అత్యాచార నిరోదానికంటే, అప్పులు వసూలు చేసుకోవడానికి ఎక్కువుగా ఉపయోగపడుతున్న "నిర్భయ" చట్టం
ఈ దేశంలో కఠిన చట్టాలు చేయడానికి మన ప్రజా ప్రతినిదులకి నెలరోజులు పడితే దానిని దుర్వినియోగం చేయడానికి కేటుగాళ్లకు ఒకే ఒక రోజు చాలు ! డిల్లీలో నిర్భయ ఉదంతం తర్వాత దేశ వ్యాప్తంగా జరిగిన అందోళన ల వల్ల , స్త్రీల మిద జరుగుతున్నా లైంగిక దాడులను నిరోదించే ఉద్దేశ్యంతో "నిర్భయ " చట్ట సవరణలు చేసారు . ఈ కఠిన చట్ట సవరణల వల్ల స్త్రీల మిద అత్యాచారాలు అగుతాయని చట్ట నిర్మాతల తో పాటు ప్రజలూ ఆశించారు . కాని విచిత్రంగా డిల్లిలోనే నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా లైంగిక దాడులు తగ్గినట్లు లేదు . అయితే నిoది తులకి ఈ కేసుల్లో బెయిల్ ఇవ్వడమనేది ఉండదు కాబట్టి , విచారణ కూడా త్వరగానే పూర్తీ చెయ్యడం వలన కేసుల డిస్పోజల్స్ కూడా త్వరగానే జరిగాయి . కాని సంవత్సరం తర్వాత గణాంకాలు పరిశిలిస్తే దిమ్మ తిరిగే నిజాలు వెల్లడి అయ్యాయి . చివరకు వేశ్యలు అప్పులు వసూలు చేసుకోవడానికి కూడా పోలీసులను మేనేజ్ చేసి రేప్ కేసులు పెడుతున్నారు అంటే ఈ దేశం లో కఠిన చట్టాలకు పట్టిన దుస్తితి ఏమిటో వేరే చెప్పక్కర లేదు !. డిల్లీలో 2012 సంవత్సరంలో మొత్తం 661 రేప్ కేసులు నమోదు