"పెట్టు -పట్టు -కొట్టు " అనే ఫేస్ బుక్ వ్యాపారం లో లక్షలు సంపాదించిన వరంగల్ మాయలేడి !!?
మోసాలు చేసి పెండ్లిళ్ళు చేసుకోవడం కొంతమంది మగవాళ్ళ పేటెంట్ రైట్ ఏమీ కాదు. అవకాశం చిక్కితే అతివలు అంతకంటె ఘనులే అని నిరూపించే ఎన్నో ఉదంతాలు ప్రస్తుత సమాజం లో కంటున్నాం . వింటున్నాం. అలాంటి మాయలేడి కోవలోకే వస్తుంది వరంగల్ కి చెందిన ఈ మాయలేడి కేసు. కాకపోతే ఇలాంటి మాయలాడి వలలో పడే మగవాళ్ళు ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి పూర్తి విచారణ చేయకుండా ఎలా ఆమె ఉచ్చులో చిక్కుకున్నారో అర్దం కావటం లేదు. వివరాలులోకి వెలితే , వరంగల్ కి చెందిన ఆమె బ్రతకడానికి ఏ వ్యాపారం అయితే బెస్ట్ అని ఆలోచించగా , ఆలోచించగా ఆమెకొక బ్రహ్మాండ మైన ఆలోచన వచ్చిందంట. ఇంతవరకు ఆడపిల్లలను పెండ్లిళ్ళ పేరుతో మోసం చేస్తూ సమాజం లో దర్జాగా బ్రతుకుతున్న కొంత మంది నిత్యపెండ్లి కొడుకులు ఆమెకు స్పూర్తిగా నిలిచారు. మోసపు పెండ్లిళ్ళు చేసుకోవడం లో మగాళ్ళు పేటెంట్ రైట్ కలిగిఉండం ఆమెకు ఏ మాత్రం నచ్చలేదు. అన్ని రంగాల్లో పురుషులతో పాటు స్త్రీలు సమానమే అని రుజువు చేసుకుంటున్న ఆధునిక సమాజం లో "మోసపు పెండ్లిళ్ళు&qu