సంక్రాంతి పండుగ ఎప్పుడు చెయ్యాలో "పండితులకు" తెలియదు! కోడి పందాలు ఎలా ఆపాలో పోలీసులకు తెలియదు!

                                                     

ఉన్న ఊరే ! ఉదకమండలం అయిన వేళ !
                                                                                                                       బోగి మంటలు
మా గుడిలో గోదాదేవి కల్యాణం


రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు , అరిసెలు వండుకోవడాలు , ఇవ్వన్ని సాంప్రాదాయక  సంక్రాంతి పండుగలో కనిపించే అంశాలు . తెలుగు గ్రామాలలో ఎ పండుగ గొప్పగా జరుపుకోలేక పోయినా  సంక్రాంతి పండుగ మాత్రం తమకు కలిగినంతలో ఘనంగానే జరుపుకుంటారు ప్రజలు. కారణం అప్పటికే రైతులకు పంటల తాలూకు పలాలు చేతికొచ్చి ప్రతి ఇంట్లో దన దాన్యాలు ఉండడమే . అంతే  కాకుండా చలికాలం చివరి నెల కావడం వలన వాతా వరణం కూడా మనసుకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తూ పండుగ మూడు రోజులు ఆనందంగా గడచి పోయేలా చెస్తుoది .

    నిజంగా సంక్రాంతి శోభ చూడాలంటే పల్లెలకు వెళ్ళాల్సిందే . పొద్దునే పట్టిన పొగమంచు అందాలు పల్లెలను ఉదక మండలాలుగా మారుస్తాయి . బోగి నాడు వేసుకునే "బోగి మంటలు" , దాని చుట్టూ చేరి కుటుంబ సబ్యులు అంతా వెచ్చని చలి కాగుతుoటె, ఆహా ! ఆ  ఆనుబూతే  వేరు . అ తర్వాత ఆడపిల్లలు ఇండ్ల ముందు వేసే సంక్రాంతి ముగ్గులు, అందులో పెట్టె గొబ్బెమ్మలు, పూలు ఇవ్వన్ని ఇంటికి సంక్రాంతి లక్ష్మిని ని ఆహ్వానించి , ప్రతి  ఇల్లు  బోగ బాగ్యాలతొ తుల తూగేలా ఆశీర్వాదం పొందుతుంది .అలాగే సంక్రాంతి పండుగ స్పెషల్ వంటకం అయిన "అరిసెలు" చేయని ఇల్లు తెలుగు నాట ఉండదు . జంక్  పుడ్ కు అలవాటు పడిన తెలుగు వారిని సైతం ఈ అరిసెలు సాంప్రదాయక స్వీట్స్ అంటే ఎలా ఉంటాయో తెలుసుకునేలా చెస్తాయి. ఇండ్లకు కొత్త అల్లుళ్ళు రావడం , ఇంటిల్లిపాది ఎంతో ఆనందంగా ఉండడం ఈ పండగ ప్రత్యెకతలు. మరి అలాంటి సాంప్రదాయక  పండుగను ఎలా మార్చారో చూస్తుంటే బాద కలుగక మానదు.

   అసలు ఈ సంవత్సరం పండుగ 14 వ తారికున జరపాలో , 15 వ తారికున జరపాలో తెలియని అయోమయ పరిస్తితి ప్రజలకు కలిగిందంటే దానికి కారణం తెలుగు పండితులు మద్య ఉన్న ఇగో . మేము చెప్పేది కరెక్టు అంటే , మేము చెప్పేది కరెక్టు అని వాదులదుకుo టూ , చివరకు పంచాంగ పండితులు అంటే పామరులు కూడా ఎవగించుకునే  దుస్తితికి దిగ జారారు .ఒక  పండగ విషయంలోనే ఏకాభిప్రాయానికి రానీ  వారు ప్రజలకు ఏమి మార్గదర్సనమ్ చేస్తారు ?సామాన్య  ప్రజలకు కావలసింది మీ పాండిత్యం కాదు , మీ మద్య సమన్వయం  అని చెప్పే జ్ఞానులు తెలుగు దేశంలో లేకపోవడం నిజంగా విచారించ దగిన విషయం . చివరకు ఎండోమెంట్ అద్వర్యంలో నడచే దేవాలయ అస్తాన పండితుల మద్య కూడా పండగ తేది విషయంలో బెదాభి ప్రాయలు ఉండి  భక్తులను కన్ప్యూజ్ చేస్తున్నారంటే "పండితులు రాసిన పంచాంగాలు కల్లలై పోవును " అని శ్రీ వీర  బ్రహ్మెంద్రులు స్వామీ వారు చెప్పిన కాల్ జ్ఞానం నిజమయిందా అని పిస్తుంది .

     ఇక పొతే ప్రజలు కొంతమంది ఈ పండుగను జూదాలా పండుగ గ మార్చి వేసారు . వీరికి సంక్రాంతి అంటే ఇంట్లో బోగ బాగ్యాలు కలగాలని కోరుకోవడం కాదు , ఇంట్లో సొమ్మును కోడి పందాలకు తగలేసి ఇంటిల్లి పాదిని ఏడిపించడం . ఒక్క కోన సీమ జిల్లాలోనే  వందల కోట్ల రూపాయల కోడి పందాలు జరుగుతున్నాయి అంటే ఎంత వ్యసనంగా ఈ  పందాలు మారాయో అర్ధమవుతుంది . మరి దినిని అరి కట్టడానికి పొలిసు వారు ఏమి చెయ్యలేరా అంటే , M.L.A లు వచ్చి కోడి పందాలకు  రిబ్బన్ లు కట్ చేస్తుంటే వారికి కోడి పందాలు ఎలా ఆపాలో తెలియటం లేదు . అది నేటి పల్లెల దుస్తితి. మొన్నటి పండుగ పందాలు సందర్బంగా దొంగ నోట్ల చలామణి విపరీతంగా జరిగిందని మీడియా కోడై కూసింది . అయిన  నివారణ చర్యలు నిల్ . దాని గురించి మరింత సమాచారం కొరకు ఈ  క్రింది విడియో లను చూడండి .




                      


          పండగ గురించి పండితుల వాదాలు ఈ  క్రింది విడియోలో చూడండి .
                        
                  

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం