నిలువెల్లా దోస్తున్నా, ఏమనలేని జడత్వం మనది!

                                                                 



                                  ఏందుకో, ఏమో గాని మన పెద్దలకు ఉన్న రాజకీయ  చైతన్యం మనలో లేదనిపిస్తుంది. ఇదివరలో ఏ గ్రామంలోనైనా రాజకీయ నాయకులు కాని, అధికారులు కాని అవినీతికి పాల్పడాలంటే అటు ప్రతిపక్షాలకు ఇటు ప్రజలకు బయపడే వారు. కాని ఈ రోజుల్లో రాజకీయంలో ఓనమాలు నేర్చిన ప్రతివాడు ప్రజాదనాన్ని కొల్లగొట్టడానికి, ఎదుటి పార్టీల వారితో సర్థు బాటు చేసుకుంటున్నాడు. కాబట్టి సామాన్య ప్రజలను చైతన్య పరచి పోరాటాలు చేసే వారు తక్కువైయారు.

   1950 రోజుల్లో అవినీతికి పాల్పడి జైల్ కెళ్లడాన్ని సంబదిత  కుటుంబీకులు సైతం ఎంతో అవమానంగా బావించే వారట. కాని విచిత్రంగా అలా అవినీతిని  నేరంగా బావించడమే అవమాన కరంగా బావించారో ఏమో మన నాయకులు అవినీతి అనే దానిని "నీతిబద్దం" చేసేశారు. ఇక చట్టబద్దం చెయ్యడమే మిగిలి ఉంది.అయిన పాపం ప్రజలు మాత్రం ఏమి చేస్తారు? నూటికి ఐదుగురో, పడిమందో అవినీతి పరులు ఉంటే, వారిని పట్టుకుని, దారిలో పెట్టెవారు. ఎక్కువ శాతం మంది దానికే దాసోహం అన్నాక ఇక దాని గురించి మాట్లాడడం వేస్టు అనుకున్నట్లుంది,ఏమి జరిగినా మన కెందుకులే అన్నట్లు ఒక రకమైన  ’జడత్వం"కు గురిఅయ్యారు.

        ఈ జడత్వ బూతం ప్రజలను  చివరకు ఎలా మార్చిందంటే, "వేశ్యలను  ని చూసి సంసారులు సిగ్గుపడి పొయేటట్ట్లు" "దొంగలు నీతులు చెపుతుంటే, బాదితులు నోరెళ్ళ పెట్టి వినేటట్లు".చివరకు ప్రజా నాయకులు కావాలంటే, ప్రజల్ని దోచడం ఒక్కటే మార్గం అనే ద్రుడ అభిప్ర్రాయనికి నాయకులు వచ్చేశారు. "కోటి రూపాయలు ఖర్చు పెట్టందే’ కార్పోరేటర్ కాలేడు,"వేయి కోట్లు లేనిదే పార్టీని నడపలేము" అన్న సత్యాన్ని వంట పట్టించుకుని, పదవుల్లో ఉండగానే అందిన కాడికి దోచుకుంటుంటే, ప్రజలు కూడ "ఎంత దొస్తే అంత మొనగాడు" అని కితాబులిస్తూ ఆనందిస్తున్నారు.

  ఖర్మ కాలి ఎవరైనా గత్యంతరం లేని పరిస్తితిలో జైల్ కి వెళ్లాల్సి వస్తే అందుకు ఎవరూ కించిత్ కూడా బాద, అవమానం పొందిన దాఖాలాలు లేవు. స్వాతంత్ర సమర యోదులు లాగా జైల్కి వెల్లేటపుడు వందల మంది జై,జైలు పలుకుతుంటే అభివాదం చేస్తూ వెళుతున్నారు. అలాగే వారు విడుదల అయినపుడు ఇదే తంతు జరుగుతుంటే అది చూసిన కొందరు, "అవినీతి కి పాల్పడని బ్రతుకు ఒక బ్రతుకేనా" అని నిట్టూర్పులు వదులుతున్నారు.

   "దోచే దమ్మున్నోడు ఇంటిలో ఉన్నా ఒకటే, జైల్ లో ఉన్నా ఒకటే",అన్నట్లు, ఏదో కోర్టుల ఆర్డర్లను గౌరవించాలి కాబట్టి జైల్ లో ఉంటున్నారు కాని, వారికి బయట కంటే లోపలే సకల మర్యాదలు జరుగుతున్నాయట.కాకపోతే కొంచం ఖర్చవ్వుద్ది, అంతే.ఇక బయట ఉన్న జనం కూడా తమ కున్న జడత్వం వ్యాదితో,ఎవర్ని ఏ మనలేక ఏవడు నీతి పరుడు? ఎవడు అవి నీతి పరుడు అని తత్వాలు పాడేస్తూ, గాడిదల్ని, గుర్రాల్ని ఒకే గాటన కట్టే సరికి, అంతో ఇంతో నీతి ఉన్న నాయకులు సహితం. ఆలోచనలో పడిపోతున్నారు.

   అప్పుడప్పుడు పైనున్న దేవుడు మనం మంచి దారికి రావాలని అవకాశం ఇస్తుంటాడు. దానిని గుర్తించి మసిలితే అంతా మంచే జరుగుద్ది. లేదా మన జడత్వానికి మనమే బలి అయ్యే రోజు అతి దగ్గరలో ఉందనిపిస్తుంది.              

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!