"ఆత్మ శుద్ది" పేరుతో ఆమెను తాక రాని చోటల్లా తాకి ఉద్యోగం ఊడగోట్టుకున్న మేజర్ జనరల్ !

                                                                       
   


అయన ఇండియన్ ఆర్మీ లో ఒక గొప్ప ఆపిసర్ . అయన హోదా కూడా  మామూ లు చోటా మోటా ఆపీసరేమి కాదు . ఏకంగా ఇండియాలో ఎంతో పేద్దదైన 3వ ఇన్ఫాంటరీ డివిజన్ కి జనరల్ ఆపిసర్ అప్ కమాండింగ్ . అయన గారి 36 ఏండ్ల సర్వీసులో చిన్న మచ్చ కూడా లేని వాడు . అయినా ఏమి లాబం ? చివరాఖరి దశలో ఒక అమ్మాయి పట్ల అయన చూపిన "మగబుద్ది " ఆయనను సహచర వర్గంలో దోషిగా చేయడమే కాకుండా , చివరకు ఉద్యోగాన్నే ఊడగొట్టిoది. కొంత మంది మగవాళ్ళు,దుర్వ్యసనం కల జూనియర్ లేడి ఆపిసర్ అయిన   ఆ అమ్మాయి కావాలనే అతని మీద తప్పుడు ఆరోపణలు చేసి అతని ఉద్యోగం ఊడగొట్టింది అని అంటున్నా , యోగా , ద్యానం పేరుతో ఒక పురుషుడు పరాయి స్త్రీని బాడీ టచ్ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయడిన ఆర్మీ ట్రిబ్యునల్ అతనిని ఉద్యోగం నుండి తొలగించడం సబబే అని పేర్కొంటూ , అయన గారి మచ్చ లేని సేవా చరిత్రను కోడా తన తీర్పులో పేర్కొనటం గమనార్హం . ఇదంతా చేసింది అయన లోని సేవా తత్పరుడైన ఆపిసర్ కాదని , ఆయనలో ఏదో మూలాన దాక్కున్న చపల మైన "మగబుద్ది " అని, కాబట్టి శిక్షిం చాల్సింది అతనిలోని ' మగబుద్ది 'నే కాని, అపిసర్ని కాదని ,  నాలాంటి  వాడు వాదించినా పట్టించుకునేది  ఎవరు? కేసు వివరాలు లోకి వెళితే
      మేజర్ జనరల్ అరుణ్ కుమార్ లాల్ 2010 లో లైంగిక హింస ఆరోపణలు మిద పదవిచ్య్తుతు లయ్యారు . అయన మిద అయన క్రింద పని చేసే జూనియర్ లేడి ఆపిసర్  ఒకామే , తనను మెడిటేషన్ పేరుతొ ఇంటికి రమ్మని చెప్పి మెడిటేషన్ లో బాగంగా అయన గారి ప్రైవేట్ పార్ట్స్ ను తాకి ఆయనలో ని చక్రాలు (విశుద్ద చక్రం, అనాహత చక్రం మొ//) ని ఉత్తేజ పరచమని అడుగగా  తానూ నిరాకరించాను అని ,అ తర్వాత రోజు కూడా అయన గారి వికృత కోరికను నిరాకరించగా , తానె ఆమెలోని చక్రాలను ఉత్తేజ పరుస్తాను అని చెప్పి , తనను తాకరాని చోట్ల తాకాడని కంప్లైంట్ చేసింది . అయితే గమ్మతైన విషయం ఏమిటంటే అ తర్వాత ఆమె అతనితో డిన్నర్ కూడా చేసింది . దానికి ఆమె చెప్పిన రీజన్  యోగా లో గురువులు శిష్యులకు భోజనం పెట్టడం ఆనవాయితీ అని అయన చెప్పడం వలన ఆయనతో డిన్నర్ చేసాను అని చెప్పింది . కానీ తాక రాని  చోట తాకి అవమాన పరచిన వాణ్ని గురువు అని ఎలా బావిమ్చిమ్దో అర్ధం కాని ప్రశ్న .? మగబుద్ది అంటే  ఇదేరా !

  ఇక అ పెద్దాయన ని అలా ఎందుకు చేసావు అయ్యా అంటే , రామ !రామ అదంతా అబ్బద్దం , అ లేడి ఆపిసర్ కి తాగుడు , తిరుగుడు లాంటి దుర్వ్యసనాలు ఉంటే వాటిని మాన్పిద్దాం అనే ఉద్దేశ్యంతో ఆమె లోని చక్రాలను ఉత్తేజం చేయాలని చెప్పాను , అంతకు మించి ఏమి లేదు అని అనడం  జరిగింది . ఏది ఏమైనా ఒక మగాడు దగ్గర పరాయి స్త్రీ ఏకాంతంగా నేర్చుకునే పరిస్తితులే ఉంటే ఇదిగో ఇలాంటి వేదవ వ్యవహారాలే జరుగుతాయి అనటానికి  ఈ కేసు కూడా ఒక గొప్ప ఉదాహరణ . నేను ఈ బ్లాగులో "మగబుద్ది " గురించి కొన్ని పోస్ట్లు లు పెట్టాను . అ సిరియల్ లోకే ఇది కూడా వస్తుంది . ఆసక్తి ఉన్నవారు "మగబుద్ది " లేబుల్ తో ఉన్న పోస్ట్లు చూడగలరు .

    మగబుద్ది అనేది ఇండియాలోని యోగా నేర్పే కొంతమంది గురువులకు మాత్రమే పరిమితం అనుకుంటే పప్పులో కాలేసినట్లే ! ఇది ప్రపంచ వ్యాప్తం .  ఆడది ఒంటరిగా మెడిటేషన్ క్లాస్ లో దొరికితే  "మగబుద్ది" ఎలా  ప్రవర్తిస్తుందో అది అనుభవించిన వారికే  తెలుస్తుంది !
                                                             (7/7/2014 Post Republished).
       

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

అర్దరాత్రి ఆరంభం అయ్యే ఇంగ్లీష్ ఇయర్ ! ఉషోదయంతో మొదలయ్యే తెలుగు ఉగాది ! మనకు ఏది కరెక్టు ?

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

మళయాళ శ్రుంగార నటి "శ్వేతా మీనన్" కేసు విషయం లో "మనవు" చెప్పిందే నిజమయింది!

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

మనల్ని ఆపదల నుండి కాపాడే నరసింహ మంత్రం

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.