పెండ్లి కానివారు , పెటాకులు అయిన వారు, "హృదయం" విషయం లో ఒకటే నట !

                                                             

 

                                           "మనువు ", వివాహం , కల్యాణం ,పెండ్లి ,పేరు ఏదైతేనేం భారతీయుల జీవితంలో అది  ఒక ముక్యమైన ఘట్టం .స్త్రీ పురుషులకు బ్రహ్మ ముడి ని వేసి సంపూర్ణ మానవుడిగా జీవించడానికి అవకాశ మిచ్చె మహత్తర తంతు . మనువు మహాశయుడు చెప్పిన "ఆశ్రమ " సిద్దాంతం ప్రకారం  ప్రతి మనిషికి "గృహస్త " ఆశ్రమం కంపల్సరి .అసలు  సంసారి కాని వాడికి సన్యాసి అయ్యే అర్హత లేదు . కాబట్టి మన ఋషులు సైతం తగిన కన్యను వివాహమాడడం ద్వారా గృహస్త ఆశ్రమం స్వీకరించి ప్రశస్తి గాంచారు  తప్పా పెండ్లి ,పెటాకులు లేకుండా , సంసారం అంటే ఏమిటో తెలియకుండా సంసార సారం చెప్పడానికి సాహసించలేదు . చివరకు భగవద్ అవతారాలు కూడా వివాహమాడి దానికున్న విశిష్టతను తెలియ చేసారు . పెండ్లి కాని వాడు ఎంత జ్ఞాని అయినా  భగవంతుడు కాలేదు , గృహస్తు కు మాత్రమె ఆ అర్హత . ఇదే సత్యం నారదుల వారి వలన తెలుస్తుంది . నారదుడు ఎంత జ్ఞానవంతుడైనా అతడు పరిపూర్ణుడు కాలేడు . అందుకే అతడు నిత్యం బగవత్ నామ స్మరణ చేస్తూ , సతి సమేత త్రిమూర్తులను కీర్తిస్తూ నిత్యం త్రిలోక సంచారం చేస్తుంటాడు .

               సరే ! పైన చెప్పిందంతా  సాంప్రదాయ బావం కాబట్టి , పాత చింత కాయ పచ్చడి  అనుకునే వారు నేడు తక్కువేమీ కాదు. ఎవరినో ఎందుకు , మన ధర్మ ప్రబోదకులు, గురువులే పెండ్లిళ్ళు లేకుండా , మాత లు,పితలు , గా మారి జ్ఞాన బోద  చేస్తుంటే చెవిలో పువ్వులు పెట్టుకుని వినవలసిన అగత్యం గృహస్తులకు కలుగుతుంది . పెండ్లి అయిన వారు పెండ్లి కాని వారి కాళ్ళకు మొక్కడం , పెండ్లి కాని వారు పెండ్లి అయిన వారిని దివించడం రెండూ సాంప్రదాయ వ్యతిరేకమైన పనులే . ఇవ్వన్ని ఎందుకు పెట్టారు అంటే , వివాహo వలన మనిషికి ఒనగూడే సౌకర్యాలు , మేలు దృష్టిలో పెట్టుకుని , ఏంతో  అనుభవం మిద హిందువుకు "మనువు" ను మస్ట్ చేసారు మన పెద్దలు . అసలు మనిషి అంటే స్త్రీ పురుషుల ఏక రూపం . మనిషి "మనువు " సంతతి అని చెప్పడానికి ఇదే కారణం . పెండ్లి కాని వాడు పరిపూర్ణ మనిషి కాడు . పెండ్లి తర్వాతే అతడు సంపూర్ణ మానవుడు అవుతాడు . అందుకే పెండ్లి కాని వాడు చనిపోయినా అతడిని ఒంటి బడితే కు కట్టి తిసుకువేడతారు .

   సరే ! ఎవరెన్ని చెప్పినా విదేశి బావజాలం మత్తులో ఉన్నవారికి తలకేక్క్కక పోవచ్చు . వారికేదైనా శాస్త్రీయంగా చెప్పాలి . అలాగే చెపుదాం . ఇటివల అమెరికాలో జరిగిన "అమెరికన్ కాలేజి అప్ కార్డియాలజీ కాన్పరెన్స్ " లో శా స్త్రవేతలు , ఒక విషయం ప్రకటించారట . అదేదో ఆషామాషీ పరిశోదనా సారంశం కాదు . సుమారు 35 లక్షలు మంది మిద అద్యయనం చేసి మరి కనుగున్న సత్యం! దాని ప్రకారం వివాహ బందానికి "గుండె ఆరోగ్యం " కి దగ్గర సంబంధం ఉంది అట . పెండ్లి అయిన వారి గుండె ఉన్నంత పదిలంగా పెండ్లి కాని వారికి ఉoడదట. అలాగే పెండ్లి అయి విడాకులు తీసుకున్న వారు , దురదృష్ట వశాత్తు జీవిత బాగాస్వామిని కోల్పోయిన వారిలో కూడా హృదయ సమస్యలు ఎక్కువెనట . వీరిలో మానసిక ఒత్తిడి , ఊబకాయం సమస్యలు ఉత్పన్నమై చివరకు అది గుండె మిద ప్రబావం చూపే అవకాశాలు ఎక్కువట . చూసారా ! "మనువు "  వలన మనిషికేన్ని లాబాలో ! అందుకే కామోలు మన పెద్దలు అనుభవ పూర్వకంగా చెప్పింది ." సంసారి కానివాడు సన్నాసి అవుతాడు తప్పా సన్యాసి (జ్ఞాని , సర్వసంగ పరిత్యాగి ) కావడం కల్ల ". నమ్మితే సుఖముంది .


 "ఏదైనా మనసున మనసై , బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే బాగ్యమూ , అదే స్వర్గమూ " కదా ! ఆ పాత మదురాన్ని మరొకసారి ఆస్వాదించండి .

(30/3/2014 Post Republished).

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!