తిరుమల కొండకు వెళ్లి "అనకొండల కద" చెప్పిన చంద్ర బాబులో అంత హుషారు ఎలా వచ్చింది?

                                                       


రాజకీయాలు ఏ క్షణాన ఎలా మారుతాయో తెలియదు. తెలంగాణా రాష్ట్ర విభజన లో తెలుగుదేశం పార్టీ రెండు కళ్ళ సిద్దాంతంతో అటు సీమాంద్రా ప్రజలకు, ఇటు తెలంగాణా ప్రజలకు  కాకుండా 'రెండిటికి చెడ్డ రేవడి " అవుతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు బావించారు. కనీసం సీమాంద్రా ప్రాంతం వారి వోట్లతోనైనా లాబం పొందాలని బావించిన పార్టీలు, తెలంగాణా వాదాన్ని ప్రక్కన పెట్టి   జై సమైక్యాంద్రా అని అనే సరికి వారికే సీమాంద్రాలో ప్రజలు పట్టం కడతారని ఆశిస్తున్న్బారు. ఇక తెలంగాణాలో T.R.S  ప్రభంజనాన్ని తట్టుకునే శక్తి ఎవరికీ లేదు అనేది అర్దమవుతుంది. కాబట్టి రెండు ప్రాంతాల్లో తెలుగు దేశం పని ఇబ్బంది కరంగా మారింది అనుకుంటున్నారు విశ్లేషకులు . కానీ ప్రస్తుతం ఆ పార్టీ అదినేత చంద్ర బాబు గారి లోని దీమా  తో   కూడిన హుషారు చూస్తుంటే ఎక్కడో   చక్రం తిప్పారు అనిపిస్తుంది.

  ఒక పక్క  తెలంగాణా విభజన అంశం అసెంబ్లీలో ఉన్న కీలక సమయంలో ,అసలు దాని గురించి ఏ మాత్రం కంగారు లేనట్లు, తిరుపతి వెళ్లి ఆ ఏడుకొండలు వాడికి మొక్కి , అకడ్నుంచే 2014 ఎన్నికల వాగ్దానా సభలు మొదలు పెట్టారు. ఎన్నడూ  లేని విదంగా చాలా ఓపికగా , హుషారుగా పిట్టకదలు చెప్పుకుంటూ దేశంలోని అవినీతి   ని పారదోలేదాక   విశ్రమించేది లేదని ప్రతిజ్ఞ చేస్తూ ప్రజలందరి చేత ప్రతిజ్ఞలు చేయించటం చూస్తుంటే , ఏ అస్త్రం ప్రయోగిస్తే ప్రత్యర్ది పార్టి నోరు మెదపలేదో ఆ "అవినీతి అస్త్రం " ని బ్రహ్మాస్త్రం గా మార్చిఎన్నికల  యుద్దానికి   సన్నదం అవుతున్నట్లు తెలుస్తుంది.

 అయన గారు మాటల్లో రాష్ట్రం లోని అవినీతి కంటే దేశం లోని అవినీతి మీదే ఎక్కువుగా ప్రస్తావించడం చూస్తుంటే రాబోయే రోజులలో జాతీయ రాజకీయాలలో ఒక ప్రముఖ స్తానం ఎదో ఆయనకు కరారు అయినట్లే అనిపిస్తుంది. బహుశా B.J.P  తో అయన కుదుర్చుకున్న పొత్తులు రీత్యా ఒక ఉన్నత స్తాయి ఆయనకు లబించడం ఖాయం అని తెలుస్తుంది. అందుకే ఆయనలో అంత దీమా  కావచ్చు. ఇదే సందర్బంలో తెలంగాణా రాష్ట్ర విభజన విషయం లో అయన చెప్పే "సమ న్యాయం " కి అర్దం కూడ స్పష్టంగా   తిరుపతి సభలో చెప్పటం జరిగింది. బహూశా అవేవో రోటీన్ డైలాగ్ గా బావించిన రాజకీయ పండితులు దానిని అంత సీరియస్ గా తీసుకోలేదు కాబోలు. కాని అది బవిష్యత్ లో తెలంగాణా విషయాన్ని ప్రబావితం చేసే మాట అని అనిపిస్తుంది.

    సమ న్యాయం అంటె " సీమాంద్రా ప్రజలను ఒప్పించి తెలంగాణా తీసుకోవడం  కానీ , లేక తెలంగాణా ప్రజలను ఒప్పించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం  కాని" అని అర్దం అట. అంటే రెండు ప్రాంతాల వారిని ఒకచోట కూర్చో బెడితే తప్పా ఇది సాద్యం కాదు. ఈ పని కాంగ్రెస్ వారు చెయ్యలేరు. చేస్తే B.J.P వారు చెయ్యాలి. అది కూడా  2014 ఎన్నికల తర్వాతనే.ఈ విషయం లో B.J.P నుండి మోడి గారి ద్వారా చంద్ర బాబు గారికి హామి వచ్చి ఉండాలి . కాబట్టి తెలంగాణా గురించి బేపికర్ . అది ఎన్నికల తర్వాతి మాట. అందుకే  2014 ఎన్నికల ప్రచారం మొదలెట్టి "అనకొండ కద" లతో  ప్రత్యర్ది పార్టిలను దుమ్ము దులపడం ప్రారంబించారు చంద్రగిరి చంద్రబాబు గారు.
 బహూశా అందుకే ఆయనలో అంత హుషార్ ! మరింత జోష్ !

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం