Posts

Showing posts from December, 2015

"కాలామని" + కాంతామణి = కాల్ మనీ

Image
ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 20 వేల కోట్ల రూపాయల స్కాం గా అభివర్ణిస్తున్న "కాల్ మని " వ్యవహారంలో సామాన్య ప్రజలకు అంతుపట్టని అనేక విషయాలు ఉన్నాయి. చూడబోతే కాల్ మనీ గుట్టును కావాలనే పధక రచయితలు బయటపెట్టడం వలననే వెలుగులోకి వచ్చినట్లు కనపడుతుంది. దానిలో బాగంగానే పోలిస్ వారి దాడులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయా అనే అనుమానం కూడా కలుగుతుంది.

 ఈ  కాల్ మని దందాలో చోటామోటా రాజకీయ నాయకులు, క్రింది స్తాయి పోలిసులు అప్పులు ఇచ్చిన వారైతే , వాటిని తీసుకుని తిరిగి కట్టలేని వారు ఎక్కువమంది స్త్రీలే కావడం విశేషం . సదరు స్త్రీ లు ఫోన్ చేయగానే ఇంటికి వెళ్లి కేవలం ప్రామిసారి నోట్లు మీద సంతకాలు లాంటివి తీసుకుని  లక్షలు , లక్షలు ఇచ్చెయ్యడం , తిరిగి వారు వడ్డీ కాదు కదా అసలు కూడా చెల్లించలేని పక్షం లో, వారితో వ్యభిచారం చేయించి అయినా తమ డబ్బులు రాబట్టుకోవాలని చూసే నీచ సంస్క్రుతి , రెగ్యులర్ గా డబ్బులను వడ్డిలకు తిప్పే వారిలో ఉంటుందా? ఇలా చేస్తే వారి వడ్డి వ్యాపారాలు  మూతపడి  పోతాయని తెలియదా వారికి? కాబట్టి సాంప్రదాయ వడ్డీ వ్యాపారస్తులు కాని, కష్టార్జితాన్ని వడ్డిలకు ఇచ్చి సంపదను పెంచుకోవాలని …

ఆంద్రా అసెంబ్లీ ని అల్లలాడిస్తున్న ఒక్క "ఆడ ధీర " !!

Image
ఆమె గారి పేరు రోజా ! పేరుకే రోజా యే కాని ,ముట్టుకోక ముందే కసక్కున దిగుతాయి ముళ్ళు లాంటి మాటలు. ఆమె గారు రాజకీయ రంగ ప్రవేశం చేయకముందు చలన చిత్ర రంగం లో తనదైన హావబావ శైలి తో రాటు దేలిన నటి మణి కాబట్టి, ఆ అనుభవం రాజకీయ రంగానికి పనికి వచ్చింది. ఆమె గారు అసెంబ్లీలో మాట్లాడే మాటలు లో మాటర్ ఉన్నా లేకపోయినా , హవాబావాలు తో అధికార పార్టి సబ్యులను కట్టడి చేస్తూ ప్రతి పక్షానికి ఆనందం చేకూర్చడం లో సపలిక్రుతురాలు అవుతుంది ఈ మాజీ నటీ మణి. ఆమె ను ఎదుర్కోవడానికి  మగ సభ్యులకు  మహా ఇబ్బంది అనుకుంటే   అధికార పార్టిలోని మహిళా సభ్యులకు కూడా ఆమె నోట్లో నోరు పెట్టే దమ్మున్న వారు లేకుండా పోయారు. చివరకు ఆమె గారి మాటల దాడి సాక్షాత్ ముక్యమంత్రి గారి మీదకే మల్లె సరికి , ఇక తట్టుకోలేక ఏడాది పాటు అసెంబ్లీ  నుండి సస్పెండ్ చేసి "హమ్మయ్య " అని ఊపిరి పీల్చుకున్నారు రాజ్యాంగ పరిరక్షకులు.

                        నోరు ఉంది కదా , లేడిస్ తెగించి మాట్లాడితే ఎంతటి వారైనా చేసే దేమిలేదు అని అనుకునే రోజా గారి లాంటి వారికి చెంప పెట్టు లాంటిది సస్పెన్షన్ ఆస్త్రం. బహుసా తెల…

Google గమ్మత్తు గా "సాష్టాంగ భుజంగాసనాలు " యానిమేషన్ !!

Image
నేను  "S.S.M Ashramam (Surya Savarnika Manavu AshramaM  " అనే నా ఇంగ్లీష్ బ్లాగులో, ఏప్రియల్ 18 2015 నాడు "SURYA NAMASKAR -THE BEST SPIRITUAL YOGA " అనే టపాలో సూర్య నమస్కారాలకు సంబందించిన కొన్ని చిత్రాలు పెట్టడం జరిగింది. అయితే ఈ  రోజున Google ఫొటోస్ నుండి ఒక మెస్సేజ్ వచ్చింది . అదేమిటంటే నేను పెట్టిన చిత్రాలు లో నుండి "సాష్టాంగ ఆసనం ", భుజంగాసనం  చిత్రాలను కలిపి యానినిమేషన్ చిత్రం గా మలచడం జరిగిందని. ఆ యానిమేషన్ చిత్రం చూస్తే అచ్చంగా  ఒక అమ్మాయి సముద్రపు ఒడ్డున ఉదయపు ఎక్సర్సైజ్ లు చేస్తున్నట్లే ఉంది కదూ !. పై చిత్రం సదరు గూగుల్ వారి యానిమేషన్ చిత్రమే. ఇక నా బ్లాగు టపా కోసం క్రింది లింక్ ను క్లిక్ చేయండి.


Surya Namaskar- The best Spiritual Yoga !

"రూల్ అప్ లా " ఉన్నంతకాలం , "తీఫ్ ఫెస్టివల్ " అయినా "భీఫ్ పెస్టివల్ " అయినా 'నహీ చలేగా!నహీ చలేగా !'

Image
మన రాష్ట్రం పక్కనే ఉన్న ఒకానొక పొరుగు రాష్ట్రం లో "దొంగల పల్లె " ఉంది అట. ఈ  మద్య మన పోలిస్ వారు వారిని అరెస్ట్ చేయడానికి అని వెడితే ఊరు ఊరంతా కలసి పోలిస్ వారి మీద దండ యాత్ర చేస్తే ఆశ్చర్య పోవడం పోలిసుల వంతు అయింది అట. అసలు విషయం ఏమిటంటె , ఆ పల్లెలో ఉన్న వారిలో ఎక్కువ శాతం మంది కుల వ్రుత్తి ఏమిటంటే దొంగతనం చేయడం. తర తరాలుగా వారి తాత ముత్తాతల కాలం నుండి దొంగతనాలు చేస్తూ తద్వారా సంపాదించిన దానితో రాజ భోగాలు అనుభవిస్తున్నారు. అయితే వారి పల్లె ఉన్న ప్రాంతం లోని పోలీసులకు వారికి మద్య ఒక "పెద్దమనుషుల ఒప్పందం " లాంటిది ఉందట. దొంగతనాలు వారి రాష్ట్రం లో చేయడానికి వీలు లేదు. పక్కనే ఉన్న మన రాష్ట్రం లో చేసి సొమ్మును వారి రాష్ట్రానికి చేరిస్తే , మన రాష్ట్ర పోలిసులు అరెస్ట్ లు చేయడానికి వచ్చినా సహకరించకుండా ఉండటమో , లేక సమాచారం ముందుగా సంబందిత దొంగలకు చేర వేయడం ద్వారా వారు పట్టుబడకుండా , స్తానిక పోలిస్ వారికి సహకరించాలి అన్న మాట. ఇలా సహకరించినందుకు పోలిస్ వారి వాటా పోలీసులకు ఉంటుంది . తమ జూరిస్డిక్షన్ లో దొంగతనాలు జరుగవు పై అధికారుల ఒత…

పెండ్లి అయిన "సానియా మీర్జా " గారు , "Miss " ఎలా అయ్యారు ! ఓ 'రబ్బా' '!!!?

Image
నాకు తెలిసినంతవరకు ఇంగ్లీష్ లో వివాహితులు అయిన స్త్రీ పురుషులను సంబొందించడమ్ లో వివక్షత ప్రపంచ వ్యాప్తంగా ఉంది. పురుషుడు అవివాహితుడు అయినా , వివాహితుడు అయినా సంబోదించడం తేడా ఏమి ఉండదు . మిస్టర్ X అని సర్వకాల సర్వాస్తల యందు పిలువవచ్చు . కాని అదే స్త్రీ అయితే పెండ్లి కాక ముందు Miss Y  అని పిలువబడిన ఆమె పెండ్లి అయ్యాక మాత్రం Mrs Y (మిస్సెస్) అని పిలువబడుతుంది. ఇది అందరి విషయం లో ఒకటే అనుకునే వాణ్ని ఇన్నాళ్ళు . కాని ఈ సంబోధ సూత్రం "ఇండియాలో ఇంతులకు రక్షణ లేదహో " అని చాటి చెపుతున్న మన టెన్నిస్ తార "సానియా మీర్జా " గారికి  వర్తించదని , నిన్నటి ఇండియన్ ఎక్ప్రేస్ ఆమె తరపున ఇచ్చిన వివరణ చూసే దాక నాకు తెలియదు. ఒకవేళ ఇండియన్ ఎక్స్ప్రెస్స్ వారు స్త్రీలను సంబొదించడమ్ లో ఉన్న వివక్షతను వ్యతిరేకించి, పురుషులు మాదిరే స్త్రీలను కూడా సర్వకాల , సర్వాస్తల యందు Miss గానే ఉదహరిస్తున్నారేమో ?

                ఇంతకీ విషయం ఏమిటంటే , ఈ  మద్య మద్యప్రదేశ్ ప్రబుత్వం వారు మన టెన్నిస్ తార గారిని  వార్షిక క్రీడా అవార్డుల పంక్షన్ కి  పిలిచ…

పుట్టింట్లో ఉన్నా , అత్తింట్లో ఉన్నా , కూతురు కూతురేరా డొంగ్రే ! ---- ఛత్తీస్ గడ్ హైకోర్ట్

Image
అదేదో   సినిమాలోమహనటులు స్వర్గీయ  శ్రీ S.V రంగారావు అన్న డైలాగ్ పేమస్ డైలాగ్ గా మారి ప్రేక్షకుల నోళ్ళల్లో నానుతూ ఉండేది . అదే "అడవిలో ఉన్నా , బోనులో ఉన్నా పులి పులేరా డొంగ్రే " అన్న డైలాగ్ . ఇందులో డొంగ్రే అన్నది ఉతపదం. అదిగో అలాంటి డైలాగ్ ను గుర్తుకు తెచ్చింది  మొన్న ఛత్తీస్ గడ్ హైకోర్ట్ వారు ఒక కేసులో  ఇచ్చిన తీర్పు. "శ్రీమతి సరోజినీ బాయి vs స్టేట్ అప్ ఛత్తీస్ గడ్ " అనే కేసులో హై  కోర్టు వారు  సంచలన తీర్పును చెపుతూ  పుట్టింట్లో ఉన్నా ," అత్తింట్లో ఉన్నా , కూతురు కూతురే" అని నొక్కి చెపుతూ , చనిపోయిన తండ్రి ఉద్యోగ హక్కును పొందడానికి పెండ్లి అయిన కొడుక్కి ఎంత హక్కు ఉంటుందో , పెండ్లి అయిన కూతురికి అంతే హక్కు ఉంటుందని , దానిని కాదనడం పౌరుడికి రాజ్యాంగ ప్రసాదించిన ప్రాదమిక హక్కులను కాదనదమేని , ఇది ఖచ్చితంగా స్త్రీ పురుషుల మద్య వివక్షను చూపడమే కాబట్టి  ఆర్టికిల్ 16 (2) కు వ్యతిరేకమని బల్ల గుద్ది మరీ చెప్పింది. కేసు వివరాలు లోకి వెలితే

                                   జల్దేవ్ ప్రదాన్ అనే వ్యక్తీ ఛత్తీస్ గడ్ లోని మహాసమండ్ లో జనవనరుల శాఖలో ఉద్యొగం…

మతం "యాగం " చేస్తుంటే , విజ్ఞానం "ఆగమాగం " చేస్తుంది!!

Image
మత పరమైన అన్ని క్రతువులు విశ్వాసం కు సంబందించినవి. ప్రపంచ వ్యాప్తంగా ఈ  మతం, ఆ మతం అని లేకుండా అన్ని మతాలలో విశ్వాసాలకు సంబందించిన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవేవి సైన్స్ దృష్టితో పరిసిలీస్తే నేడు సమాజాభివ్రుద్దికి పనికి వచ్చేవిగా అనిపించకపోవచ్చు. కాని వ్యక్తిగత దృష్టితో   చూస్తే కొన్ని కోట్లు ఖర్చు చేసినా మనిషికి లభించని అలౌకిక ఆనందం తో కూడుకున్న పాజిటివ్ దృక్పదం , ఆయా మత వర్గాల ప్రజలలో కలిగించడానికి , ఈ విశ్వాస పూరిత క్రతువులు దోహదపడుతున్నాయని చెప్పవచ్చు. అలాంటి కోవకు చెందినవే పురాణాలలో చెప్పబడి , నేటికి కొనసాగుతున్న "యజ్ఞాలు " యాగాలు . భారత రాజ్యాంగం తన ప్రజలకు ఇచ్చిన మత స్వేచ్చకు అనుగుణంగా యజ్ఞాలు , యాగాలు చేసుకునే స్వేచ్చ ఉంది . దాని గురించి మాట్లాడాల్సిన అవసరం దేవుని నమ్మని నాస్తికులకు కాని, హిందూయేతర మతస్తులకు కాని లేదు.

                          ఈ  మద్య  విజ్ఞాన వాదులం అని హేతువాదులం అని విర్రవీగే కొందరు , కేవలం హిందూ మతం కి సంబందించిన విశ్వాసాలను పలుచన చేసే మాటలు మాట్లాడుతూ , ఇతరమతాల…