ఒక్క రోజు మద్యం, మాంసం మానడమేనా జాతిపితకు మనమిచ్చే నివాళులు.?
నాకు మన ప్రభుత్వం వారు చేస్తున్నవి చూస్తే కొన్ని సార్లు నవ్వు వస్తుంటుంది.లేకపోతే ఏమిటండి. ప్రపంచం లో ఒక నూతన విదానం అదే నండి అహింసా విదానం తాను పాటించి, ప్రజలతో పాటింపజేసి, అ విదానంతొనే శత్రువులను నిరుత్తరలను చేసి భారత దేశానికి స్వాతంత్ర్యం సముపార్జించి పెట్టిన మహనీయుడు మన జాతి పిత మహాత్మ గాంది.
అసలు అహింసా మార్గం అంటే ధర్నాలు, బందులు చేయ్యడమని ఈనాటి చాలా మంది అభిప్రాయం.కాని అహింసా మార్గం అంటె ఎదుటివారి హింసను సైతం భరిస్తూ, హింస లేకుండా ఎదుర్కొనీ తమ నిరసనను తెలియచెయ్యడమే అహింస అని ఎంతమందికి ఈ సో కాల్డ్ గాందెయవాదులు నేర్పుతున్నారు. నిత్యం బంధ్ల పేరుతో, ధర్నాల పేరుతో హింసకు పాల్పడుతు జనజీవనాన్ని అస్త్యవ్యస్తం చేస్తున్న వారికి గాంది వారసులం అని చెప్పుకొనే అర్హత ఉందా?నిజమైన అహింసా విదానం గురించి పార్టీ కార్యకర్తలకే చెప్పలేని వారు గాందిగారి సిద్దాంతాలను వల్లే వేస్తు అయన వారసులమని చెప్పుకోవడం హాస్యాస్పదం .
ఇకపోతే ఏదో అయన పుట్టిన రోజు జరపాలి కాబట్టి ప్రభుత్వ పెద్దల కొంత మంది ఆలొచనలోంచి పుట్టిన ఈ ఒక్క రోజు మందు, మటన్ బందు కార్యక్రమాని చేపట్టీ ఇదే మేమిచ్చే నివాళి అని చాటుకుంటున్నారు. కాని నిజంగా చూస్తే ఇది మెజార్టి ప్రజల మనోబావాలను కించపర్చే చర్య. ఎందుకంటే మద్యం తాగేవారిని, మాంసం తినేవారిని ఒకే తీరుగ పరిగనించడం ఎంతవరకు సమంజసం? మాంసహారం అనేది మనలో మెజార్టి ప్రజల అహార విదానం. గాంది గారు తన కుటుంభ అహార అలవాటు ననుసరించి శాకాహారి గ జీవనం కొనసాగించి ఉండవచ్చు. అంతమాత్రంచేత మాంసాహారం అనేది తప్పుడు పని అన్నట్టు అయన గారి జన్మదినం పేరుతో నిషెదం విదించడం మాంసాహారులను అవమానించినట్టు కాదా? ఒక వేళ అయన మాంసాహారి ఇస్టుడై ఉంటే శాకాహార ప్రజలను ఆ ఒక్క రోజు మాంసం తినమని శాసనం చేసేవారా? ఏమిటి ఈ అర్థం లేని నిబందనలు.
మధ్యపానం అనేది కొంత మంది బలహీన మనస్కుల అలవాటు కాబట్టి, దాని వల్ల ఎన్నో సంసారాలు నాశనం అవుతున్నై కాబట్టి, ఒక్క రోజు కాదు నిజంగ మనది గాంది పుట్టిన దేశమే అయితే ,పూర్తిగ నిషేదించాలి. అది లేకపొతే ప్రభుత్వాలే నడపలేని స్తితిలొ ఉన్న వారు ఇటువంటి నిభందనలు పెట్టడ్డం చూస్తుంటె నవ్వు రాక ఇంకేమి వస్తుంది చెప్పండి.
ఏది ఏమైన సాద్యమైనంతవరకు అంటె దన మాన ప్రాణ భంగ పరిస్తితులలో తప్ప అన్ని వేళల్లో అహింసను పాటించడమే మనము అయనకు ఇచ్చే కనీస నివాళి.
నిజం చెప్పొద్దూ, మద్యం షాపు బయట ఉన్న జన సమర్ధం చూసే నాకు గాంధీ జయంతి గుర్తుకొచ్చింది. నిన్న నేను ఆఫీసు నుంచి వస్తూ వాహనంలోంచి బయటకు చూస్తున్న సమయంలో ఈ మధ్యం దుకాణాల వద్ద విపరీతమైన జనం. ఏమిట్రా అనుకుంటూ ఉంటె, రేపు అక్టోబరు రెండు కదా, పాపం గాంధీ గారి పుట్టినరోజు అని గుర్తుకొచ్చింది. వీళ్ళందరూ ముందు జాగ్రత్తగా "పానిక్ పర్చేస్" చేస్తున్నారు ఒకరోజు షాపు లేక విలవిలలాడిపోకుండా పాపం.
ReplyDeleteదన్యవాదాలు మీ స్పందనకు ప్రసాదుగారు
Deleteశివరామప్రాసాద్ గారు: అది ముందు జాగ్రత్తేకాదు "మందు" జాగ్రత్తకూడా :D
ReplyDeleteమనవుగారు: గాంధీ బోధనలను ఒకసారి list ఇస్తే బహుశా అందులో వచ్చేవి మద్యమూ, మాంసమూకాదు. అసత్యము, అహింస. అవి ఒక్కశాతమైనా పాటించడం మనవల్లకాదు కాబట్టే మిగిలిన ఒక్కశాతమైన మద్యమాంస నిషేధాన్ని వందశాతం పాటిస్తాం. It's like doing the least important things louder while leaving the more (most??) important things out there to die.
విలువలు "మెహారిటీ"కి అతీతంగా ఉండగలగాలి. ఎక్కువమంది మద్యాని సేవిస్తే అదికూడా మాంసాహారంలాగా "మెజార్టి ప్రజల పాన విదానం" అయిపోతుందా? ఒకవేళ మీరు యూరప్‌లోనో, అమెరికాలోనో జన్మించిఉంటే అప్పుడేమి అనగలిగుండేవారు? :P
మినర్వా గారికి ముందుగా మీ స్పందనకు దన్యవాదములు.మీరు చెప్పేది ఎలాగుందంటే "మహాత్ముడు చెప్పింది చెయ్యడం 99 శాతం అసాద్యం కాబట్టి,మిగిలిన 1 శాతం అది కూడ ఈ దేశంలోని శాకాహారుల అలవాటు, గాంది గారి పేరు మీద మాంసాహారుల మీద రుద్దొచ్చంట్టారు.
Deleteగాందిగారి కంటె ముందు ఈ దేశములో బుద్దుడు జన్మించాడు. అయన చెప్పిన "అష్టాంగ మార్గం" మీరు చెపుతున్నది ఉంది. కొన్ని వందల యేండ్లుగ అయన బోదలు ప్రజల్ని ప్రబావితం చేసిన మాంసాహారాన్ని ప్రజలు మానలేక పోయారు.. సాక్షాత్తు బుద్దుడే చివరి కాలంలో "పంది మాంసం" తిన్నాడు.కారణం మాంసాహారమనే అలవాటు కొన్ని వేల యేండ్ల నాటిది.
ఏదైనా సరే "అహారం ఆరోగ్యం కొరకు".మీకు హాని (శారిరకంగా,మానసికంగా) చెయ్యనిది ఏదైనా స్వీకరించవచ్చు.పంచ భక్ష్య పరమాన్నమైనా సరే షుగర్ వ్యాది ఉన్న శాకాహారి తినగలుగుతాడా?
మాంసాహారము కూడ అంతే."అతి సర్వత్ర వర్జాయేత్". ఏదైనా వ్యక్తికిగాని, సమాజానికి గాని చెడు జరగనంత సేపు ఏ అలవాటైనా సమర్దనీయమే. దానినే ఎక్కువ మంది ప్రజలు నిరంతరాయంగ పాటిస్తారు.
,
"గాంది గారి పేరు మీద మాంసాహారుల మీద రుద్దొచ్చంట్టారు"
ReplyDeleteనిజానికి.... కాదు. ఈ నిషేధాలన్నీ అప్రాధాన్యాలు. ఏవైతే ముఖ్యమో వాటిని ప్రక్కనబెట్టి, ఇలాంటి చిన్నచిన్నవాటిని పెద్దగా చేస్తుంటాము అంటున్నాను. గాంధీగారిని మందుబాబులమీదకూడా రుద్దకూడదు అనీ, రుద్దాలనుకున్నా, వద్దనుకున్నా దానికి "మెజారిటీ" ప్రాతిపదిక కాకూడదనీ మాత్రమే నేను చెప్పదలచుకున్నాను.
ఒక ఆహారపు అలవాటును దురలవాటు తో ముడిపెట్టి, రెండూ ఒకటే అంటున్న మీ విదానమే నేటి ప్రభుత్వ విదానం. ప్రజలకు చెడు అలవాట్లు మానమని చెప్పవచ్చు. చెప్పాలి అవసరమైతే పరిస్తితులానుసారం నిషేదం విదించాలి కూడ. అంతే కాని మోకాలికి బట్ట తలకి ముడి పెట్టినట్టు చెపితే ఎలా?
Deleteనా ద్రుష్టిలో మెజార్టి అంటే కుల మతాలకు అతీతంగా ఎక్కువ మంది ప్రజలు అని అర్థం. మద్యపానం మన దేశంలో ప్రజలలో సగబాగమయిన స్త్రీలకు ఎక్కువ మందికి అలవాటు లేదు. అది మన అహారపు అలవాటులో బాగం కాలేదు. కాని యురోప్ ,ఇతర దేశాలవారి పరిశ్తితి వేరు. వారిలో అత్యదిక(మెజార్టి అంటే మీఉ వేరేలా బావిస్తుండబట్టి ఈ పదం వాడుతున్నాను) ప్రజల అలవాటు కాబట్టి వినియూగంలో వారికి విచక్షణ ఉంటుంది.అంతేగాని తాగి తాగి ఇల్లు వొళ్లు గుల్ల చేసుకోరు. కాని ఇక్కడ అదే మద్యపానం ఒక ఎన్జాయ్మెంట్. ప్రజల అదుపులో అది లేదు,ప్రజలను అదుపు చెయ్యలేక చివరకు పాలకులు వారిని పరోక్షంగా ప్రొత్సాహిస్తు, రెవెన్యూ వనరు గా మార్చారు. ఇటువంటి దానిని ప్రజారాదకుడయిన గాంది గారి పేరు చెప్పి నియంత్రించడం సర్వదా సమర్దనీయం.
అత్యదిక ప్రజలు ఆమోదించని ఏ సూత్రమయిన, అది ఏ మహాను బావుడు చెప్పిన ఆచరనీయం కాదు. ఉదాహరణకు బుద్దుడు చెప్పిన " బ్రహ్మ చర్యం". ఇది పాటించమని చెపితే ఎలా ఉంటుంది? అలోచించండి. ఏది ఏమైన స్వీయ నియంత్రణ లేనప్పుడు పర నియంత్రణకు గురి కాక తప్పదు.ఇది మద్యపానంనకు వర్తిస్తుంది.
:D
ReplyDelete