పుట్టగానే అవినీతి పొట్ట చీల్చడానికి ఆం ఆద్మీ కెజ్రివాల్ ఏమన్నా "నరసింహవతారమా !?

                                                         


ఈ  దేశంలో  జ్ఞాన వంతులకు కొదువ లేదు కాని , ఇంగిత జ్ఞానం ఉన్న వారు కూస్తంత తక్కువే ఉన్నారు అనిపిస్తుంది . లేకపోతె మరేమిటి చెప్పండి , పట్టుమని పది రోజులు కాలేదు డిల్లి పీట్టాన్ని అం ఆద్మీ  పార్టి వారు అధిరోహించి , అప్పుడే   ఆ  పార్టి పాలన మిద విమర్శలు మొదలయ్యాయి. బయట ప్రజలు  కంటే విపక్షాలు, స్వంత పార్టి లోని పదవులు దొరకని అసమ్మతి  వాదులు   అప్పుడే వారి రాజకీయ బుద్దిని బయట పెట్టుకోవడం మొదలెట్టారు.    దీనంతటికి ముఖ్య కారణం వాస్తవాలను పక్కన పెట్టి అతిగా ఆంఆద్మీ గురించి  ఎక్కువ గా ఊహించడం, తెల్లారే సరికి ఏదో దేశంలో విప్లవం వచ్చిందని మీడియా అంతా పని గట్టుకుని ఆం ఆద్మీ మీదే పోకస్ చేసి ప్రచారాలు చెయ్యడం, దానితో కేజ్రీ వాల్ ఏదో అతీత శక్తులు కలిన వాడుగా ఒక్క రోజులొనే డిల్లీ ని ప్రక్షాళణ చేస్తాడని బావించడం ఇవ్వన్నీ ఇంగిత జ్ణానం లేని వారి ఆలోచనలు.

  ఇంకొక ప్రక్క ఆం ఆద్మీ పార్టీ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నB.J.P   పార్టీ  ప్రధాన ప్రతి పక్షం గ ఉన్నంత కాలం, ఆం ఆద్మీ వారి పాలన తుమితే ఊడి పోయే ముక్కు లాంటిదే . అసలు ఆం ఆద్మీ పార్టీ అధినాయకుడు కి పాలనా పగ్గాలు చేపట్టడానికి ఎవరి సహాయం తీసుకోవాలి అన్న విషయం లో సరి అయిన నిర్ణయం తీసుకోలెదు అని పిస్తుంది. తమ పార్టీ ప్రాదాన అజెండ అవినీతి నిర్మూలన అయినప్పుడు , పోయి పోయి, దేశం లోని అవినీతికి మూల కారణమయిన కాంగ్రెస్ పార్టీ వారి సహాయం తీసుకోవడం ఏమిటి? విడ్డూరం కాకపోతే!తమకు కాంగ్రెస్ మరియు B.J.P పార్టీలు రెండు శత్రువులే అని ప్రకటించిన పెద్ద మనిషికి, అవినీతి విషయం లో ఎవరు ప్రదాన శత్రువు, ఎవరు ద్వితీయ శత్రువు అని ఆలోచించే ఇంగిత జ్నానం లేక పొయింది . కమ్మ్యునిస్ట్ సిద్దాంతం ప్రకారం బడా బూర్జువాలను ఎదుర్కోవాలంటే , అంత కంటే తక్కువ బూర్జువాలతో కలసి పని చేయాలి. ఈ సూత్రమే కేజ్రీ వాల్ గారి డిల్లీ పాలన విషయం లో అనుసరిస్తే బాగుండేది. అవినీతి విషయం లో  కాంగ్రెస్ కంటే మెరుగయిన B.J.P వారి సహాయంతో పాలనా పగ్గాలు చేపడితే సత్పలితాలు పొంది ఉండే వారు.

   కానీ కేజ్రీ వాల్ గారు కూడా దిక్కు మాలిన లౌకిక వాదం, మత వాదం అనే మాయ వాదాలలో పడి తన పార్టీ బవిష్యత్ ని తానే చేజేతులారా నాశనం చేసుకున్నాడు అనిపిస్తుంది. ఒక పార్టీ లేక ఒక వ్యక్తి ఏక కాలం లో విబిన్న అంశాల మీద పోరు సాగించాలనుకోవడం మూర్కత్వం అవుతుంది. అవినీతి , మతవాదం అనేవి వేర్వేరు అంశాలు. ఈ దేశాన్ని కి ప్రదాన శత్రువు అవినీతి. ఈ అవినీతిని వ్యతిరేకించడం లో నగర ప్రజలలో ఉన్న చైత్యన్యం , గ్రామీణ ప్రజలలో లేదు. అంకు కారణం స్పష్టం. అవినీతి వలన దేశానికి ప్రమాదం ఏమిటన్నది చదువుకున్న వారికి తెలిసినంతగా, అది లేని వారికి తెలియక పోవడమే. కాబట్టి దేశం లో అత్యదిక వోటర్లు గా ఉన్న గ్రామీణ ప్రజలను ఆం ఆద్మీ లాంటీ పార్తీలు ఆకర్షించలేవు. దానికి ఒక చరిష్మా కలిగిన , విజ్ణాని మరియు నిజాయితీ పరుడైన వ్యక్తి నాయకత్వం లో పనిచేసే  పార్టీ కావాలి. అలాంటి అర్హత ప్రస్తుత తరుణంలో  నరేంద్ర మోడి గారికి ఉంది. మరి అలాంటి  వారితో కలవకుండా , తా అంటే తూ తెలియని రాహుల్ లేక సోనియా  గాందీ గారీ  నాయకత్వం లోని కాంగ్రెస్ పార్టీ తో జత కట్టడం ఏమిటి? ఇక్కడే ఆం ఆద్మీ తప్పులో కాలేసింది.

   ఏది ఏమైనా, ప్రజా పతినిదులని ఎన్నుకునేది 5 సంవత్సరాల కోసం. వారిచ్చిన హామీలు నెరవేర్చడానికి కొంత సమయం పడుతుంది. కేజ్రీ వాల్ సామాన్య మానవుడు మాత్రమే.అతను ఎంత ముఖ్య మంత్రి అయినా , పదవిలోకి వచ్చిన తెల్లారే అవినీతిని చీపురు పట్టి ఒక్క సారిగా  ఊడ్చలేడు.అవినీతి అనేది దేశ సమస్య. దానిని ఊడ్చడం వల్ల నిర్మూలించలేం. చీల్చి పారేశే విదానాలు వల్లనే అది సాద్యం. దానికి లౌకిక, మత అనే తేడాలు లేకుండా అవినీతిని వ్యతిరేకించే వారంతా ఏకం కావాలి. అందుకు అనువైన జాతీయ విదానం ఒకటీ రాజకీయ పార్టీలు రూపొందించుకునీ, తదనుసారం నడిస్తే రానున్న పది యేండ్లలో అవినీతిని నిర్మూలించ వచ్చు అని నా ద్రుడాభిప్రాయం.    

      కేజ్రీ వాల్  ఎంత లౌకిక వాది అయినా దేవుడి శక్తి పట్ల అపారమయిన నమ్మక్కం కలిగిన వాడని, ముఖ్య మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణోత్సవం సందర్బంగా ఆయన చేసిన ప్రసంగం తెలియ చేస్తుంది.కాబట్టి ఆ భగవంతుణ్ణి నమ్మే మోడీ లాంటి వారితో చేతులు కలిపి ముందు అవినీతి బూతాన్ని ఈ దేశం నుండి తరమి కొట్టడానికి ప్రయత్నిస్తే మంచిది. అవినీతిన నిర్మూలించడం రాహుల్ గాందీ గారి వల్ల కాదు. కాబట్టి అతనికి ప్రజలలో ఎంత అభిమానం ఉన్నా నిరుపయోగమే.అలాగే కప్పల తక్కెడ లాంటి తృతీయ ప్రత్యమ్నాయం కూడా పనికి రాని ఆలోచనే . దిని వలన అవినీతి నిర్మూలన జరగక పోగా మరింత ఎక్కువ అయ్యే ప్రమాద ముంది . కాబట్టి కేజ్రీ వాల్ తన విదాన్నాన్ని పున సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  ప్రజలు కూడా, అవినీతి నిర్మూలన విషయం లో , తాము ఎన్నుకున్న  నాయకుల శక్తి సామార్ద్యాలు పట్ల అతిగా అంచనాలు వేసి తర్వాత నిరాశ చెండడం సరి కాదు. పుట్టగానే అవినీతి పొట్ట చీల్చడానికి ఆం ఆద్మీ కెజ్రివాల్  ఏమన్నా "నరసింహవతారమా  !?   చెప్పండి !                                                                          

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన