ఇలాంటి ఇల్లాలు ఉంటె, పూటకో ప్రియురాలు రోజుకో రేప్ కేస్ తప్పవు !

                                                   


                       బాలిఉడ్ నటుడు ఇంద్ర కుమార్ అనే అయన ని, రేప్ కేసు లో మొన్న అరెస్ట్ చేసారు . అయన మిద ఒక మోడల్  తనను రెండు సార్లు రేప్ చెయ్యడమే కాక , తనను శారీరకంగా హింసించాడు అని కేసు పెట్టింది . ఆమె పిర్యాడుతో ప్రాదమిక సాక్ష్యాలు ఆదారంగా అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు  కేసును దర్యాప్తు చేస్తున్నారు . అయితే ఆశ్చర్య కరంగా ఇంద్ర కుమార్ భార్య అయిన పల్లవి కుమార్ , తన భర్త నిర్దోషి అని , అ అమ్మాయే ఇష్టపూర్వకంగా తన భర్తతో మూడు రోజులు గడిపి , చివరకు బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశ్యంతోనే తప్పుడు కేసు పెట్టిందని , తన భర్త తరపున తానూ న్యాయ పోరాటం చేసి తన భర్తను కాపాడుకుంటాను అని చెప్పిన తీరు , భారతీయ మహిళల క్షమాగుణానికి , సహనానికి ప్రతిక అని చెప్పవచ్చు , తన భర్త మరియు అ అమ్మాయి కలిసి తనకు ద్రోహం చేసినా , చివరకు తన పిల్లల తండ్రి ఆపదలో పడితే అతని కోసం న్యాయ పోరాటానికి సిద్దం కావడం అంటే , ఖచ్చితంగా ఆమెలో ఒక "సతి సావిత్రి " ఉన్నట్లే!. కాని అవసరం అయిన సమయంలో మొగుడి ప్రవర్తనను ఖండించి , అతనిని సరి అయిన దారిలో నడిచేటట్లు చేసి ఉంటె ఆమె కుటుంబానికి ఈ తిప్పలు వచ్చి ఉండేవి కావు . ఆ కదా కమామిషు ఏమిటో చూదాం

           ఇంద్రకుమార్ బాలిఉడ్  నటుడు . అతనికి భార్యా పిల్లలు ఉన్నారు. అయన దగ్గరికి ఒక రోజు ఒక మోడల్ గా పని చేస్తున్న అమ్మాయి వచ్చి , తనకు సినిమా అవకాసం ఒకటి వచ్చిందని , త్వరలో సెట్స్ మీదకు రానున్న సదరు సినిమా కోసం తన దేహ సౌష్టవం కొరకు తనకు ట్రైనింగ్ ఇమ్మని కోరగా , అందుకు తన భార్యను అడిగి చెపుతాను అన్నాడట . సహజంగా అతడు నటుడు , జిం ట్రైనర్ కాబట్టి పల్లవి కూడా అందుకు ఓ.కే. అందట . అయితే ఆ విదంగా వారి ఇంట్లోకి ప్రవేసించిన అ అమ్మాయి జిమ్ ప్రాక్టిస్ సరిగా చేయలేదు కాని , ఇంద్ర కుమార్ తో లవ్ ప్రాక్టిస్ కోసం తహ తహ లాడి పోయిందట  చివరకు అది ఎంత దూరం వెళ్లిందంటే, ఆమె తన మణి కట్టును కోసుకుని , తన విర ప్రేమను ప్రదర్సించే అంతగా . దీనితో ఠారెత్తి పోయిన ఇంద్ర కుమార్ దంపతులు అ అమాయిని పిలిపించి ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదట . చివరకు ఆ అమ్మాయి విషయం మిద భార్య భర్తలు గొడవపడి , పల్లవి తన పుట్టింటికి వెళ్ళింది .
 
                         ఇదే అదునుగా బావిoచిన ఇంద్ర కుమార్ ఏకంగా అ అమ్మాయి ప్లాట్ కు వెళ్లి మూడు రోజులు స్వర్గ సుఖాలు అనుభవించాడు . మూడు రోజులు ప్రియురాలి మురిపాలలో మునిగి తేలిన ఇంద్ర కుమార్ కు చివరకు అ మత్తు వదిలి తిరిగి తనకు భార్యా పిల్లలు కావాలని అ అమ్మాయితో గొడవ పడి , ఆతను కూడా తన మణి కట్టును కోసుకున్నాడట . దానితో కంగారు పడిన అ ప్రియురాలు కంగారుగా పల్లవి దగ్గరకు వచ్చి విషయం చెపితే , ఆతను అలా తయారు కావడానికి ప్రియురాలే కారణం కాబట్టి , అతని కేమైనా అయితే ఆ  బాద్యత కూడా ఆమెదే అని చెప్పి పంపించిందట . కాని 15 నిమిషాలు గడిచినా అతని గురించి పోలీసులకు ఎ సమాచారం ఇవ్వనందుకు , చివరకు పల్లవే పోలీసు స్టేషన్ కి వెళ్లి సమాచారం ఇచ్చింది .

     అక్కడ పోలిస్ అధికారి "మొగుడు అంటే ఇష్టం లేని దానివి , ఇంకా ఎందుకు విడాకులు ఇవ్వలేదు ? అని పల్లవిని గద్దించి , తప్పంతా ఆమెదే అన్నట్లు మాట్లాడాడు . తమ బార్య భర్తల మద్య ఆ అమ్మాయి లేకుంటే తమ కాపురానికి ఎ ఆటంకం లేదు , అని పల్లవి ఎంత చెప్పినా వినిపించుకోలేదు . చివరకు ఇంద్ర కుమార్ని , అ అమ్మాయిని కేవలం చిన్న వార్నింగ్ తో వదిలెయ్యడంతో , అ అమ్మాయి కిల కిలా నవ్వుకుంటూ , ఇంద్ర కుమార్ తో చెట్టా పట్టాల్ వేసుకుని ఇంటికి వచ్చింది . కనీసం ఇంద్ర కుమార్ కి ప్రాదమిక చికిస్త కూడా ఇప్పించకుండా పోలిస్ వారు అతనిని తిరిగి ఆమె తో పంపివేయ్యడంతో , పల్లవి తన స్నేహితుని సహాయంతో తిరిగి పోలీసులను ఆశ్రయించింది . దానితో చిరెత్తుకొచ్చిన పోలీసులు , అ అమ్మాయి దగ్గర ఒక కంప్లైంట్ తీసుకుని , అతని మిద రేప్ కేసు బుక్ చేసి అతనిని జైలులోకి నెట్టారు . ఇప్పుడు తెల్లబోవడం పల్లవి వంతు అయింది . పోలిస్ వారి ముందు, తన భర్తతో చెట్టా పాట్టాల్  వేసుకు తిరిగిన అమ్మాయి , అతనితో తనకు సంబంధం ఉందని ఒప్పుకున్న  అమ్మాయి , రేప్ కేసు పెడితే పోలిస్ వారు దానిని నమ్మి తన భర్తను అరెస్ట్ చెయ్యడం వెనుక పెద్ద కుట్ర ఉందని , పల్లవి ఆరోపిస్తూ , సహాయం కోసం కనపడిన వారినల్లా ప్రాదేయ పడుతుందట పాపం!

   
                            కాబట్టి , దేనినైనా మొక్క  దశలోనే త్రుంచి వేయకపోతే , అది మాను అయ్యాక కష్టం అవుతుంది  . పై ఉదంతంలో ఇంద్ర కుమార్ బుద్ది గడ్డి తిందని అర్ధమవుతూనే ఉంది .కాని తన వల్ల మరో స్త్రీ జీవితం నాశనం అవుతుందని తెలిసి మరి అంత బారి తెగిoచడం  అ మోడల్ కు ఎంతవరకు న్యాయం? . ఇద్దరూ తప్పు చేసినా , చివరకు ఆతను రియలైజ్ అయి , భార్యా పిల్లల వద్దకు వెళతాను అంటే అతని మిద రేప్ కేసు పెట్టడం , పోలిస్ వారు కూడా మోడల్ కె సహకరిo చడం చూస్తుంటే పోలిస్ వారికి కూడా ఇల్లాళ్ళు మిద కంటే ప్రియురాళ్ళు మీదే సానుభూతి ఎక్కువ అని తెలుస్తుంది . కాబట్టి భారతీయ ఇల్లాళ్ళు బహు పరాక్ ! ఒక కన్ను ఎప్పుడూ మొగుళ్ళ మీదే ఉంచండి . చేతులు కాలాక ఆకులూ పట్టుకుని ప్రయోజనం లేదు .
                                                   (30/4/2014 post Reublished). 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం