అంత పబ్లిక్ లో కూడా "ఆమెను" ముద్దు పెట్టుకునే దాక ముసలోడికి ఆగి చావ లేదట !

                                                                


 మగబుద్ది ! దిని గురించి గతంలో ఇదే బ్లాగులో నాలుగు, ఐదు టపాలలో ప్రస్తావించడం జరిగింది . అందులో ఒకటి అయిన మగబుద్దిని కంట్రోల్ చెయ్యాలంటే మగువలను దూరంగా ఉంచడం లాంటి సాంప్రదాయక విదానమే బెస్టా?" అనే దానిలో
" "అసలు స్త్రీల పట్ల చాలా మంది మగాళ్ళు ఎందుకు  చంచల బుద్దితో  ప్రవరిస్తారు ? దీనికి పైకి చెప్పే కారణం ఒకటే . సంస్కార హీనులైన వారే అలా ప్రవర్తిస్తారు అని. కానీ ఎన్నో ఏండ్లుగా సంస్కారవంతులుగా చలామణీ అయిన వారు సహితం, స్త్రీల ఔన్నత్యాలు గురించి, పురుషుల కుసంస్కారాలు గురించి ఎడతెగని లెక్చరర్లు దంచిన వారు సహితం ఏదో ఒకనాడు హట్టాతుగా ఒక స్త్రీ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు అన్న ఆరోపణలకు గురై అందరిని విస్మయ పరుస్తాడు. స్త్రీ పురుషుల మద్య ఆరోగ్యకరమైన సంబందాలు కొనసాగింపు విషయం లో మన పూర్వీకులకు ఉన్న అవగాహనలో అరవైయ వంతు కూడా  అడునికులకు లేదు అనిపిస్తుంది. కడుపున పుట్టిన కూతురైనా సరే ,  తండ్రి తో ఒకే మంచం మీడ పడుకోవటానికి అనుమతించరు పెద్దలు. ఎందుకని? ఆ తండ్రి మీద అనుమానం కాదు,అతనిలో ఉన్న "మగ బుద్ది " ని కంట్రోల్ లో పెట్టి కుటుంభ బందాలు ఆరోగ్యకరంగా సాగేందుకు ఏర్పరచుకున్న పద్దతి. అంతే !" అని చెప్పటం జరిగింది. నా అభిప్రాయాన్ని బలపరచేలేలా జరిగిన ఉదంతాలలో ముక్యమైనది తెహెల్కా డాట్ కామ్ అధిపతి "తరుణ్ తేజ్ పాల్ " ఉదంతం . అయన చేసిన పనికి ఇప్పటి వరకు బెయిల్ దొరకక జైల్లోనే మగ్గుతున్నాడు . మరి ఆయన పరిస్తితి చూసి అయినా మన దేశం లోని కొంత మంది మగాళ్ళ లోని "మగ బుద్ది"కి  బుద్ది రావడం లేదంటే , దానికున్న పవర్ అలాంటిది . ముసలోల్లను కూడా ఆ మగబుద్ది ఎలా సంస్కార హినునిగా చేస్తుందో ఈ ఉదంతం తెలియ చేస్తుంది .

      ఆమె గారు ఒక సినిమా యాక్ట్రెస్ . పేరు నగ్మా . ఆవిడ లోని నట నయాగారాలకు చాలా మంది పురుషుల  గుండెలు జారి పోయి ఉంటాయి . అలాంటి గుండెలు జార్చిన బంటుకు, ది గ్రేట్ కాంగ్రెస్ పార్టి అప్ ఇండియా ,U.P లోని మీరట్ నియోజక వర్గానికి M.L.A టికెట్ ఇచ్చి సత్కరించింది . అసలే సినిమా నటి నగ్మా! అ పై పబ్లిక్ గా ఎలెక్షన్ నామినేషన్ కి  బయలు దేరింది .నామినేషన్  ముగించుని తిరిగి  జీపు వద్దకు బయలు దేరింది . చుట్టూ చూస్తున్న అభిమానులు కం ఓటర్లలోని ని" మగ బుద్ది " కంట్రోల్ చెయ్యడానికి ఆమె చుట్టూ పోలిస్ రక్షణ ఇంక్లూడింగ్ మహిళా పోలిస్ రక్షణ ఉంది . అలాగే ఆమె తండ్రి వయసున్న M.L.A గజ రాజ్ శర్మ అనే అయన అదే గుంపులో ఆమె తో పాటు నడుస్తున్నాడు . ఆమె తీరా జీపు ఎక్కే సమయానికి , ముసలోడులో ఉన్న "మగ బుద్ది " యమ తొందర పెట్టినట్లుంది , ఆగలేక  , నగ్మాతో మాట్లాడుతూ హట్టా తుగా ఆమె చెక్కిలి మిద పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్నాడు . దీనితో స్టన్ అయిన M.L.A అబ్యర్ది కం నటి , అయన చేతిని త్రోసివేసి వడి వడిగా జిపులోకి వెళ్లి కూర్చుంటే , డ్రైవర్ జీపును ముందుకు పోనిచ్చాడు . అది కద !

                గత కొన్ని వందల ఏండ్లుగా మగ బుద్దిని కంట్రోల్ చెయ్యడానికి సమాజంలో అనేక కట్టుబాట్లు ఏర్పరచడం , ప్రజలు వాటిని పాటిస్తూ, తమలోని మనో వికారాలను అదుపులో పెట్టుకోవడం జరుగుతుంది . ఇలా స్త్రీల పట్ల మిస్ బెహేవ్ చేసే మగ వెదవల కోసం వచ్చిన లేటెస్ట్ చట్ట సంస్కరణలే "నిర్భయ " సంస్కరణలు . మరి అటువంటి నిర్భయ చట్ట ప్రయోగానికి సదరు మద గజరాజ్ అతితుడా  ?  కాకుంటే, స్తానిక స్త్రీల సంగాలు కేవలం M.L.A అపాలజిని మాత్రమే ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి ?బలవంతంగా ముద్దు పెట్టుకోవడం సెక్సువల్ నేచర్ కాదా ? కేంద్రంలో కాంగ్రెస్ ప్రబుత్వం ఉంది కాబట్టి , పైగా అతను ముద్దు పెట్టుకుంది తమ పార్టి అబ్యార్డినే కాబట్టి , అంతా "తూచ్ .. " యేనా !? మా పార్టి లేడిస్ ని మేం ముద్దు పెట్టుకుంటే మీకేంటి బాద , అంటారా ! ఆ ముక్కే చట్టం లో చేరిస్తే చాలా మంది మగాళ్ళు కాంగ్రెస్ లో చేరతారు . ఇలాంటి సిగ్గు లేని పనులు చేసే వారిని కఠినంగా శిక్షిస్తే తప్పా , సమాజం అదుపులో ఉండదు .
 గజరాజ్ గారి మగబుద్దిని ఈ  క్రింది విడియోలో చూడండి .
                                                      https://www.youtube.com/watch?v=N56ioQjXD-w

   మగబుద్ది గురించి మరో పోస్ట్

"మగబుద్ది" గురించి 'మనవు' చెప్పిన విషయాన్ని నిజమని రుజువు చేసిన "తెహెల్కా " చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ అత్యాచార ఉదంతం" కోసం లింక్ ని క్లిక్ చెయ్యండి . http://ssmanavu.blogspot.in/2013/11/blog-post_21.html


                                        (24/3/2014 Post Republished). 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!