ఎందరినో వల వేసి పట్టినోడు, అమ్మాయి వలలో పడి జైలు పాలయ్యాడు!
తెహెల్కా! దీని పేరు చెపితే తప్పులు చేసే వారికి కొంచం గుండె గుబేలు మంటుంది! పెద్ద పెద్ద వారిని తన స్టింగ్ ఆపరేషన్ ల ద్వారా పరేషాన్ చేసిన ఘనత ఈ మాగజైన్ కు ఉంది. మొట్టమొదటగా 2000 సంవత్సరం లో క్రికెట్ మాచ్ పిక్సింగ్ కుంభ కోణం ని తన స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయట పెట్టి సెన్సేషనల్ అన్న తన ఉనికిని బహిర్గత పరచింది. అలాగే రక్షణ ఆయుదాల కుంభకోణం కేసులో నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ తో ఏకంగా రెండు జాతీయ పార్తీల నాయకులే రాజీనామాలు చెయ్యాల్సి వచ్చింది. అందులో మన తెలుగు వారైన B.J.P.బంగారు లక్ష్మన్ గారు ఒకరు. ఇలా ఏది చేసినా ఒక సెన్సేషనల్ గా చేస్తూ , రాజకీయ నాయకులే కాక ఇతర వర్గాల వారి గుండెల్లో కూ డా రైళ్ళు పరిగెత్తించ గలిగింది. తెహెల్కా అంటే తెలుగులో సంచలనం అని అర్దం. దీని వ్యవస్తా పకులులో ఒకరైన "తరుణ్ తేజ్ పాల్" దీనికి ప్రదాన సంపాదకులు కూడా . ప్రముఖ పెమినిస్ట్ షోమా చౌదరి మేనిజింగ్ ఎడిటర్. వీరి పత్రిక పాపులర్ అయ్యాక చా...