అదర్మపత్నుల ఆగడాలకు అడ్డుకట్ట వేసిన ఆంద్ర ప్రదేశ్ హై కోర్టు!

                                                    


ఈ  రోజు ఉదయాన్నే  ఒక మంచి వార్తా మరియు  ఒక దుర్వార్తా వినాల్సి వచ్చింది . ముందుగా దుర్వార్త ఏమిటంటే "ధర్మపత్ని" చిత్రం ద్వారా చలన చిత్ర రంగంలో అడుగుపెట్టి ఎదురులేని నట దిగ్గజంగా సిని ప్రపం చంలో వెలుగొందిన ద్రువతార నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావుగారు అస్తమిమ్చారన్న  విషయం తెలిసి బాద పడని తెలుగు వారు ఉండరు . అయన గారి ఆత్మకు శాంతి కలగాలని అ లక్ష్మి నరసింహున్ని ప్రార్దిస్తున్నాను .
 ఇక పొతే ఆ శుభవార్త  ఏమిటంటే భారతీయ కుటుంబ వ్యవస్తను చిన్నా బిన్నం చేస్తున్న ఇండియన్ పినల్ కోడ్ లోని సెక్షన్ 498 A అమలు విషయంలో కుటుంబ  పటిష్టతకు మేలు చేసే కొన్ని మార్గ దర్సకాలను ఆంద్ర ప్రదేశ్ హై కోర్టు వారు జారిచెయ్యదమె కాక తక్షణమే ఆంద్రప్రదేశ్ పోలిస్ వారు  వాటిని అమలు చెయ్యాలని రాష్ట్ర డి.జి.ఫి ని ఆదేశించడం జరిగింది .

నేను ఇదే బ్లాగులో   నవంబర్ 19 2013 న ఒక టపా "మొగుళ్ళని "విగత" లుగాను, పెళ్ళాల్ని "విదవలు " గా ను చేస్తున్న ఈ చట్టం మన సమాజానికి సరిఅయినదేనా?" అనే టైటిల్ తో ప్రచురించడం జరిగింది . అందులో

