నిలువెల్లా దోస్తున్నా, ఏమనలేని జడత్వం మనది!
ఏందుకో, ఏమో గాని మన పెద్దలకు ఉన్న రాజకీయ చైతన్యం మనలో లేదనిపిస్తుంది. ఇదివరలో ఏ గ్రామంలోనైనా రాజకీయ నాయకులు కాని, అధికారులు కాని అవినీతికి పాల్పడాలంటే అటు ప్రతిపక్షాలకు ఇటు ప్రజలకు బయపడే వారు. కాని ఈ రోజుల్లో రాజకీయంలో ఓనమాలు నేర్చిన ప్రతివాడు ప్రజాదనాన్ని కొల్లగొట్టడానికి, ఎదుటి పార్టీల వారితో సర్థు బాటు చేసుకుంటున్నాడు. కాబట్టి సామాన్య ప్రజలను చైతన్య పరచి పోరాటాలు చేసే వారు తక్కువైయారు. 1950 రోజుల్లో అవినీతికి పాల్పడి జైల్ కెళ్లడాన్ని సంబదిత కుటుంబీకులు సైతం ఎంతో అవమానంగా బావించే వారట. కాని విచిత్రంగా అలా అవినీతిని నేరంగా బావించడమే అవమాన కరంగా బావించారో ఏమో మన నాయకులు అవినీతి అనే దానిని "నీతిబద్దం" చేస...