"కాలామని" + కాంతామణి = కాల్ మనీ
ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 20 వేల కోట్ల రూపాయల స్కాం గా అభివర్ణిస్తున్న "కాల్ మని " వ్యవహారంలో సామాన్య ప్రజలకు అంతుపట్టని అనేక విషయాలు ఉన్నాయి. చూడబోతే కాల్ మనీ గుట్టును కావాలనే పధక రచయితలు బయటపెట్టడం వలననే వెలుగులోకి వచ్చినట్లు కనపడుతుంది. దానిలో బాగంగానే పోలిస్ వారి దాడులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయా అనే అనుమానం కూడా కలుగుతుంది.
ఈ కాల్ మని దందాలో చోటామోటా రాజకీయ నాయకులు, క్రింది స్తాయి పోలిసులు అప్పులు ఇచ్చిన వారైతే , వాటిని తీసుకుని తిరిగి కట్టలేని వారు ఎక్కువమంది స్త్రీలే కావడం విశేషం . సదరు స్త్రీ లు ఫోన్ చేయగానే ఇంటికి వెళ్లి కేవలం ప్రామిసారి నోట్లు మీద సంతకాలు లాంటివి తీసుకుని లక్షలు , లక్షలు ఇచ్చెయ్యడం , తిరిగి వారు వడ్డీ కాదు కదా అసలు కూడా చెల్లించలేని పక్షం లో, వారితో వ్యభిచారం చేయించి అయినా తమ డబ్బులు రాబట్టుకోవాలని చూసే నీచ సంస్క్రుతి , రెగ్యులర్ గా డబ్బులను వడ్డిలకు తిప్పే వారిలో ఉంటుందా? ఇలా చేస్తే వారి వడ్డి వ్యాపారాలు మూతపడి పోతాయని తెలియదా వారికి? కాబట్టి సాంప్రదాయ వడ్డీ వ్యాపారస్తులు కాని, కష్టార్జితాన్ని వడ్డిలకు ఇచ్చి సంపదను పెంచుకోవాలని చూసే వారు కాని ఇలాంటి నీతిమాలిన పనులు చేసే అవకాశమే లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎవరో తమ వద్ద ఉన్న బ్లాక్ మని ని,పర్సంటేజ్ ల బేసిస్ మీద తమ తాబేదారులతో నడుపుతున్న "చీకటి దందా" అని అనిపిస్తుంది.
నగరాలలో దందాలు చేసే చోటా మోటా రాజకీయ నాయకులతో పాటు, ప్రజలను హింసించే స్వబావమున్న క్రింది స్తాయి పోలిసు ఉద్యోగులను కూడా , పర్సంటేజ్ ల ఆశ చూపి ఈ "కాల్ మని " దందా ను విస్తరించినట్లు ఉంది. ఇలా పర్సంటేజీ బ్రోకర్లు మద్యలో ఉండబట్టె , తమకు తెలిసిన వారికి ముక్యంగా స్త్రీలకు అప్పులు ఇచ్చి , చివరకు వాటి వసూలుకు, వారిని వ్యభిచరింఛి అయినా అప్పులు తీర్చమనే స్తాయికి వెళ్ళారు. అదెక్కడో బెడిసికొట్టి , పోలిస్ ఉన్నతాదికారుల వద్దకు విషయం వెళ్ళడం, వారు దానిని ముక్యమంత్రి గారి చెవిన వేయడం , అయన విచారణకు ఆదేశిస్తే విజయవాడలో అధికారపార్తీ నాయకుల హస్తమే"కాలమని దంధా " లో ఎక్కువుగా ఉండటం చూసి అవాకు అవ్వడం జరిగి ఉంటుంది.
మహామంత్రి తిమ్మరుసు గారి సూత్రం --. ఒక గీతను దానిని చెరపకుండా చిన్న గీత చేయాలంటే పక్కనే పెద్ద గీత గీస్తే సరిపోతుంది -- ని ఆంద్రప్రదేశ్ లో అధికార పార్టి గుర్తుకు తెచ్చుకున్నట్లు ఉంది. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కాల్ మని దందా నడుపుతున్న వారి మీద దాడులు చేయిస్తే , అందులో ప్రతి పక్ష పార్టి నాయకులు ఎక్కువుగా దొరికారు. దానితో ప్రతిపక్షానికి నోరు ఎత్తకుండా చేయడం లో సపలీ కృతులు అయ్యారు. ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏమిటంటె , వడ్డీ వసూలు కోసం స్త్రీల మీద లైంగిక దాడులు చేసిన కేసులు తప్పా , మిగతావి బెయిలబుల్ కేసులే అవుతాయి. కేసులు రిజిస్టర్ చేసినా చివరకు వారూ వీరూ కాంప్రమైజ్ అయి కేసులు వీగిపోయేటట్ట్లు చేసుకోవచ్చు. మరి ఆ ఉద్దేస్యం తోనే కాల్ మని దందాను వెలుగులోకి తీసుకు వచ్చారా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటె అప్పులు తీసుకున్న వారు తిరిగి ఎవరికైనా అప్పుగా ఆ డబ్బును ఇస్తే , అది పుచ్చుకున్న వారి చేతిలో వైట్ మనీ అవుతుంది. ఇలా బ్లాక్ మని ని వైట్ గా మార్చే ప్రక్రియే "కాల్ మని దందా " అని అనుకోవచ్చా?
ఏది ఏమైనా ఈ చీకటి దందా వెనుకాల రాజకీయ నాయకులు, పోలిస్ ఉద్యోగులు ఉనారు కాబట్టి మొత్తం కేసులను స్టేట్ పోలిస్ తో కాకుండా CBI వారికి అప్పచెప్పి ,ఇన్ కం టాక్స్ డిపార్ట్మెంట్ ను రంగం లోకి దించితే తప్పా అసలు విషయాలు వెలుగులోకి రావు . కాబట్టి సీమాంద్రా ముక్యమంత్రి గారు ఈ విషయం లో నిక్కచిగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Comments
Post a Comment