విమానం లో "మానం " పోగొట్టుకున్న పెద్ద బిసినెస్ మాన్ !
అయన గారు ఒక పెద్ద బిసినెస్స్ మాగ్నెట్ . ఒరిస్సా రాష్ట్రం లోని భువనేశ్వర్ కు చెందిన వ్యక్తీ . వయసులో పెద్దవాడు .కాని ఆయనలో ఉన్న మగబుద్ది కి సంబందించిన మానసిక రోగం అతనిని కొంచపు వాడిని చేసింది . అంత మందిలో అయన చేసిన పని ఆయన్ని తల వంచుకునేలా చేయటమే కాక, బాదితురాలు అని చెప్పబడుతున్న ఆమె చేసిన ఒక తెలివి గల పని వలన ప్రపంచం ద్రుష్టిలో దోషిగా మారి పోయాడు .ఆయన చెప్పిన సారీ ఆమెను కరిగించ లేక పోయింది . తండ్రి వయసున్న అతనిది ఒక మానసిక రోగమని గుర్తించ లేక పోయింది .పబ్లిక్ గా ప్లైట్ లోనే అతనిని ఉతికి ఆరేసిన ఆమె, తన సెల్ తో అయన తల వంచుకున్న విదానాన్ని ,అయన చెప్పిన సారి ని ,చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టి లక్షల లైక్ లు సాదించింది . ప్రపంచ వ్యాప్తంగా అయన స్నేహితులు ,బందువులు ద్రుష్టిలో అయన మానం (పరువు ) కోల్పోయేలా చెయ్యడం లో కృత కృత్యు రాలు అయింది . బ్రేవ్ వుమెన్ అని కిర్తీంచ బడింది . వివరాలు లోకి వెళితే .......
ఆమెకు ముప్పై యేండ్లు ఉంటాయి .ఆయనది ఆమె తండ్రి వయస్సు . సింగపూర్ నుండి భువనేశ్వర్ కు వస్తున్న ఇండిగో విమానంలో ఆమె వెనుక సీటులో కూర్చున్నాడు అతను . సీట్ల మద్య ఉండే ఖాళి ప్రదేశంలో తన వేళ్ళను చొప్పించి ఆమెను తాకడం మొదలెట్టాడు అట . అలా పలు మార్లు చేసినా ఆమె మొదట్లో ఏమి అనలేదు .చివరకు విమానం లాండ్ అయ్యేముందు సివంగిలా అతని మీద విరుచుకు పడే సరికి ,ముసలి మానవుడు మాన్ప్రడి పోయాడు . ఆమె తిడుతున్నంత సేపు తల వంచుకుని ఉండటమే కాక ,చివరకు క్షమించమని అడిగాడు . అయినా ఆమె ఊరుకోలెదు . ఇలాంటి మగ వెదవలకు బుద్ది చెప్పాలని గట్టిగా తీర్మానించుకుంది . అతని కన్పెషణ్ ని తన సెల్ లో చిత్రి కరించి సోషల్ మీడియాలో పెట్టి శేభాస్ అనిపించుకుంది. అలా సోషల్ మీడియాలో తన ప్రవర్తన ప్రత్య్క్షమయాక కాని అతను చేసిన తప్పేమిటో ఆయనకు తెలిసి రాలేదు .తను కావాలని ఆమెను తాకలేదు అని ,పొరపాటున జరగడం వలన సారి చెప్పాను అని ,కాని సోషల్ మీడియా లో లైక్ ల కోసం ఆమె చేసిన పనికి ఆమె మీద పరువు నష్టం దావా వేస్తాను అని అనడం మొదలెట్టాడు .నక్క పోయాక ఏదో చేసినట్లుంది అయన దోరణి . అదీ విషయం .
కొంత మంది మగవాళ్ళు , ప్రక్క సీట్లో రంభ వంటి తన భార్యా కూర్చొని ఉన్నా ,ఆమె సానిహిత్యం లోని అనందం అనుభవించడానికి ఆసక్తి చూపలేరు కాని ఎదుటి సిట్లోని లంబోదరి ని అయినా గోకి ఆనందించాలి అనుకుంటుటారు .. అందు కోసం తమ వయసు ,హోదా కూడా మరచి ప్రవర్తిస్తుంటారు . ఇది ఒక మానసిక రోగం అని ఆధునిక వైద్య శాస్త్రం చెపుతుంది .చట్టం ద్రుష్టిలో ఇది అత్యంత హేయ మైన నేరం . స్త్రీలకు రక్షణ లేకుండా పోయిన నేటి పరిస్తుతుల్లో దానిని నేరంగా పరిగణించడమే కరెక్టు . కనీసం ఆ భయం అయినా మగవారి మానసిక రోగం ని కంట్రోల్ చేసుకునే లా చెస్తుంది . కాబట్టి అటువంటి రోగ గ్రస్తులైన ఓ మానసిక రోగులారా ,మీకున్న రోగం మిమ్మలను ఎంత అదో పాతాళానికి నెట్టి వేస్తుందో ఈ క్రింది విడియో చూసి తెలుసుకోండి . అలాంటి రోగం ఉన్న వారు తక్షణమే సైకియాట్రిస్ట్ ని సంప్రదించడం మీకు ,మీ కుటుంభ పరువు ప్రతిష్టలకు శ్రేయో దాయకం .
ఇలాంటి సంఘటన మీదే నేను ఇంతకు మునుపు పెట్టిన అమెరికా వెళ్ళినా,ఆడవాళ్ళను తడమటం మానలేదట! పోస్ట్ ని చదివితే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు
ఇక వీడియో చూడండి .
(11/3/2016 Post Republished).
Comments
Post a Comment