Posts

Showing posts from October, 2016

నిత్యానందమనేది కాంతల కౌగిళ్లలో ఉండేది కాదు........!

Image
వీరబ్రహ్మం గారు తన కాలజ్గ్నానం లో "కలి యుగాంతంలో-

"ఉల్లిపాయకు ఉపదేశమిచ్చే కల్ల గురువుల్లోస్తారు,

 కల్ల గురువులను కాల్చి వేయ కల్కిఅవతారుడు వచ్చేను"

   అంటారు. కల్కిఅవతారం సంగతేమో కాని కల్ల గురువులైతే వచ్చేసారు. రావడమేంటి! ఎడా పెడా ఉపదేశాలు, బోదలు, ఉదరగొట్టడాలు, వాళ్లు పోవడాలు,వాళ్లు మిగిల్చిన ఆస్తులు కోసం వారసులు కొట్టుకోవడాలు అన్ని చక చకా జరిగి పోతూనే ఉన్నాయి. అసలు ఈ రోజుల్లొ కాషాయ వస్త్ర దారణ కూడ పెద్ద వ్యాపారమైపొయింది.

  చిన్నప్పుడు అమ్మా బాబులని వదలి ఇండ్లలోంచి పారిపోయి, గాలికి తిరిగి, గారడీలు నేర్చుకునిప్రజల్ని తమ మాజిక్లతో  బుట్టలో పడెసుకొని బాగా  సంపాదించి,,ఆశ్రమాలు(విలాసవంతమైన ఆరామాలు) నిర్మించుకుని, సర్వ బోగాలు అనుభవిస్తు, హాయీగా కాలక్షేపాలు చేస్తున్న ఈ సో కాల్డ్ గురువులు నిజంగా హిందు మతానుసారం గురువులనబడినటానికి అర్హులా?.విశ్లేషిద్దాం

హిందూ మతమనేది నిజంగా ఇతర మతాల వలే ఒక మతం కాదు . అది జీవన విదానం.సాక్షాతు మన సుప్రీమ్ కోర్ట్ వారే ఒక కేసులో ఈ విషయాన్ని స్పష్టం చేసారు. హిందువుల జీవన విధానం ఎలా ఉండాలో ధర్మ శాస్త్రకారుడైన మనువు స్పష్టం చేసాడు.అది  అయన చెప్పినది అశ్ర…

" మనవు" బ్లాగు వీక్షకులకు , మిత్రులకు , శ్రేయోభి లాషులకు , అగ్రెగ్రేటర్లకు "దీపావళి" శుభాకాంక్షలు

Image
" మనవు"  బ్లాగు వీక్షకులకు , మిత్రులకు , శ్రేయోభి లాషులకు , అగ్రెగ్రేటర్లకు "దీపావళి"  శుభాకాంక్షలు

బట్టలు సరిచేసే వాడే "బాయ్ ప్రెండ్ " అంటున్న ఈ దిక్కు మాలిన సందేశం చూడండి !

Image
ఆదర్శం వేరు ! వాస్తవం వేరు! ఆదర్శం మనం ఎలా ఉండాలో చెపుతుంది .వాస్తవం మనం ఎలా ఉన్నామో తెలియ చేస్తుంది . వాస్తవ పరిస్తితిని గమనించకుండా ,కేవలం ఆదర్శం ఆదారంగా అడుగులు వేస్తే తప్పకుండా నష్ట పోవడం ఖాయం .ప్రస్తుతమ్ మన దేశం లో "బాయ్ ప్రెండ్ ,గర్ల్ ప్రెండ్ " సంస్క్రుతి విషయం లో జరుగుతున్నది అదే .

  ఇండియాలో నే కాదు ,ప్రపంచం లో ఎక్కడైనా సరే స్త్రీ పురుషుల మద్య లైంగిక ఆకర్షణ అనేది సహజం . ఇద్దరు పరాయి పురుషులు కలసి ఏకాంతంగా ఉండే పరిస్తితులు , ఇద్దరు పరాయి స్త్రీ పురుషులు కలసి ఉండే పరిస్తితులు ఒకే లాగ ఉంటాయి అని అంటె అది ప్రక్రుతి సూత్రాలకు విరుద్దమైన మాట. అందుకె ఈడు వచ్చిన ఆడపిల్లలు ని కుటుంభ సబ్యులు అయినా సరే , మగవాళ్ళతో కలసి ఒకే మంచం మీద పడుకోనివ్వరు అంటే ,ప్రక్రుతి ధర్మం తెలియటం వలననే . మరి బాయ్ ప్రెండ్ ,గర్ల్ ప్రెండ్  ఏకాంతంగా మందు కొట్టి, ఒళ్ళు తెలియని స్తితిలో గర్ల్ ప్రెండ్ ఉంటే బాయ్ ప్రెండ్ ఏమి చేస్తాడు ? తన మగ స్నేహితుడితో ప్రవర్తించినట్లె ప్రవర్తిస్తాడా ? లేక ప్రక్రుతి ధర్మానికి బద్దుడై ప్రవర్తిస్తాడా ? నాకు తెలిసినంత వరకు నూటికి 99% ప్రక్…

ఇలాంటి ఇల్లాలు ఉంటె, పూటకో ప్రియురాలు రోజుకో రేప్ కేస్ తప్పవు !

Image
బాలిఉడ్ నటుడు ఇంద్ర కుమార్ అనే అయన ని, రేప్ కేసు లో మొన్న అరెస్ట్ చేసారు . అయన మిద ఒక మోడల్  తనను రెండు సార్లు రేప్ చెయ్యడమే కాక , తనను శారీరకంగా హింసించాడు అని కేసు పెట్టింది . ఆమె పిర్యాడుతో ప్రాదమిక సాక్ష్యాలు ఆదారంగా అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు  కేసును దర్యాప్తు చేస్తున్నారు . అయితే ఆశ్చర్య కరంగా ఇంద్ర కుమార్ భార్య అయిన పల్లవి కుమార్ , తన భర్త నిర్దోషి అని , అ అమ్మాయే ఇష్టపూర్వకంగా తన భర్తతో మూడు రోజులు గడిపి , చివరకు బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశ్యంతోనే తప్పుడు కేసు పెట్టిందని , తన భర్త తరపున తానూ న్యాయ పోరాటం చేసి తన భర్తను కాపాడుకుంటాను అని చెప్పిన తీరు , భారతీయ మహిళల క్షమాగుణానికి , సహనానికి ప్రతిక అని చెప్పవచ్చు , తన భర్త మరియు అ అమ్మాయి కలిసి తనకు ద్రోహం చేసినా , చివరకు తన పిల్లల తండ్రి ఆపదలో పడితే అతని కోసం న్యాయ పోరాటానికి సిద్దం కావడం అంటే , ఖచ్చితంగా ఆమెలో ఒక "సతి సావిత్రి " ఉన్నట్లే!. కాని అవసరం అయిన సమయంలో మొగుడి ప్రవర్తనను ఖండించి , అతనిని సరి అయిన దారిలో నడిచేటట్లు చేసి ఉంటె ఆమె కుటుంబానికి ఈ తిప్పలు వచ్చి ఉండేవి కావు . ఆ కదా కమామిషు ఏమ…

కోర్కేలు లేని సంసారి, కోర్కెలు ఉన్న సన్యాసి, ఇద్దరూ "హిందుత్వ"కు దూరంగా ఉన్న వారే.

Image
Unlike other religions in the world,the Hindu religion does not claim any one prophet it does not worship any one god; it does not believe in any one philosophic concept; it does not follow any one act of religious rites or performances; in fact, it does not satisfy the traditional features of a religion or creed.IT IS A WAY OF LIFE AND NOTHING MORE.......

APEX COURT OF INDIA  హిందూ అనేది అన్ని మతాల వలే కాదని, దానికొక ప్రత్యేకమైన ప్రవక్త,బోధనా లేవని, అది కేవలం ఒక జీవన విదానం తప్పా అన్యదా కాదని ఒక చారిత్రకమైనా తీర్పులో భారత అత్యున్నత న్యాయస్థానం ఉద్ఘాటించింది. కాన్ దీనిని హిందూ మత ప్రవచనాలు బోద చేసే వారు, పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. అందుకే ఎవరి అరాద్య పురుషుడ్ని వారు తమ దేవుడే గొప్ప దేవుడు, ఆయన చెప్పిందే కరెక్ట్, వేరెవ్వరూ చెప్పినా అది వేస్టే అన్నట్లు చెపుతుంటారు.

  అసలు హిందూ తత్వం అంటే "ప్రక్రుతి నిర్దేశించిన విదానానికి అనుకూలంగా మన జీవన విదానం ఎలా ఉండాలో తెలియ పరచే తత్వం" అని నా ఉద్దేస్యం. ఒక్క మాటలో చెప్పాలంటే "ఏ వయసులో ఆ ముచ్చట" అనేదే హిందూ జీవన విదా…

ఇంటర్నెట్లో అమ్మాయిలని నగ్నంగా మార్చి 10 డాలర్లకు అమ్ముకుంటున్న 'అమ్మకు పుట్టని వాళ్ళు' !

Image
ఈ  సమాచారం ముఖ్యంగా అమ్మాయిల కోసం. ఆడపిల్లలు తమకు ఏంతో స్వేచ్చా స్వాతంత్ర్యాలు ఉన్నాయని బ్రమపడి మగపిల్లల తో సమానంగా తమ బావాలనే కాక ,లైక్ ల కోసం తమ పోటోలను పెస్బుక్ తదితర సోషల్ నెట్వర్క్ లలో పెడుతున్నారు . ఇలా తమ అందమైన పోటోలను తమ పుట్టిన రోజు అనో , మరేదో సాధించిన రోజు అనో ప్రకటిస్తూ  పేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నారు , ఇక కొంతమంది అందగత్తెలు అయితే ఏకంగా పోజులు ఇస్తూ "నేనెలా ఉన్నా ప్రెండ్స్ " అని అడుగుతుంటే  ముక్కూ ముఖం తెలియని మగవాళ్ళు సైతం లక్షలాదిగా లైకులు మీద లైకులు ఇస్తుంటే ఇక ఆ ఫొటో పెట్టిన ఆడపిల్లల ఆనందానికి అంతే ఉండదు అనుకుంటా . ఇక అలా లైకులు పెట్టె వారిలో కొంత మంది అయితే ఏకంగా తమ విరహ బాధను తెలియచెయ్యడాలు , అమ్మాయి ఫోన్ నంబర్ లు అడగడాలు లాంటివి చేస్తూ తమలోని చపలత్వాన్ని ఫేస్ బుక్ సాక్షిగా చాటుకుంటున్నారు. అయినా సరేసదరు ఫొటోలు పెట్టిన అమ్మాయిలకు అది కాంప్లిమెంట్ గానే అనిపిస్తుంది కాబోలు .


                       అందమైన అమ్మాయిల పోటోలను చూసి ఆనందిస్తే ఎవరికీ అబ్యంతరం ఉండదు . కాని అవే పోటోలను బహు చాకచక్యంగా ఇతరుల పోటోలతో మార్పింగ్ చేసి…

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

Image
నో ! నెవ్వర్ ! అటువంటి దీనావస్త, సెక్యులర్ దేశం అని ఘనంగా ప్రకటించుకున్నఇండియాలోని మైనార్టీ మతస్తులకు  ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే తాజా గణాంకాల ప్రకారం దేశ జనాభాలో 2. 3% ఉన్న వారి  చర్చ్ లు,  గత 50 యేండ్లలో   దేశంలోనే  అతి పెద్ద వ్యవసాయేతర భూములు కలిగిన భూస్వామి గా మారడం ఒక కారణమైతే , గవర్న్మెంట్ తర్వాత అతి పెద్ద ఉపాది కల్పనా యజమానిగా మారడం రెండవ కారణం. వారి బడ్జెట్ ఇంచుమించు మన ఇండియన్ నేవి వార్షిక బడ్జెట్ కి సమానం అంటే వారి స్తితి ఎంత డామినేట్ గా  ఉందో అలోచించుకోవచ్చు.
     మరి కేవలం 3% లోపు ఉన్న వారి చర్చ్ లు అంత సుసంపన్నంగా ఉంటె , 76% ఉన్న హిందూ దేవాలయాల పరిస్తితి ఎలా ఉండాలి ? పోనీ ఎలా ఉందో తెలుసా? దేవాలయాల్లో పని చేసే  అర్చకులు , ఉద్యోగులు  ట్రెజరీ జీతాల కోసం రోడ్లెక్కే అంత దౌర్బాగ్య స్తితిలో ఉంది . భారత రాజ్యాంగం ప్రకారం మత సంస్తలు మీద రాజ్యం యొక్క అదికారం పరిమితంగా ఉండాలి. ఒక్క దేశ రక్షణ, ఆరోగ్య విషయాల లో నిబందనలు పూరిత చట్టాలు చేయడం  తప్పా మత సంబందమైన వ్యవహారాల్లో తల దూర్చడానికి వీలు లేదు. మత స్వాతంత్ర్య  విషయం లో గత ప్రభుత్వాలు ఇతర మతాలకు పుల్ స్వేచ్చ…

లాభాపేక్ష లేని "మేదో సంస్థకు అధిపతి అయిన 74 ఏండ్ల 'పచౌరి గారు', 29 ఏండ్ల చిన్న దాని చేతిలో చిత్తవడానికి "కామాపేక్షే " కారణమా?!!!

Image
నేను ఇదే బ్లాగులో "మగబుద్ది " గురించి టపాలు ప్రచురించడం జరిగింది. అందులో ఒక దానిలో :
" ఎనిమిది ఏండ్ల వాడైనా , ఎనబై ఏళ్ళ వాడైనాసరే , వాడి కుండే "మగబుద్ది " తీరే అంత ! సందు దొరికితే చాలు ఆడదాన్ని కాటు వేయాలనే చూస్తుంది . పైకి ఎంత సంస్కార వంతులుగా, పెద్దమనిషిగా  కనిపించినా ,స్త్రీల పొందు విషయంలో మాత్రం వచ్చిన అవకాశం చచ్చినా వదులుకోడు . ఎందుకంటె పరాయి స్త్రీల పొందు వాడిలోని  మగ ఇగో ను సంతృప్తి పరస్తుంది . అందుకె ఇంట రంబ వంటి భార్య ఉన్నా , మగ వాడి చూపు వీదుల్లొ వెళ్ళె ఇంతుల పైనే ఉంతుంది . మగవాడి మనస్తత్వం విషయం లో మన పెద్దలు వాస్తవ ద్రుష్టి కలిగినవారు కాబట్టే ,తప్పుడు పనుల విషయంలో పురుషులను శిక్షిస్తూనె , స్త్రీలకు స్వయం రక్షిత విదానాలు కొన్ని సూచించారు . అవి ఒక్కొక్క సారి కష్టంగా అనిపించినాస్త్రీ  రక్షణ కోసం పాటించక తప్పదు .అందులో బాగమే వస్త్ర విదానం , సామాజిక కట్టుబాట్లను పాటించటం  వగైరా , వగైరా
      స్త్రీలకు బగవంతుడు ఇచ్చిన సహజ వరం ఒకటి ఉంది . అదేమిటంటే  కొత్తగా ఎవరైనా పురుషుడు పరిచయమైతే , అతని చూపులో మనసులో ఉన్న దుర్బుద్దిని…

ఎందరినో వల వేసి పట్టినోడు, అమ్మాయి వలలో పడి జైలు పాలయ్యాడు!

Image
తెహెల్కా! దీని పేరు చెపితే తప్పులు చేసే వారికి కొంచం గుండె గుబేలు మంటుంది! పెద్ద పెద్ద వారిని తన స్టింగ్ ఆపరేషన్ ల ద్వారా పరేషాన్ చేసిన ఘనత ఈ  మాగజైన్ కు ఉంది. మొట్టమొదటగా 2000 సంవత్సరం లో క్రికెట్ మాచ్ పిక్సింగ్ కుంభ కోణం ని తన స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయట పెట్టి సెన్సేషనల్ అన్న తన ఉనికిని బహిర్గత పరచింది. అలాగే రక్షణ ఆయుదాల కుంభకోణం కేసులో నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ తో ఏకంగా రెండు జాతీయ పార్తీల నాయకులే రాజీనామాలు చెయ్యాల్సి వచ్చింది. అందులో మన తెలుగు వారైన B.J.P.బంగారు  లక్ష్మన్ గారు ఒకరు. ఇలా ఏది చేసినా ఒక సెన్సేషనల్ గా చేస్తూ , రాజకీయ నాయకులే కాక ఇతర వర్గాల వారి గుండెల్లో కూ డా రైళ్ళు పరిగెత్తించ గలిగింది. తెహెల్కా అంటే తెలుగులో సంచలనం అని అర్దం. దీని వ్యవస్తా పకులులో ఒకరైన "తరుణ్ తేజ్ పాల్" దీనికి ప్రదాన సంపాదకులు కూడా . ప్రముఖ పెమినిస్ట్ షోమా చౌదరి మేనిజింగ్ ఎడిటర్. వీరి పత్రిక పాపులర్ అయ్యాక చాలా మంది నుంచి వీరు డొనేషన్ల రూపం లో డబ్బులు వసూలు చేసినట్లు వీరి మీద ఆరోపణలు ఉన్నాయి .

     అయితే అదంతా ఒక ఎత్తు. తెహెల్కా నిర్…

"పని నేర్చుకోండి ముందర,పెళ్లికెందుకు తొందర".పథకం అమలులో సక్సెస్ అవుతున్న ఇండియన్ యువత!!?

Image
కొన్నేళ్ల క్రిందట మన గవర్నమెంట్ వారు విశేషం గా ప్రచారం చేసిన స్లోగన్ ఇది. ఆ రోజుల్లో తక్కువ వయస్సులో వివాహాలు చెయ్యడం,ప్రజలకు కుటుంబ నియంత్రణ పద్దతుల మీద అవగాహాన లేకపోవడం వలన కనీస వయస్సు రానిదే పెండ్లిళ్లు జరిపితే పుట్టబోయే పిల్లల ఆరోగ్యాలు,మాతా శిశు సంరక్షణ ఇవ్వన్నింటిని ద్రుష్టిలో పెట్టుకుని ’ముందు ఉద్యోగం తర్వాతె పెళ్లి’ అనే నినాదం ముందుకు తెచ్చారు.

  అంతవరకు బాగానే ఉంది.అందరికి ఉద్యోగాలు లేక ఉపాది కల్పనా అనేది అందని పండు అయింది. ఎక్కడికి వెల్లిన  ఏ పని దొరక్కపోయే సరికి ఏం చెయ్యాలో యువతకు పాలు పోలేదు.కావాల్శిన పని దొరకడం ఎలాగు లేట్ అవుతుంది కాబట్టి, తమకు చేత నైన పని చెయ్యడం మొదలుపెట్టారు.అదేమిటంటే ప్రేమించడం,ముచ్చట తీర్చుకోవడం?ఈ  పని నేర్చుకోవడం లో వారికి ఇతోధికంగా సహాయం చేస్తున్నవి విదేశీ సంస్కృతికి ప్రతిరూపమైన డేటింగ్ సైట్లు

                           ఇక ఈ విదంగా పదవ తరగతికి వచ్చేసరికి "గర్ల్ ఫ్రెండ్" లేని జీవితం ఒక జీవితమా? బాయ్ ఫ్రేండ్ లేని బ్రతుకూ ఒక బ్రతుకేనా అనుకుంటు,ఊహాలోకాలలో విహరించి జీవితాన్ని ఎంజాయి చెయ్యడాలు,అన్ని ముచ్చట్లు తీర్చుకోవడాలు, ఆ తర్వాత పెద్దలకు త…

ఇంటి కుక్కను కట్టెసుకోపోయినా , ఇంట్లో కొడుకును అదుపులో పెట్ట్టెసుకోలేక పోయినా , ఇంటి ముందు ఇలాగే ఉంటుంది మరి ! .

Image
మనం సాదారణంగా ఇంట్లో పెంచుకునే కుక్కలను కట్టెసుకుంటాం . ఎందుకంటే  వీదుల్లో వెళ్ళేవారిని కరుస్తాయని కావచ్చు, లేకపోతే వీదుల్లోకి వెళ్లి తోటి కుక్కలతో గొడవపడి , తిరిగి అవి దాడికి దిగితే మన కుక్కకే నష్టం కాబట్టి . ఇక్కడ నాకెందుకో ఇంట్లో కొడుకు బుద్ది , కుక్క బుద్ధి ఒకటే అనిపిస్తుంది.  కుక్కకు కొంచం సందు దొరికితే రయ్యిన వీదిలోకి వెళుతుంది . తోటి కుక్కలతో గొడవపడే ముందు దానికి ఇల్లు గుర్తుకు రాదు. కాని పది కుక్కలు వెంటపడితే మాత్రం అప్పుడు ఇల్లు గుర్తుకు వచ్చి, ఆదరా బాదరా ఇంట్లోకి పరుగెత్తుకు వచ్చి , ఇంట్లో జొరపడి మూలన నక్కి అరుస్తుంది . అప్పుడు ఇంటి కుక్క రక్షణ యే ద్యేయంగా , ఆ వీది కుక్కలను తరిమి వేయాల్సి వస్తుంది . ఇది కుక్క కాబట్టి O.K , మరి అదే కొడుకు అయితేనో?

    అమ్మాయిలతో తిరిగేటప్పుడు , వారిని ప్రేమించేటప్పుడు, ఇంట్లో వారి అనుమతి లేకుండా వారిని రహస్య వివాహాలు చేసుకునే టప్పుడు , అమ్మా బాబులు అస్సలు గుర్తుకు రారు. కాని మోజులన్ని తీరాకా , ప్రేమించిన అమ్మాయే పెను భారం అనిపించాకా , ఆమెను వదిలించుకోవడానికి ఠక్కున ఇల్లు గుర్తుకు వస్తుంది . వేంటనే వచ్చి…

తెలంగాణా లో R.I లను గిర్దావర్ లుగా మార్చినోళ్లు , S.I లను రజాకార్ లుగా మారుస్తారేమో !!?

Image
ఆంధ్ర ప్రదేశ్ నుండి విడిపోయేటప్పుడు తెలంగాణా అభివృద్ధి గురించి చాలా మందికి అనుమానాలు ఉన్నాయి .ఆ అనుమానాలను పటాపంచలు చేయడంలో సపలమయ్యారు తెలంగాణా ముఖ్య మంత్రి శ్రీ కలువకుంట్ల చంద్ర శేఖర రావు గారు.అయితే కొన్ని తెరచాటు వర్గాలు ఆయన్ని ఎలా అయిన అప్రతిష్టల పాలు చేయాలని చూస్తున్నట్లు ఉన్నాయి. అందులో భాగంగా తమ ఇష్టాలను ప్రజల మీద రుద్దుతూ ఇదంతా ముఖ్యమంత్రి గారి ఇష్ట ప్రకారమే జరుగుతున్న దని.ప్రజల్ని నమ్మిస్తూ వారిని నోరెత్త కుండా చేస్తున్నారు.అందులో భాగమే ఇటీవలి రెవిన్యూ అధికారుల హోదా పేర్లు మార్పు విషయం.

     జాగీర్దారీ భూస్వామ్య నిరంకుశత్వంలో శతాబ్దాలుగా పీడనకు గురి అయిన తెలంగాణా ప్రజలు, భారత దేశానికీ స్వాతంత్య్రం సిద్దించాక కూడా తమకు స్వాతంత్య్రం దొరకక మరొక స్థానిక స్వాతంత్ర్య పోరాటం చేయాల్సి వచ్చింది . ఆ పోరాటాన్ని అణచివేయడానికి ఆ నాటి నిజాం ప్రభుత్వం "రజాకార్ " అనే జిహాదీ గ్రూపులను తయారు చేసి  ప్రజలను ఊచకోత కోయించింది . ఆ అరాచక పాలనను అంతం చేయడానికి చివరకు భారత ప్రభుత్వం మిలటరీ ఆపరేషన్ కు ఆదేశించడం తో నిజాం లొంగిపోయి తెలంగాణను కూడా స్వతంత్ర భా…

రావణుడు చేత చెరచబడిన "రంభ "ల సంతానమా ఈ రచయితలంతా!!!?

Image
చరిత్ర లేక ఏదైనా ఒక ఇతిహాసం మీద పరిశోదన చేసేవారికి నిక్ష్పాక్షిక ద్రుష్టి ఉండాలి. అలాంటి దృష్టితో పరిశొదనలు చేసి తమ అభిప్రాయాలను వెలిబుచ్చితే , వారు చెప్పే మాటకు కొంత విలువ వుంటుంది. అంతే కాని పచ్చ కళ్ళద్దాలు పెట్టుకున్న వారికి లోకం అంతా పచ్చగా కనిపించినట్లు, మనసులో ఒక బావం ముద్ర వేసుకుని , అదే బావం తో చరిత్రలను లేక ఇతి హాసాలను పరిసీలిస్తే , వారి మనసుల్లో పాతుకుపోయిన బావాలే అందులో కనపడతాయి తప్పా, వేరు రకంగా కనపడడానికి అవకాశమే లేదు. ఎవరికీ ఇష్టం వచ్చిన రీతిలో వారు రామాయణ , మహాభారతాలను విశ్లేషించే  స్వేచ్చా  స్వాతంత్ర్యాలు , ఈ దేశ రాజ్యాంగం తన పౌరులకి ఇచ్చింది కాబట్టి, ఎవరి రంగు కళ్ళ జోళ్ళు వారు పెట్టుకుని , వారికి కనిపించే విదంగా వారు విశ్లేషిస్తున్నారు . మరి నేను కూడా నా జోడు దరించి రామాయాణాన్ని పరిశీలిస్తే  ఈ   క్రింది విదంగా అనిపించింది.

                                 రామాయణం అనేది భారతదేశం లో మెజార్టీ  ప్రజలు యొక్క ఆరాదనీయ గ్రందం. దానిని రచించించినది వాల్మీకి అనే మహర్షి గా మారిన   ఒక బోయ వాడు.ఈ   దేశం లో దళితులూ రాసేదంతా దళిత సాహిత్యమే  అని అనుకున్…

మట్టికుండ కోసం గొర్రె ని కోసి గోడని కూల్చిన కధ ను గుర్తుకు తెచ్చిన "బోరు బావిలో గిరిజ" ఉదంతం !

Image
గత మూడురోజులుగా రంగారెడ్డి జిల్లాలో  మంచాల గ్రామంలో జరుపుతున్న బోరు బావి రెస్క్యూ అఫరేషన్ గమనిస్తుంటె నిజంగా మన అధికారులు ఇంత మానవత్వం ఉన్న వారా అని ఆశ్చర్య పోవాలో లేక ఇంత పాగల్ గాళ్ళా అని నిర్ఘాంత పోవాలో అర్ధం కాకుండా ఉంది. వేల కిలోమీటర్లు దూరం నుండి వేగంగా దూసుకు వస్తున్న హుడ్ హుడ్ తుపాన్ ఎక్కడ తీరం దాటుతుందో చెప్పగలిగే అంత టెక్నాలజి ఉన్న మనకు నీరున్న బోరు బావి లో పడిన నాలుగేళ్ల పాప బ్రతికి ఉందా? లేదా ? అని నిర్దారించే టేక్నాలజి లేదనుకోవడం అమాయకత్వమే అవుతుంది. మరి అటువంటి  టేక్నాలజి  ఉండి కూడా మూడు రోజులు రేయింబవళ్ళు, మన ఘనత వహించిన అధికారులు, ఒక మంత్రి గారి పర్యవేక్షణలో 13 జే సి.బి లు ఉపయోగించి  సుమారు ఎకరం భూమిని నాశణం చేసి చివరకు పాప చని పోయిందని సి సి. కెమేరాలు ద్వారా నిర్దారించి చెప్పడమ్ లో గల అంతర్యమ్ ఏమిటి  అనేది అంతుబట్టని విషయమే. వివరాలు లోకి వెళితే


   ఒక తాత, అమ్మమ. . వారికి కొంత భూమి ఉంది. అందులో బోరు వేసారు. నీరు పడలేదని బోరుని వాడటం  లేదట. అయినా దాని మీద ముళ్ళ కంప వేసారు. అయితే వారం క్రితం ఆ ముళ్ల  కంప తీసి వేసార ట . ఒక రోజు తల్లిని కోల్పోయిన తమ కూతురి కోడుకు మరియు  కూ…

ఆ ఆయుర్వేద వైద్యుడి చేతిలో మోసపోయిన R.K న్యూస్ చానల్ సంబందిత మహిళలు ఎవరు?

Image
కొన్ని మీడియా చానళ్ళ ప్రసారాలు చూస్తుంటే అవి సమాజ ఉద్దరణకు పనిచేస్తున్నాయా , లేక తమ చానల్ రేటింగ్ ల కోసం ఎవరో ఒక ప్రముఖుడుని టార్గెట్ చేసుకుని రెండు మూడు రోజులు ఊదరగొట్టి , తాము ప్రసారం చేసిన కధనాలను ఆదారం చేసుకుని ఎవరైనా మీడియాలో కనపడాలనే తపనతో చేసిన వ్యాఖ్యానాలు ప్రసారాలు చేస్తూ , రాష్ట్రమంతా తమ చానల్ వలనే చైత్యన్యమవుతుంది అన్న అభిప్రాయం ప్రజలలో కలుగ చెయ్యడానికి పని చేస్తున్నాయా అనిపిస్తుంది. .

                       ఉదాహరణకు R.K.  న్యూస్ చానల్  వారు గత 3 రోజులుగా , ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ఏల్చూరి గారి గురించి ఒక కదనం ప్రసారం చేస్తున్నారు. దానీ సారాంశం ఏమిటంటే ఏల్చూరి ఆయుర్వేదం వైద్యం పేరుతో తన దగ్గరకు వచ్చే మహిళలను లైంగికంగా లొంగదీసుకుంటున్నాడు అని. దీని తాలూకు ఒక వీడియోను కూడా  చానల్ వారు చూపిస్తున్నారు. అయితే అందులో ఉన్న పురుషుడు ఎవరు అనేది స్పష్టంగా లేదు. కానీ ఆ  విడియో మీద ఏల్చూరి గారు కూడా  ఎటువంటి ప్రతిస్పందన తెలియపరచటం లేదు కాబట్టి అది ఆయనకు సంబందించిన విడియో యే అనుకుందాం. అయితే అతనితో సరాగాలు ఆడుతున్న స్త్రీ తన ఇష్టపూర్వకంగానే అతనితో కలిసి ఉన్నట్లు అ…

భార్యలూ జాగ్రత్త ! ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించినా , అత్తమామలు కు దూరంగా వెళదామని సతాయించినా ,ఇక విడాకులే మరి!

Image
మొన్న అక్టోబర్ 6 వ తారీఖున భారత దేశ అత్యున్నత న్యాయస్థానం వారు ఒక సంచలనాత్మక తీర్పును వెలువరించారు . సదరు తీర్పు ఈ క్రింది విదంగా ప్రవర్తించే భార్యలకు  నిజంగా చెంప పెట్టు లాంటిది . 
(1). మాటి మాటికీ ఆత్మహత్యలు చేసుకుంటాం అని భర్తలను బెదిరిస్తూ వారిని తమ చెప్పు చేతల్లో ఉంచుకోవాలనే భార్యలకు ,

  (2).  తన మొగుడి సంపాదన తనకూ ,తన పిల్లలకు తప్పా, భర్త తల్లి తండ్రులు అయినా అత్త  మామలకు కూడా  ఉపయోగపడరాదు  అనే దురాలోచనతో  , తమ భర్తలను అత్త మామలకు దూరంగా ఉంచాలని ,వేరు కాపురాలు పెట్టమని నిత్యం సతాయించే భార్యలకు  మరియు

   (3) తమ భర్తలకు వైవాహికేతర సంబంధాలు ఉన్నాయని తప్పుడు ఆరోపణలతో పోలీస్ స్టేషన్ లలో, కోర్టుల్లో  కేసులు పెట్టడం కానీ , పెద్దమనుషుల్లో పంచాయితులు పెట్టడం కానీ చేసి భర్తల పరువు ప్రతిష్టలను దిగజార్చే  భార్యలకు .

            నరేంద్ర Vs మీనా  అనే  దంపతుల విడాకుల కేసులో జస్టిస్ అనిల్ ఆర్ . దవే మరియు జస్టిస్ L. నాగేశ్వర రావు గారలు ఇచ్చిన క్రింది  తీర్పు  , భారత దేశం లో తమ భార్యల క్రూర మనస్త్వతంతో బాధలు పడుతున్న అనేక మంది     భర్తలకు తప్పక …