ప్రపంచంలో లో"రేప్ "లు చెయ్యడం టాప్ అయిన ఆ దేశం లో పురుషులు కూడా అత్యాచార బాదితులేనట !!!

                                                                         
 

ఈ మద్య ఒక మిత్రుడి పోస్ట్ కు స్పందిస్తూ మరొక మిత్రురాలు స్పందించిన తీరు చూసాక, మన దేశం లోని ప్రస్తుత పరిస్తితులు గురించి స్వదేశి మీడియా ,విదేశి మీడియా తమ రేటింగ్ ల కోసం చేస్తున్న పబ్లిసిటి వలన ,మన దేశపు స్త్రీలలో ఎంత అభద్రతా బావం నెలకొందో తెలుస్తుంది .ఆ అభిప్రాయం ఆ మిత్రురాలి అభిప్రాయం మాత్రమె అయితే మనం అంతగా బాదపడవలసిన అవసరం లేదు . సగటు స్త్రీలతో పాటు ,విద్యాధికులు అయిన స్త్రీలు కూడా రేటింగ్ ల కోసం  మీడియా చేస్తున్న హంగామా కి బయపడి పోయి ,ప్రంపంచంలో అందరి కంటే మన దేశంలోనే మ్రుగాళ్ళు ఎక్కువని ,ఈ దేశంలోనే స్త్రీలు ఎక్కువుగా అత్యాచారాలకు గురి అవుతున్నారని అపోహ పడుతున్నారు . పై స్పందన చూసాక నాకూ అదే డౌట్ వచ్చింది .నిజంగా మన దేశంలోనే అత్యాచారాలు ఎక్కువుగా జరుగుతున్నాయా , అని ఆరా తీస్తే మన దేశం కంటే ఘనమైన దేశాలు ఉన్నాయని ,అక్కడ స్త్రీలతో పాటు పురుషులను కూడా రేప్ చేస్తారని తెలిసాక ,ఇది ఒక దేశం యొక్క ప్రత్యేక  సమస్య కాదని ,అంతర్జాతీయ సమస్య అని , ఆ సమస్యలో మన కంటే పెద్దన్నలు ముందు ఉన్నారని తెలిసింది .ఆ సమాచారం ఏమిటొ , "రేప్"లలో టాప్ దేశాల కదా కమామీషు ఏమిటొ టూకీగా తెలుసుకుందాం .

 1). అమెరికా

ప్రపంచంలో రేప్ లలో టాప్ పొజిషన్ లో ఉన్న దేశం అమెరికా సంయుక్త రాష్ట్రాలు . రక్షణ రంగం లోనే కాదు అత్యాచారాలు చేయడంలో ఈ దేశానికి సాటి లేదట !ఈ దేశంలో 99% రేపిస్ట్ లు మగవారు కాగా , 1% రేపిస్ట్లు స్త్రీలు కావడం విశేషం .బాదితుల్లో 91% స్త్రీలు కాగా ,9% పురుషులు అట . స్త్రీలలో ప్రతి 6 గురిలో ఒకరు ,పురుషులలో ప్రతి 33 మందిలో ఒకరు అత్యాచార బాదితులని, అక్కడి అధికార లెక్కలు చెపుతున్నాయి . కాకపోతే అక్కడ పోలిస్ రక్షణ ఎక్కువ అనుకుంటా ,అవుట్ డోర్ రేప్ లు అరుదు గాను ఇండోర్ రేప్ లు ఎక్కువగాను జరుగుతున్నాయి అట 

2)దక్షిణ ఆప్రికా 

                                                                       
అమెరికా సంయుక్త రాష్ట్రాలు తర్వాతి స్తానం దక్షిణాప్రికాది .ఇక్కడ చిన్న పిల్లలను ,శిశువులను రేప్ చెయ్యడం ప్రపంచంలో అన్ని దేశాలు కంటె ఎక్కువట . 2012 లో ఈ దేశం లో నమోదైన రేప్ కేసులు 65,000. దానికి అక్కడి చట్టాలు విదించే శిక్ష మొత్తంగా రేండేళ్ళే అంటే సబ్య ప్రపంచం ముక్కున వేలేసుకోక తప్పదు . అక్కడి స్త్రీలలో మూడింట ఒక వంతు ఏదో రకంగా ,ఎప్పుడొ ఒకప్పుడు రేప్ కి గురి అయిన వారెనట . అక్కడ ఉన్న పురుషులలో 25% మందిని ఆరా తీస్తే అందులో సగం మంది ,తాము తమ జీవిత కాలమ్లో ఒకరి కంటే ఎక్కువ మంది స్త్రీలను రేప్ చేసిన వారమేనని ఒప్పుకున్నారట .

3) స్వీడన్

                                                                             
యూరప్ లో మొదటి స్థానంలోను ,ప్రపంచంలో 3 స్తానం లోను నిలుస్తుంది స్వీడన్ దేశం .ఇక్కడ నివసించే ప్రతి నలుగురు స్త్రీలలో ఒకరు అత్యాచార బాదితులెనట . 2009 సంవత్సరపు లెక్కల ప్రకారం ,గత 10 సంవత్సరాలలో ఎన్నాడు లేనంతగా అంటే సుమారు 58% అభివృద్ధి రేటును,రేప్ ల విషయంలో చూసిందట స్వీడన్.అందుకే యూరప్ ఖండం  లో నంబర్ 1 స్తానం సంపాదిందించింది ఈ సబ్య దేశం .

4). ఇండియా

                                                                       
ఇండియా ఒకప్పుడు రేప్ ల విషయంలో వెనుకబడినప్పటికి ,ఇప్పుడు అ రంగంలో పురోగమిస్తుంది అట . అయితే ఈ దేశంలో జరిగే రేప్ లలో ఎక్కువ శాతం తెలిసిన వారి వలననే జరుగుతున్నాయి అని రిపోర్ట్ లు. దీనికి ఆదారాలు తక్కువా, అంచనాలు ఎక్కువుగా ఉన్నాయి . 2012 లో 100 కోట్లు పై బడిన జనాభా ఉన్న దేశంలో 24,923 రేప్ కేసులు నమోదు అయితే ,దీనిని నాలుగవ స్థానం లో చేర్చడం అనేది,2012 వరకు  నమోదు అయిన కేసుల ఆదారంగా ఇవ్వబడిన స్తానం అది. . ఆప్ట్రాల్ చిన్న దీవుల సమూహం  అయిన  యునైటెడ్ కింగ్ డం  లో 85,000 మంది రేప్ చేయబడితే ,దానికి 5 నంబర్ కేటాయించి ,ఇండియాకి 4 నంబర్ కేటాయించిన  సర్వ్ లెక్కలు ను, లోప భూయిష్టం లెఖ్ఖలుగానె  బావించాలి .  అందుకే లేటెస్ట్ విదానాలు లో అంటె  ప్రతి లక్ష మంది జనాభాకు నమోదు అయిన రేప్ కేసులు ఆదారంగా ఇవ్వబడిన పొజిషన్ లలో మొదటి 10 ర్యాంకులలో ఇండియా లేదు.

5). యునైటెడ్ కింగ్ డం

                                                                                 

పై న చెప్పినట్లు ప్రపంచంలో 5 స్తానం కేటాయించారు దీనికి . 2013 లెక్కల ప్రకారం, హై కల్చర్ ఉన్న వారిగా విర్రవీగే ఈ తెల్ల దొరల సమాజంలో ప్రతి ఏడూ  85,000 రేప్ కేసులు కు తక్కువ కాకుండా నమోదు అవుతున్నాయి అంటే    అక్కడ స్త్రీల పరిస్తితి ఎంత దారుణమొ అర్ధం చేసుకోవచ్చు . ఇండియా జనాభా తో పోల్చుకుంటే అక్కడి అత్యాచార కేసుల పర్సంటేజ్ తలచుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది .

6)జర్మనీ

                                                                       
జర్మనీలో ఇప్పటివరకు మొత్తం జరిగిన అత్యాచారాల సంఖ్య 65 లక్షల పై మాటే అయితే అందులో రేప్ కారణంగా చని పోయిన స్త్రీలు ,పిల్లలు సంఖ్య 2,40,000 మంది అట .దీని తో ఇది ప్రపంచంలో 6 వ స్తానం సంపాదించింది .

7)ప్రాన్స్

                                                                             
ఈ నాగరిక దేశంలో 1980 వరకు 'రేప్ 'అనేది నేరమే కాదట.లైంగిక వేదింపులు నేరంగా పరిగణించింది 2002 తర్వాతే .ఇక్కడ ఏటా 75,000 రేప్ లు జరుగుతుంటే అందులో 10% మాత్రమె కేసులుగా నమోదు అవుతున్నాయి .  అలా నమోదైన మొత్తం కేసులు సంఖ్య 2012 వరకు 37,71,850 కాబట్టి దీనికి 7వ స్థానం ఇచ్చారు . ఈ లెక్కన జనాభా దామాషా  వంతున  చూస్తే ,ఇండియా ఆప్ట్రాల్ దీని ముందు .

8)కెనడా 

                                                             
                 

          2012 వరకు  ఈ దేశంలో నమోదైన మొత్తం రేప్ కేసులు 25 లక్షలు పైనే .అందుకే ఇది 8 వ స్థానం పొందింది . ఇవి కూడా వాస్తవ కేసులలో 6% మాత్రమె  అని ఒక అంచనా . ఇక్కడ ప్రతి 17 మందిలో  ఒకరు అత్యాచార బాదితులే .  వారిలో 62% శారీరకంగా , 9% కొట్టబడి హింసకు గురి అయిన వారే .

9). శ్రీ లంక

                                                                   


                                                        శ్రీ లంక లో అక్కడి సైన్యాలు తమిళ గ్రూపుల మీద జరిపిన అమానుష కాండ ,అక్కడి శాంతి బద్రతల వైపల్యం వలన  ఆదేశంలోని స్త్రీలు ,పిల్లలు లైంగిక దాడులకు విపరీతంగా గురి ఆవుట వలన ఆదేశం 9 వస్తానం పొందింది అని చెప్పవచ్చు .

10) ఇదియోపియా

                                                                           

                                                       
                                                                   ఇక టాప్ టెన్ లో 2012 వరకు 10 వ స్తానం పొందిన దేశం ఇదియోపియా.  ఈ దేశంలో అమలులో ఉన్న రాక్షస వివాహ పద్దతి, ఇక్కడ రేప్ లు జరగటానికి ఎక్కువ అవకాశం  ఇస్తుంది .తాను మనసు పడిన అమ్మాయిని బలవంతంగా ఎత్తుకు పోవడం ,ఆమెను రేప్ చేసి ఆమెకు గర్భం వచ్చే దాక దాచి ఉంచడం , ఆ పై వివాహ మాడడమ్ లాంటి అనాగరిక వివ్వాహ పద్దతి ఉన్న ఈ దేశంలో ప్రతి పెండ్లి రేప్ తోనే మొదలవుతుంది . అలా ఈ దేశం ప్రపంచంలో 10 వ స్థానం సంపాదించింది .

పైన చెప్పిన లెక్కలు అన్నీ 2012 వరకు జరిగిన వాటిని అంచనావేసి చెప్పినవి .అయితే ,దేశాల స్తానాలు మొత్తం నమోదైన కేసుల ఆదారంగా నిర్ణయించబడిన స్తానాలు.  జనాభా ప్రాతిపదిక దామాషా గా  కాకుండా,మొత్తం నమోదైన కేసుల ఆదారంగా దేశాల  పొజిషన్ లు నిర్ణయించడమ్ లోప భూయిష్ట మైనదని బావించిడం వలన , ప్రతి లక్ష జనాభాలో జరిగిన అత్యాచార సంఘటనలు ఆదారంగా దేశాల స్తానాలు నిర్ణయించడం జరిగింది .  లేటేస్త్ లెక్కల ప్రకారం ,ప్రతి లక్ష మందిలో అత్యాచారానికి గురి అయిన వారి సంఖ్య్స ప్రకారం లెక్కలు వేసి స్తానాలు నిర్ణయించగా క్రింది విదంగా దేశాలు వాటి స్థానాలు ఉన్నాయి .

(1) Lesotho (91.6 per 100000), 

(2) Trinidad & Tobago (58.4 per 100000), 

(3) Sweden (53.2 per 100000), 

(4) Korea (33.7 per 100000), 

(5) New Zealand (30.9 per 100000),

(6) United States of America (28.6 per 100000), 

(7)Belgium (26.3 per 100000),  

(8 )  Zimbabwe  (25.6 per 100000) and 

  (9)  United Kingdom (23.2 per 100000).


ఈ విదంగా చూస్తె టాప్ టెన్ పొజిషన్ లో మన దేశం లేనందుకు మనం గర్వ పడక పోయినా ,ప్రంపంచ వ్యాప్తంగా స్త్రీల పై జరుగుతున్నా అత్యాచారాలు కు ఆ యా సామాజిక ,చారిత్రిక కారణాలు ఎలా ఉపకరిస్తున్నాయో ,ఇంచు మించు అలాగే ఈ దేశం లోను ఉపకరిస్తున్నాయని , ఇతర దేశాలతో పోల్చుకుంటే ,మన దేశం అత్యాచారాలను నిరోదించటమ్ లో  కొంత మెరుగైన స్తితి లోనె ఉందని తెలుసుకోవటానికి పై గణాంకాలు ఉపయోగ పదతాయి. 


SOURCE :-   http://www.wonderslist.com/10-countries-highest-rape-crime/

                                            (7/3/2015 Post Republished). 
 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన