ఇలాంటి పనికి రాని కొడుకుని కంటే , తల్లి తండ్రులు శ్మశానం లో కూడా ప్రశాంతంగా నిద్ర పోలేరట !
తల్లి బ్రతికి ఉన్నంత కాలం ఆమె బాగోగులు పట్టించుకోకుండా , చెల్లెలి మీద ఆమె సంరక్షణా బారం వదిలేసిన కొడుకు ,తల్లి చనిపోయిన రెండు నెలలకు ,ఆస్తి కోసం చెల్లి మీద ఆరోపణలు చేయడమే కాక , తల్లి శవాన్ని శ్మశానం నుండి తవ్వి తీయించి పరిక్షలు చేయిస్తున్నాడట! పాపం ఆ తల్లి ఎంతటి పాపం చేసుకుంటే ఇలాంటి పుణ్యాత్ముడు పుట్టాడో! పున్నామ నరకం నుంచి రక్షించే వాడు పుత్రుడు అని "పుత్రుడు " కి ఉన్న అర్దాన్ని మార్చాల్సిన రోజులు ఇవి! చచ్చినా సరే , వెంటాడి వేదించే వాడేరా "కొడుకు" అని తల్లి తండ్రులు అర్దం చెప్పుకునే పరిస్తితులు దాపురిస్తున్నాయి . కుటుంబాల్లో తల్లి తండ్రుల సంరక్షణా బారo ని మోయలేని బారంగా తల...