మొగుడు కాపురం చెయ్యటం లేదని , కుర్రాడ్ని బలి ఇచ్చిన మహా ఇల్లాలు .!!
ఎంత ఆదునిక యుగమని చెప్పుకుంటున్నప్పటికి అజ్ణానం ప్రజల్ని వీడటం లేదు అనిపిస్తుంది ఈ ఉదంతం వింటూంటే. చెన్నై లో ఒక బార్య, తన భర్త తనతో తరచూ గొడవపడటానికి కారణం దుష్ట శక్తులని నమ్మిన ఆమే, దాని నివారణ కోసం పక్కింటి రెండేళ్ల పిల్ల వాన్ని బలి ఇచ్చిందట.ఒక వ్యక్తి ఇచ్చిన సలహ మేరకే తాను ఇలా చెయ్యల్సి వచ్చిందని పోలిసులకు చెప్పిందట. ఆ నరబలి కార్యక్రమంలో ఆ వ్యక్తి కూడ పాల్గొన్నాడట. దాని కోసం రెండు వేల రూపాయలు కూడ ఆ వ్యక్తికి ముట్ట చెప్పిందట. పాపం ఆ పిల్ల వాడిని కన్న తల్లి తండ్రుల కడుపుకోత బాదను ఎవరు తీర్చగలరు?
మొగుడికి తెలియకుండా ఇతర వ్యక్తితో కలిసి నరబలి పూజలో పాల్గొన్న సదరు స్త్రీ యొక్క సంసారం మొగుడితో ఎలా సజావుగా సాగుతుంది?బార్యా భర్తలలో అభిప్రాయబేదాలు ఉంటే, అవి తప్పనిసరిగా వారి వారి ప్రవర్తనలలో వాటికి మూలాలు ఉంటాయి. వాటిని సరిదిద్దుకోవటానికి పెద్దల సలహాలు, సహాయం అవసరమవుతుంది. ఒక వేళా అది తమ ఖర్మానుసారం జరుగుతుందని ఎవరైనా విశ్వసిస్తే, దానికి దైవ పూజలు చెయ్యాలి అని బావిస్తే, ఇతరులకు హాని అంటే ఏ జీవ రాశికి హాని కలుగచెయ్యని పూజలు మాత్రమే చెయ్యాలి తప్పా ఇలా నీచాతి నీచమైన ప్రక్రియలు చేపట్టి మానవత్వాన్ని మంట గలపరాదు కదా.
సంసారం అంటే సర్థుబాటు. ఈ లోకంలో కనీసం జీవిత బాగస్వామితో జీవితాంతం సర్థుకుపోయే మనస్తత్వం లేకుంటే, పెండ్లి చేసుకోవడం మానేస్తే మంచిది. పెండ్లి చేసుకుని, చీటికి మాటికి గొడవపడుతూ, సమాజానికి అంగీకారయోగ్యం కాని పనులు చేస్తూ, వివాహవ్యవస్తను అవమానపరుస్తున్న బార్యా బర్తలు ఎంతమాత్రం క్షమార్హులు కారు.ఇటువంటి వారి వల్ల వారి కుటుంబాలు కంటే ఎక్కువుగా బాదపడేది పక్కనున్న ఇతర కుటుంబాలు.కాబట్టి మనం మంచిగా ఉంటే చాలదు ఏదుటీవారు సహితం ఉంటున్నారా లేదా అన్నది గమనించడం మంచిది. మనకంటే చిన్న వారు తప్పులు చేస్తుంటే వారిని మందలించడం సామాజిక బాద్యతల్లో ఒకటి అని మరచి పోకూడదు.
(14/4.2013 Post Republished).
Comments
Post a Comment