూడా గొంతెత్తలేదు.

                   రోజాగారికి నోటి తీట ఎక్కువే అన్నది గతంలో అమె మాట్లాడిన మాటలే  చెపుతున్నాయి. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనడం ఆమె గుణం. గతం లో "నన్ను రేప్ చేసే దైర్యం ఎలాగు లేదు " "అంతకంటె నన్నేమి పీక గలరు" అనే వల్గర్ డైలాగులు తో అసెంబ్లీ పాయింట్ దగ్గర మాట్లాడిన సందర్బాన్ని క్రింది వీడియోలో చూదవచ్చు. మరి ఇలాంటి డైలాగులు మాట్లాడి తను అసెంబ్లీ లోని "మగధీరులను " ఎదుర్కోగలను అని ఆమె బావిస్తూ ఉండవచ్చు. అంటె ఆమె గారిని రాజకీయ రంగం లో  లో ఆప్ట్రాల్ ఆడదిరా అని ఎవరూ అనుకోకుండా, అందరూ తనని అమ్మో "ఆడధీర " అనుకోవాలని ఇలాంటి డైలాగులు పలుకుతుందేమో . దేనికైనా ఒక హద్దు ఉంటుంది అని ఆమె గారు బావిస్తే అదే ఆమె గారి రాజకీయ బవితవ్యానికి శ్రీ  రామ రక్ష!



                                  

Comments

  1. She made abusive remarks on a man but not on a woman. How could it be a disgrace on women?

    ReplyDelete
    Replies
    1. రోజా గారు చంద్రబాబు గారి మీద వల్గర్ కామెంట్ చేసినందుకు కాదు, గతం లో ఆమె అన్న మాటలను బట్టి ఆమెను తప్పుబడుతుంది. స్త్రీల పై జరుగుతున్న దురాగతాలు గురించి మాట్లాడుతున్నాను అని చెప్పే ఆవిడగారు "పిక్కుంటారా " అనే మాటలు మాట్లాడవచ్చా? ఇవి సాటి స్త్రీలను తలవంచుకునేలా చేయవా?

      Delete
    2. @Marxist Hegeliyan
      మీకు కావల్సిందే చదువుతారనుకుంటాను.తమరి గతితార్కిక భౌతికవాదం పక్కా పార్షియాలిటీ నేర్పిందా?

      మరొక దళిత స్త్రీ గురించి "పదిమందితో పడుకునే నువు మాట్లాడేదేమిటి?" అన్నది తమకి వినబడలేదా?

      ఒక ఆడది మరో ఆడదాని మీద బూతులు మాట్లాడితే తప్ప నీకు "disgrace on women" అనిపించదన్న మాట,భలే లాజిక్:-)

      అంత చెత్తాగా మాట్లాడిన అడదాని వల్ల స్త్రీజాతికి గౌరవమా?

      నా చాలెంజికి జవాబు చెప్పకుండా కామెంట్లు వేస్తున్నావు - ఖబడ్దార్!

      Delete
    3. Here I had ccommented only on the context of scolding Chandrababu Naidu. Why do we need to drag her other comments here?

      Delete
    4. Because even she scolded a man the language used by her itself is not right.do you suggest If a woman used vulgar language It is pardonable as it was not against another woman?

      Delete
  2. ఇది ఆడా మగా క్వశ్చన్ కాదు. శాసనసభలాంటి రాజ్యాంగ సంస్థలో ప్రసంగించేటప్పుడు పాటించాల్సిన డిసిప్లిన్ మఱియూ డీసెన్సీకి సంబంధించిన విషయం. రూల్ అందరికీ రూలే. ఆడవాళ్ళు ఏం మాట్లాడినా, ఏం చేసినా చెల్లుతుందనేది సోనియా హయాములో ఆవిడ పాలసీల ద్వారా క్రియేట్ చేయబడ్డ అపోహ.

    ReplyDelete
    Replies
    1. రూల్స్ అందరికీ వర్తిస్తాయి నిజమే. అయితే రూల్ 340 ప్రకారం సస్పెన్షన్ ప్రస్తుత సెషన్ ముగింపు వరకు మాత్రమె చేయవచ్చును. ఏడాది పాటు సస్పెండ్ చేయడం ద్వారా కంచే చేను మేసినట్టు అయింది.

      340. (1) The Speaker, if he deems it necessary name a member who disregards the authority of the Chair or abuses the rules of the House by persistently and wilfully obstructing the business thereof.
      (2) If a member is so named by the Speaker, the Speaker shall on a motion being made, forthwith put the question that the member (naming him) be
      suspended from the service of the House for a period *not exceeding the remainder of the session:*

      Provided that the House may, at any time on a motion being made, resolve that such suspension be terminated.
      (3) A member suspended under this rule shall forth-with withdraw from the precincts of the House.

      Delete
  3. రోజా తప్పించి మిగిలిన సభ్యులంతా పాపం నోట్లో వేలు పెడితే కొరక లేరు.లోకం తెలీని అమాయకులు. ఈ అమాయకులకి నీయమ్మ...నీ అయ్య పదాలకి అర్థం తెలీక అమాయకంగా వాటిని యదేశ్చగా వాడుతుంటారు మనం విని విన్నట్టు వదిలేయాలి.పాపం ఈ అమాయకులకి రోజా వారి పార్టీలో ఉన్నప్పుడు నచ్చిన భాష ఇప్పుడు నచ్చట్లేదు అసలే సున్నిత మనస్కులు కదా.ఈ పార్టీ ఆ పార్టీ అనికాదండీ పాపం అందరు సున్నిత మనస్కులే అనవసరంగా మనమే కర్కశంగా ఆలోచిస్తున్నాం.మరాలండి ప్రజలు లేకపోతే అసెంబ్లీ చూడలేరు.

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం