తిరుమల కొండకు వెళ్లి "అనకొండల కద" చెప్పిన చంద్ర బాబులో అంత హుషారు ఎలా వచ్చింది?
రాజకీయాలు ఏ క్షణాన ఎలా మారుతాయో తెలియదు. తెలంగాణా రాష్ట్ర విభజన లో తెలుగుదేశం పార్టీ రెండు కళ్ళ సిద్దాంతంతో అటు సీమాంద్రా ప్రజలకు, ఇటు తెలంగాణా ప్రజలకు కాకుండా 'రెండిటికి చెడ్డ రేవడి " అవుతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు బావించారు. కనీసం సీమాంద్రా ప్రాంతం వారి వోట్లతోనైనా లాబం పొందాలని బావించిన పార్టీలు, తెలంగాణా వాదాన్ని ప్రక్కన పెట్టి జై సమైక్యాంద్రా అని అనే సరికి వారికే సీమాంద్రాలో ప్రజలు పట్టం కడతారని ఆశిస్తున్న్బారు. ఇక తెలంగాణాలో T.R.S ప్రభంజనాన్ని తట్టుకునే శక్తి ఎవరికీ లేదు అనేది అర్దమవుతుంది. కాబట్టి రెండు ప్రాంతాల్లో తెలుగు దేశం పని ఇబ్బంది కరంగా మారింది అనుకుంటున్నారు విశ్లేషకులు . కానీ ప్రస్తుతం ఆ పార్టీ అదినేత చంద్ర బాబు గారి లోని దీమా తో కూడిన హుషారు చూస్తుంటే ఎక్కడో చక్రం తిప్పారు అనిపిస్తుంది. ఒక పక్క తెలంగాణా ...