ఆ ఆయుర్వేద వైద్యుడి చేతిలో మోసపోయిన R.K న్యూస్ చానల్ సంబందిత మహిళలు ఎవరు?
కొన్ని మీడియా చానళ్ళ ప్రసారాలు చూస్తుంటే అవి సమాజ ఉద్దరణకు పనిచేస్తున్నాయా , లేక తమ చానల్ రేటింగ్ ల కోసం ఎవరో ఒక ప్రముఖుడుని టార్గెట్ చేసుకుని రెండు మూడు రోజులు ఊదరగొట్టి , తాము ప్రసారం చేసిన కధనాలను ఆదారం చేసుకుని ఎవరైనా మీడియాలో కనపడాలనే తపనతో చేసిన వ్యాఖ్యానాలు ప్రసారాలు చేస్తూ , రాష్ట్రమంతా తమ చానల్ వలనే చైత్యన్యమవుతుంది అన్న అభిప్రాయం ప్రజలలో కలుగ చెయ్యడానికి పని చేస్తున్నాయా అనిపిస్తుంది. .
ఉదాహరణకు R.K. న్యూస్ చానల్ వారు గత 3 రోజులుగా , ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ఏల్చూరి గారి గురించి ఒక కదనం ప్రసారం చేస్తున్నారు. దానీ సారాంశం ఏమిటంటే ఏల్చూరి ఆయుర్వేదం వైద్యం పేరుతో తన దగ్గరకు వచ్చే మహిళలను లైంగికంగా లొంగదీసుకుంటున్నాడు అని. దీని తాలూకు ఒక వీడియోను కూడా చానల్ వారు చూపిస్తున్నారు. అయితే అందులో ఉన్న పురుషుడు ఎవరు అనేది స్పష్టంగా లేదు. కానీ ఆ విడియో మీద ఏల్చూరి గారు కూడా ఎటువంటి ప్రతిస్పందన తెలియపరచటం లేదు కాబట్టి అది ఆయనకు సంబందించిన విడియో యే అనుకుందాం. అయితే అతనితో సరాగాలు ఆడుతున్న స్త్రీ తన ఇష్టపూర్వకంగానే అతనితో కలిసి ఉన్నట్లు అర్దమవుతుంది. అ సీన్ వైద్యశాలలో జరిగినదా , లేక అతని ప్రైవేట్ రెసిడెన్స్ ప్రాంతంలో జరిగిందా తెలియటం లేదు. కానీ ఆ వీడియో ని చానల్ వారు జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో చిత్రీకరించినట్లుంది. దానిని ప్రసారం చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా తమ చానల్ కు అభినందనల వెల్లువ ముచెత్తుతుందని చానల్ వారు చెప్పుకుంటున్నారు. కొంతమంది మహిళా సంగాల నాయకురాళ్ళు కామెంట్లు తమ చానల్ ను కీర్తిస్తూ , ఎల్చూరిని విమర్శిస్తూ చేసినవి ప్రసారం చేస్తూ , ఒకటే ఊదరగొడుతున్నారు. దీనికి ఏల్చూరి గారు ఏమి స్పందించటం లేదంటే ఆయనకు మనసులో ఎక్కడో తనకు ఆ రకం "నెగటివ్ పబ్లిసిటి " కూడా లాభదయకమే అని అనుకుంటున్నట్లు ఉంది.
నిజంగా స్త్రీల పట్ల ఎవరైనా అసబ్యంగా ప్రవర్తించినా , వైద్యం పేరుతో వారిని లైంగికంగా వేదించినా ఒక చిన్న కంప్లైంట్ ఇస్తే చాలు. చట్టం నిర్భయంగా అటువంటి వారి పని పడుతుంది. కానీ బాదిత మహిళలు ఎవరూ తాము వేదింపులకు గురి అయ్యామని ముందుకు రానప్పుడు, వారి తరపున వకాల్తా పుచ్చుకుని రాష్ట్రమంతా రచ్చ రచ్చ చెయ్యడం ఎంతవరకు సమంజసం? అసలు జరిగినదేమిటో తెలుసుకోకుండా మీడియా వచ్చింది కదా అని ఏవేవో కామెంట్లు చేస్తే , రేపు ఆ బాదిత స్త్రీలు తమ ఇష్టప్రకారమే జరిగిన ప్రైవేట్ వ్యవహారం అంటే ఏమిటి పర్యవసానం? ఆయుర్వేద వైద్యుడు ఎవరితోనైనా లైంగిక సంబందాలు కలిగి ఉంటే అది అతని బార్యకు జరిగే నష్టం. దాని గురించి ఆవిడ గారు ఆలోచించాలి. అంతే కానీ రాష్ట్ర మంతా గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఏమిటి? ఒక వేళా వైద్యానికి వచ్చే స్త్రీలతో , వైద్యశాలలో అయన అసబ్యంగా ప్రవర్తిస్తుంటే తగిన సాక్ష్యాదారాలతో చానల్ వారు సంబండిత వైద్య విభాగ అధికారులకు తెలియ చేసి అతని గుర్తింపు సర్టిపికేట్ ను రద్దు చేయించవచ్చు. అంతే కానీ వరుసగా చెప్పిందే చెప్పి ఊదరగొట్టడం లో అసలు ఉద్దేస్యం చానల్ రేటింగ్ కోసమైనా కావాలి, లేదా అది ఆపడానికి తగిన ప్రతిపలం కోసం ఆశిస్తూ అయినా ఉండాలి.
స్త్రీ బలహీనత అన్నింటిలో పరమ నీచమైనది. ఎంత గొప్ప వ్యక్తీ అయిన దీన్ని జయించలేక అదమాదమ స్తాయికి పడి పోతున్నాడు. స్టింగ్ ఆపరేషన్ చేసే వారంతా పరమ పవిత్రులు కారు. దీ గ్రేట్ తెహెల్కా అధిపతి తేజ్పాల్ ఉదంతం చూసిన తర్వాత అయినా బలహీనత ఉన్న మగవాళ్ళు బుద్ది తెచ్చుకుంటే మంచిది. ఆవుర్వేడ వైద్యమైనా , అల్లోపతి వైద్యమైనా సాద్యమైనంత వరకు స్త్రీలకు స్త్రీలు , పురుషులకు పురుషులు చేస్తేనే మంచిది. అందుకే కొన్ని , కొన్ని మత సంస్తలు తమ కార్యాకలాపాలలో స్త్రీలకు నిషిద్దం ప్రకటించాయి. ఇది తప్పుడు అభిప్రాయమే అయినప్పటికి , ఇటీవల పెద్దవాళ్ళు అని పేరొందిన పురుషుల ఉదంతాలు చూస్తుంటే , అటువంటి నిబందనలు బవిష్యత్ లో తప్పవేమో అనిపిస్తుంది. నిజంగా అసలు జరిగిన విషయం ఏమిటో ఇప్పటికైన ఏల్చూరి గారు ప్రకటిస్తే బాగుంటుంది.
(22/12/2013 Post Republished).
Comments
Post a Comment