"మతాంతర వివాహానికి ఒప్పుకోలేదని ప్రియురాలి తండ్రిని హత్య చేయించిన ఘనుడు !

                                                                           


తన కుమార్తెను సాంప్రదాయాలకు వ్యతిరేకంగా పరాయి మతస్తుడికి ఇచ్చి పెండ్లి చేయటం తనకు సమ్మతం కాదని అన్న పాపానికి ఘోరంగా హత్య చేసారు ఆ కసాయి వాళ్ళు . ఈ  ఉదంతం  అమ్మాయిలే కాదు , తమ ప్రేమను కాదంటే వారి తల్లి తండ్రులను అయినా మట్టు పెట్టడానికి వెనుకాడని పైశాచిక మృగాల్ల మనస్తత్వాన్ని తెలియ చెస్తుoది. వివరాలు లోకి వెళితే

 ఖమ్మం జిల్లాలోని ఆశ్వాపురం లోని హెవి వాటర్ ప్లాంట్ లో కర్ణాటక కు చెందిన కంచన్ గౌడ్ గారు టెక్నీషీయన్ గా ఉద్యోగం చేస్తున్నారు.ఆయన కుమార్తె మంజుల మంజుల మచిలీ పట్నం లో B.Tech   చదువుతున్న రోజుల్లో ఆమెకు చదువు చెప్పాల్సిన ప్రొపెసర్ అయిన వసీం బేగ్ ఆమెను ప్రేమ ముగ్గులోకి దింపాడు. అలా నాలుగేళ్ళూ ప్రెమించుకున్నారు. ఆ తర్వాత ఆ అమ్మాయి సత్తుపల్లిలో M.Tech  పూర్తి చేసి ప్రస్తుతం గుడివాడలో ప్రైవేట్ లెక్చరర్ గా పని చేస్తుంది. ఇక ఈ ప్రేమ పాఠాలు నేర్పిన ప్రొపెసర్ గారు కూడా గుడివాడలోనే టౌన్ ప్లానింగ్ అదికారిగా ఉద్యోగం వెలగపెడుతున్నాడట. ఇలా ఏడేళ్ళు ప్రేమించుకున్న ఈ వీర ప్రేమికులకు ఇక పెంద్లి చేసుకుందాం అని అనిపించిదట. అమ్మాయికి అన్నాళ్లు ప్రేమించుకుంటున్నపుడు గుర్తుకు రాని తల్లి తండ్రులు పెండ్లి అనే సరికి గుర్తుకు వచ్చినట్లుంది, తన పెంద్లికి తన తండ్రి అనుమతి కావాలని అందట.

   దానితో ఆ బేగ్ గారు తన బాబాయి, సోదరుడు ను తీసుకుని అశ్వాపురం వెళ్ళి కంచన్ గౌడ్ గారి అనుమతి అడిగారట. తన కుటుంబం సాంప్రాదాయక మైనది కాబట్టి ఈ మతాంతర వివాహానికి అంగీకారం తెలుపలేనని ఆయన తెగేసి చెప్పాడట. దానితో ఆ బేగ్ గారు ఎక్కడికైనా వెళ్ళిపోయి పెంద్లి చేసుకుందాం అంటే ఆ ఏడేళ్ళ ప్రేమానుబందం ఉన్న ప్రియురాళ్ళు ఒప్పుకోలేదట. తన తండ్రి అనుమతి మస్ట్ అనే సరికి బేగ్ గారికి ఏం చెయ్యాలో పాలు పోలెదు. తండ్రి బ్రతికి ఉండబట్టి ఆయన అనుమతి కావాలంటుంది , అసలు ఆ తండ్రే లేకుంటే అనుమతి అన్న ప్రశ్నే ఉండదు కదా అని ఆ కసాయి వాడికి ఆలోచన వచ్చింది. వెంటనే తన నీచమైన ప్లాన్ ను తన బాబాయి కి, తమ్ముడుకి చెపితే వారి ఒంట్లో ఉన్నది అదే కసాయి రక్తం కాబట్టి వారు సరే అన్నారట.

  అలా ఆ బాబాయి , తమ్ముడు కలసి అశ్వాపురం దగ్గరలో మిట్ట గూడేం వద్ద ఆటోలొ వస్తున్న కంచన్ గౌడ్ గారిని అడ్డగించి, ఆటో డ్రైవర్ను కత్తులతో బెదిరించగా అతను పారి పోయాడు. తర్వాత కంచన్ గౌడ్ గారిని పొడవడమే కాక  గొంతు కోసి చంపారట. దానితో తమ అడ్డు  తొలిగి పోయిందనుకున్నారు ఆ దుర్మార్గులు. కానీ పైనున్న ఆ భగవంతుడి చూపు నుండి పాపాత్ములు తప్పించుకోలేరు అన్నది నిజం చేస్తూ , ఖమ్మం జిల్లా పోలిసుల తీవ్ర క్రుషి వల్ల అసలు విషయం వెలుగులోకి వచ్చింది . ప్రస్తుతం కసాయి బేగ్ అతని బాబాయి తమ్ముడు ఊచలు లెఖ్ఖ పెడుతున్నారు.

  ఈ విషయం లో కంచన్ గౌడ్ గారి అమ్మాయి ఆలోచనా రహిత విదానం వలననే ఈ దురాగతం జరిగిందని చెప్పవచ్చు. తన కుటుంబ నేపద్యం, తల్లి తండ్రుల మనస్తత్వాలు తెలుసుకోకుండా తమ మతానికి చెందని తన  గురువునే ప్రేమించడం, అతని కోసం ఆతను పని చేస్తున్న ప్రాంతం లోనే ఉద్యోగం వెలగపెట్టడం, ఏడేల్లు ప్రేమించడానికి అవసరం రాని తండ్రి అనుమతి , పెండ్లికి కావాలనడం, ఇవ్వన్నీ కూడా ఆ ప్రోపెసర్ లోని అంతర్లీనంగా ఉన్న కసాయి తన్నాన్ని పైకి తెచ్చేలా చేసి చివరకు తన తండ్రి చావుకు తానే కారకు రాలు అయింది అని చెప్పవచ్చు.

  ఇక పోతే ఆ ప్రేమికుడి విషయానికి వస్తే పాటాలు చెప్పి శిష్యులను తీర్చి దిద్దాల్సిన పెద్ద మనిషి ప్రేమ పాటాలు చెప్పి అమాయక ఆడపిల్లను ట్రాప్ చేసి తన పబ్బం గడుపుకోవడం  నీచాతీ నీచం. ప్రేమించడానికి తనకు హక్కు ఉన్నట్లే కూతురి పెండ్లి విషయంలో తండ్రికి ఉండటడాన్ని సహించలేక పోవడం అతనిలోని కర్ఖశత్వానికి నిదర్శనం. తన  కోరికలు తీర్చుకోవడనికి ఎంత దురాగతానికి అయిన ఒడికట్టే రక్తం అతనిలో ప్రవహిస్తుంది . అతనే కాదు అతని బాబాయి తమ్ముడు లోను అదే రక్తం ఉండన్న విషయం వారు చేసిన పని తెలియ చేస్తుంది. అతనిలోని ఆ కర్ఖశ మనస్తత్వం తెలుసుకున్నాకే ఆ అమ్మాయి అతనిని పెండ్లి చేసుకోవడానికి ఇష్టపడక తన తండ్రి అంగీకారం అనే నెపం అడ్డుపెట్టి ఉండవచ్చు. కానీ అదే ఆ అమ్మాయి తండ్రిని బలి తీసుకోవడం అత్యంత దురద్రుష్ట కరం.

   వ్యక్తులు ఎంత చదుకున్నా , వారిలోని సంస్కారానికి వారు పుట్టి పెరిగిన కుటుంబ నేపద్యం కారణ మవుతుంది . దాని ప్రబావం నుండి అంత తొందరగా బయట పడలేరు. అందుకే పెండ్లి చేసుకునే ముందు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు. ఒక వేళ ఆ అమ్మాయి అతనితో  వెళ్ళి పోయి పెండ్లి చేసుకున్నా  ఆ కసాయి ప్రేమికుడి లోని కర్కసత్వాన్ని  ఏదో రూపం లో చవి చూడక తప్పదు.కాబట్టి ప్రేమలోకి దిగే ముందే ఇవ్వాన్నీ ఆలోచిచ గలిన జ్ణానం ఉండాలి. దానికి పరిణతి చెందిన వయస్సు తో పాటు వివేచనా శక్తి  ఉండాలి. అది లేనప్పుడు పెద్దల  అనుబవం తో  కూడిన నిర్ణయానికి తల వంచడమే సర్వ విదాలా శ్రేయస్కరం. 
                              (21/1/2014 P0st Republished).  

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!