        "భారతీయ కుటుంబాలను నాశనం చేసే వాటిలో మొదటిది "వరకట్నం " కాగా , రెండవది "గృహ హింస " చట్టం. వరకట్నం కోసం ఆడపిల్లలను రాచి రంపాన పెట్టే భర్తల కన్నా , అత్తలు ఆడబిడ్డలు పాత్రే ఎక్కువ. అప్యాయతలు, అను రాగాలు అనే వాటికి అర్దం లేకుండా చేసింది వరకట్న వ్యవస్త. అటు ఎక్కువ కట్నం తెచ్చిన వారు కూడా  తాము అత్తింటి వారికి ఊడిగం చేయాల్సిన కర్మ ఏమిటి? అని పెళ్లినా ఆర్నెళ్ళకే ఎదో సమస్య సృష్టించుకుని , చిన్న సమస్యలను కూడా  బూతద్దాలలో  చూపిస్తూ వేరు కాపురం కోసం కీచులాట పెడుతుంటారు. ఇది సహజంగానే ఆ కుటుంబంలో ని సబ్యుల మద్య శాశ్వత వైరాలు కలిగిస్తుంటాయి. అలాగే భార్య భర్తల మద్య గొడవలు వస్తే వాటిని పరిష్కరించడానికి అటు భార్య తరపు వారు కానీ, ఇటు భర్త తరపు వారు కానీ కుటుంభ సంక్షేమం ద్రుష్టిలో ఉంచుకుని కౌన్సిలింగ్ చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతయి. కానీ బార్య తరపున ఎవరైనా రాజకీయ నాయకులూ ఉంటే మాత్రం ఇక ఆ సమస్య పొలిసు కేసులు దాకా వెళ్ళటం , కేవలం భర్త మీద కేసు పెడితే భర్త తొందరగా దారికి రాడు కాబట్టి , ఎప్పుడో విడిపోయి వెళ్లి పోయిన అతని తరపు అన్నదమ్ములతో సహా ఆత్త మామల మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఆ కేసులు ఎలాగు తొందరగా తేలవు కాబట్టి, సమస్య చిన్నదైనా పెద్దదైనా "గృహ హింస" మాత్రం ఒకటే మోతాదులో ఉంటుంది కాబట్టి, అటు పెళ్ళానికి, ఇటు పిల్లలకు దూరమై, తన వలన తన కుటుంభం యావత్తు బాధపడడం తట్టుకోలేక చివరకు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
     ప్రభుత్వాలు ఎంత గొప్ప చట్టాలు చేసాయి  అనేది కాదు , ప్రజలు దానిని ఎంత సక్రమంగా వినియోగొంచుకుంటున్నారు అనే దాని  మీదే  ఆ చట్టం యొక్క కొనసాగింపు ఆదారపడి ఉంటుంది . ప్రజలు స్వీకరించని చట్టాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. కానీ ప్రజలు 95% దుర్వినియోగ పరచడం వలన, వ్యక్తులు  హింసించబడడమే  కాక ఆత్మహత్యలకు గురికాబడుతున్నపుడు , ఆ చట్టాలు మాత్రం ఎట్టి పరిస్తితుల్లోను కోన సాగించడానికి వీలు లేదు. ఏ  నేర చట్టం ఉద్దేశ్యమైన  ప్రజలలో మార్పు తేవడమే తప్పా , మట్టు బెట్టడానికి కాదు. ఒక వేళా నేరస్తుణ్ణి చంపాలన్నా అదీ కూడా  చట్టబద్ద విదానాల ద్వారానే జరగాలి తప్పా , చట్ట వేదింపులు గురి అయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్తితుల్లో కాదు. అలా 95% దుర్వినియోగ మవుతూ భారతీయ భర్తల ఆత్మహత్యలకు కారణ మవుతున్న 498-A  నేరస్మ్రుతి నిబందన పై తక్షణం సమీక్ష జరిపి సవరించాల్సిన అవసరం  ఉంది"     అని చెప్పడం జరిగింది

  ఇది నా ఒక్కడి కోరిక  కాదు. భారతీయ కుటుంబ వ్యవస్తలో బాగమైన తెలుగు ప్రజల సంసారాలు చల్లగా ఉండాలని కోరుకునే కోట్లాది మంది ప్రజల కొరిక. కాని గే లెస్బియన్ .హక్కులు గురించి ఆరాటపడే నాయకులకు గృహ హింస బాదితుల గోడు కాని, కూలిపోతున్న సంసారాలను గురించి కానీ ఆలోచించే తీరిక గాని ఎక్కడుంది ? అందుకే కనీసం తెలుగు ప్రజల కోసం ఆంద్ర ప్రదెస్ ఉన్నత న్యాయ స్తానం అ బాద్యత తీసుకుని 498-A  అమలు విషయంలో కొన్ని మార్గదర్సకాలను  రూపొందించింది.దినికి గాను ప్రతి తెలుగు కుటుంబం జస్టిస్ భి.చంద్ర కుమార్ గారికి రుణ పడి ఉంటుంది. వారు రాష్త్ర డి.జి.పి. కి ఇచ్చిన మార్గదర్శకాలు , దానికి సంబందించిన కేసు వివరాలు గురించి క్రింది లింక్ మీద క్లిక్ చేసి చూడండి  అలాగే ఇదే విషయమై నేను ఇంతకు ముందు ప్రచురించిన టపా కోసం ఈ లింక్ మీద క్లిక్ చేసి చూడండి.http://ssmanavu.blogspot.in/2013/11/blog-post_19.html

  ఏది ఏమైనా ఈ తీర్పు గ్రుహ హింస చట్ట అక్రమ బాదితులకు మాత్రమే ఊరట నిస్తుంది. ఇది ఆవేశంలో, అజ్ణానంతో తప్పులు చేసే వార్కి సరి అయిన కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా బార్యా బర్తలు  తిరిగి సాపీగా సంసారం చేసుకోవడనికి ఉపయోగ పడుతుంది తప్ప, ఆడపిల్లల్ని రాచి రంపాన పెట్టే వారికి మాత్రం కాదు అని గుర్తుంచుకుని మెలిగితే మంచిది.(మార్గదర్సక సూత్రం నంబర్ 5). కాబట్టి  మార్గ దర్సకాలు అదర్మపత్నుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తాయి తప్పా , దర్మపత్నుల హక్కులకు కాదు అని  తెలుగు భర్తలు గ్రహించాలి .        
ఇవీ మార్గదర్శకాలు
1. దర్యాప్తు అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరించి, పూర్తవగానే డీఎస్పీ స్థాయి అధికారి పరిశీలనకు పంపాలి. కేసుతో సంబంధం లేని వ్యక్తులను ఇరికించినట్లు తేలితే ఎస్పీ అనుమతితో తొలగించవచ్చు.
2. వరకట్న వేధింపులపై భార్య నుంచి లేదా వరకట్న కేసులో ఇరికించేందుకు భార్య/భార్య తరఫు బంధువులు ప్రయత్నిస్తున్నారంటూ భర్త నుంచి ఫిర్యాదు వస్తే... ఇద్దరికీ అనుభవజ్ఞులైన కౌన్సెలర్లతో సలహా ఇప్పించాలి. ఆ తర్వాత కౌన్సెలర్ల నివేదికను దర్యాప్తు రికార్డుల్లో చేర్చాలి.
3.జిల్లాన్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌తో ఎస్పీ సంప్రదించి కౌన్సెలర్ల జాబితా తయారు చేయాలి. వారి వివరాలు అన్ని పోలీసు స్టేషన్లలో అందుబాటులో ఉంచాలి.
4. వరకట్న వేధింపులపై ఫిర్యాదు రాగానే నిందితుణ్ని అరెస్టు చేయరాదు. అరెస్టు తప్పనిసరని అధికారి భావిస్తే ఎస్పీ లేదా సమాన హోదాగల అధికారి అనుమతి తీసుకోవాలి. అరెస్టు అవసరం లేదని భావిస్తే దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీటు దాఖలు చేసి సంబంధిత మేజిస్ట్రేట్‌నుంచి తగిన ఉత్తర్వులు పొందాలి. వరకట్న వేధింపులవల్ల అనుమానాస్పద మృతి/ఆత్మహత్య లేదా తీవ్ర గాయాలైన పక్షంలో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేయవచ్చు. అయితే... ఇటువంటి అరెస్టుపై వెంటనే జిల్లా ఎస్పీకి తగిన సమాచారం ఇవ్వాలి.
5. నిందితులను/సాక్షులను అవసరం లేకుండా పోలీసు స్టేషన్‌కు పిలవరాదు. పిలిచిన పని పూర్తయిన వెంటనే వెనక్కి పంపేయాలి. ఫిర్యాదుదారు బంధువులనుగానీ లేదా భర్త బంధువులనుగానీ ఎటువంటి వేధింపులకు గురిచేయరాదు.
6. ఉభయపక్షాలను వారి, వారి అభిప్రాయాలు, ఆలోచనలకు వ్యతిరేకంగా సమస్యను పరిష్కరించుకోవాలని పోలీసు స్టేషన్‌కు పిలిపించి ఒత్తిడి చేశారనే ఆరోపణలు లేకుండా ఉన్నతాధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే... సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోడానికి ఎటువంటి చర్యలు తీసుకోరాదని భావించరాదు.
7. కుటుంబాలను నిలబెట్టేందుకు న్యాయవాదులు సంఘ సంస్కర్తలు మాదిరిగా సరైన పాత్ర పోషించాలి. నిందితుడ్ని కోర్టులో ప్రవేశపెట్టినపుడు మెజిస్ట్రేట్లు సైతం సహేతుకంగా ఆలోచించి న్యాయపరమైన నిర్ణయం తీసుకోవాలి.

- See more at: http://www.andhrajyothy.com/node/56659#sthash.jP1b0Eh1.dpuf

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )