దిగ్విజయి సింగ్ గారు తన "తోలి రేయి" కోసం కూడా ఇంత తొందర చేసి ఉండరు!
పాపం ఆ పెద్దమనిషికి తెలుగు వారు అంటే ఎంత ప్రేమ! ఎంత అపేక్ష! అందుకే తెలుగు వారిని రెండు రాష్ట్రాల ప్రజలుగా చూడాలని, ఈ మద్య ప్రదేశ్ వీరుడు కంకణం కట్టుకుని , ఆ పనిలో యమ బిజీగా ఉన్నట్లు కనిపిస్తుంది . ఈ రోజునే ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యయి. నిన్ననే రాష్ట్రపతి గారు తెలంగాణా విబజన ముసాయిదా బిల్లును సంతకం చేసి రాష్ట్ర అసెంబ్లీకి పంపారు.దానిమీద అభిప్రాయాలూ పంపడానికి 40 రోజులు గడువు ఇచ్చారు. ఈ లోపులో అసెంబ్లి అభిప్రాయాన్ని పంపవలసి ఉంటుంది . ఒక వేలా సీమాంద్ర నాయకులు ఏదైనా మతలబ్ చేసి కిరి కిరి పెడదామనుకున్నా, 40 రోజుల తర్వాత ముసాయిదా బిల్లు అసెంబ్లీ నుండి పంపినా , పంపకున్నా పార్లమెంట్ బిల్లును ఆమోదించవచ్చు. మరి ఇంత అధికారం కలిగిఉండి కూడా దిగ్విజయ్ సింగ్ గారు ఎందుకు నానా హంగామా చేస్తున్నాడో అర్దం కావటం లేదు. ఈ రోజ...