మతం "యాగం " చేస్తుంటే , విజ్ఞానం "ఆగమాగం " చేస్తుంది!!

                                                                             

                                       
                                                                              మత పరమైన అన్ని క్రతువులు విశ్వాసం కు సంబందించినవి. ప్రపంచ వ్యాప్తంగా ఈ  మతం, ఆ మతం అని లేకుండా అన్ని మతాలలో విశ్వాసాలకు సంబందించిన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవేవి సైన్స్ దృష్టితో పరిసిలీస్తే నేడు సమాజాభివ్రుద్దికి పనికి వచ్చేవిగా అనిపించకపోవచ్చు. కాని వ్యక్తిగత దృష్టితో   చూస్తే కొన్ని కోట్లు ఖర్చు చేసినా మనిషికి లభించని అలౌకిక ఆనందం తో కూడుకున్న పాజిటివ్ దృక్పదం , ఆయా మత వర్గాల ప్రజలలో కలిగించడానికి , ఈ విశ్వాస పూరిత క్రతువులు దోహదపడుతున్నాయని చెప్పవచ్చు. అలాంటి కోవకు చెందినవే పురాణాలలో చెప్పబడి , నేటికి కొనసాగుతున్న "యజ్ఞాలు " యాగాలు . భారత రాజ్యాంగం తన ప్రజలకు ఇచ్చిన మత స్వేచ్చకు అనుగుణంగా యజ్ఞాలు , యాగాలు చేసుకునే స్వేచ్చ ఉంది . దాని గురించి మాట్లాడాల్సిన అవసరం దేవుని నమ్మని నాస్తికులకు కాని, హిందూయేతర మతస్తులకు కాని లేదు.

                          ఈ  మద్య  విజ్ఞాన వాదులం అని హేతువాదులం అని విర్రవీగే కొందరు , కేవలం హిందూ మతం కి సంబందించిన విశ్వాసాలను పలుచన చేసే మాటలు మాట్లాడుతూ , ఇతరమతాల పట్ల వారికున్న భక్తీ లేక  సానుభూతిని ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియచేసుకుంటున్నారు. కాని వీరెవ్వరూ ప్రజలకు తద్వారా సమాజానికి  కీడు చేస్తున్న విజ్ఞాన పు అంశాల గురించి మాట్లాడరు. పూర్వపు కాలం లో  యజ్ఞాలు యాగాలు పేరిట దోపిడి జరిగిందని తెగ వాపోయే ఈ "గురు వింద"లకు , ఈనాడు విజ్ఞానం పేరిట దోపిడియే కాదు , ప్రజల ఆరోగ్యాలతో ఆట లాడుకుంటుంటె  కనీసం వాటి గురించి మాట్లాడటానికి నోరు రాదు.

                      విజ్ఞానం , విజ్ఞానం అని విర్రవీగే ఓ "విజ్ఞాన , హేతువాదులారా ! మీరు చెపుతున్న విజ్ఞాన అబివృద్ది ప్రజలకు చేస్తుంది పూర్తిగా  మేలేనా? పొద్దున్న లేచిన దగ్గర్నుంచి , మనం రాత్రి పొదుకోబోయే దాక ఉపయోగించే పదార్దాలు అన్ని విషపూరితం చేస్తూ , సామాన్య వ్యాపారులు నుంచి , బడా బడా కంపెనిలవరకు మనకు అమ్ముతుంటే , అమాయకంగా  వాటిని స్వీకరిస్తున్నప్రజలు ఉన్న నేటి సమాజం  , ఏ విదంగా పూర్వ కాల సమాజం కంటె విజ్ఞానవంతమైనది?  మనం తాగే నీరు కల్తీ ! మనం పీల్చే గాలి కల్తీ !  పూర్వ కాలం ప్రజలు స్వచ్చమైన ఆవు  పాలు , బర్రె పాలు త్రాగితే , విజ్ఞానవంతులం అని చెప్పుకుంటున్న మనం అజ్ఞానంగా యూరియా పాలు త్రాగుతున్నాం.  చెట్టు మీద  పండిన పండ్లను కాక పోయినా , పూర్వకాలం వారు ఇంట్లో మాగబెట్టిన పండ్లను తింటే , ఇప్పటి వారు నిగ నిగ లాడే విషపూరిత కార్బైడ్ ద్వారా పండిన పండ్లను తినే దుస్తితి! ఇలా ఒకటేమిటి కల్తీ కాని పదార్దం , కలుషితం కాని వాతావరణ పరిస్తితులు ఉన్నాయా ? ఇలాంటి విషపూరిత వాతావారణం లో జీవనం చేయాల్సిన పరిస్తితులు కల్పించిన " విజ్ఞానం యుగం" లో నివసిస్తున్న హేతువాదులకు మతాలు గురించి కాని , వాటి విశ్వాసాలను గురించి కాని ప్రస్నించే నైతిక అర్హత ఎక్కడిది?

                                                    మీకు చేతనైతే పాలను కల్తీ చేస్తున్న వారి గురించి ప్రజలకు తెలియచేయండి. పండ్లను విషపూరితం  చేస్తున్న పండ్ల మార్కెట్ల వద్దకు వెళ్లి , బోర్డులు పెట్టి ధర్నా చేయండి . వాతావరణం కాలుష్యం చ్జేస్తున్న ప్యాక్టరిలూ గురించి ప్రజలలో చైతన్యం తెండి . ఇలా ఎన్నో చేయవచ్చు. వాటిని వదిలేసి తగుదునమ్మా అని మతాలు , వాటి విశ్వాసాలను గురించి లెక్చర్లు దంచి టైం వేస్ట్ చేసుకోకండి . మీ మాటలు మత విశ్వాసులకు పూచిక పుల్లతో సమానం. యాగాలు చేసే వారికి సైన్స్ తెలియదు అనుకోవడం మీ అజ్ఞానం . యాగాలు వలన  ప్రజలకు అరోగ్యం కలిగినా ,కలుగక పోయినా , అంతులేని ఆనందం కలుగుతుంది అనేది వాస్తవం . ఆ అనందం అంతిమంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది . మరి అటువంటి ఆరోగ్య ప్రసాదిని అయిన అలౌకిక అనందం ని కోట్లు ఖర్చుపెట్టినా కొనలేం. అలా  అనందం పొందుతున్న మత వర్గాల ప్రజలను మీ పనికి రాని  మాటలతో , తప్పుడు రాతలతో బాదించి వారి ఆనందానికి, తద్వారా ఆరోగ్యానికి  భంగం కలిగించకండి.  భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన మతస్వేచ్చను ప్రస్నించే హక్కు మీకు లేదు. కనీసం ఆ దృష్టితో అయినా వ్యవరించడమ్ మంచిది. 

   ప్రజల అలౌకిక ఆనందం కోసం మతం యాగం చేస్తుంటే , ప్రజల ఆరోగ్యాలను , జీవన పరిస్తుతులను విజ్ఞానం "ఆగమాగం" చేస్తుంది. ఇందులో ఏది మేలో ? ఏది కీడో విజ్ఞానులు చెప్పాలి.  


Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన